Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హోదా మీద సినిమా జనాల భయం అదేనా?

హోదా మీద సినిమా జనాల భయం అదేనా?

ప్రత్యేక హోదా గురించి ఒకరిద్దరు సినిమా జనాలు మాట్లాడారు. మిగిలిన వాళ్లంతా మౌనం వహించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ జనాలు కాస్త గట్టిగా విమర్శలు చేయడం, ఆపై సినిమా వాళ్లు కూడా రివర్స్ కావడం జరిగిపోయింది. అయినా కూడా, ఇంత జరిగినా సినిమా జనంలో రావాల్సిన కదలిక రాలేదు.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో సంబంధాలు వున్న సురేష్ బాబు, రాఘవేంద్రరావు, మురళీమోహన్, కెఎస్ రామారావు, బోయపాటి, రాజమౌళి లాంటి సినిమా పెద్దలు మాట మాట్లాడలేదు. ఇంక హీరోలైతే సరేసరి. బావా గల్లా జయదేవ్ కోసమన్నా మహేష్ ఓ మాట అనలేదు. పవవ్ కళ్యాణ్ కోసమన్నా మిగిలిన మెగా హీరోలు మాట్లాడలేదు. పదవులు తీసుకున్న రాఘవేంద్రరావు లాంటి వాళ్లు మాట్లాడకపోవడం ఏమిటి?

అసలు విషయం వేరంట. ఇదంతా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య బిగుసుకున్న వ్యవహారం. ఇప్పుడు ఇందులో వేలుపెడితే కేంద్రానికి కోపం వస్తుంది. వచ్చిదంటే, మరుక్షణం ఇన్ కమ్ టాక్స్ జనాలు ఇంటికి వచ్చి పడతారు. తమిళనాడులో కమల్ కు, విశాల్ కు, ఇంకా చాలామందికి ఇది అనుభవం అయింది.

అసలే బాహుబలికి వందల కోట్లు లాభాలు వచ్చాయన్న వార్తలు వున్నాయి. అది నిర్మించింది రాఘవేంద్రరావు ఫ్యామిలీనే. సినిమా జనాలు అందరికీ ఇన్ కమ్ టాక్స్ భయమే. ఈ విషయంలో గట్టిగా టైమ్ తీసుకోలేదు తమిళనాడులో. అందుకే ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ పెదవి విప్పడం లేదని గుసగుస వినిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?