ఇంటర్వ్యూ తెచ్చిన తకరారు

సాధారణంగా పేరున్న పెద్ద డైరక్టర్లు మీడియాకు ఎప్పుడు పడితే అప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వరు. వాళ్ల సినిమా విడుదలకు ముందు మాత్రం తప్పదు కాబట్టి, సినిమా ప్రచారానికి కూడా పనికి వస్తుంది కాబట్టి ఇంటర్వూలు ఇవ్వడం…

సాధారణంగా పేరున్న పెద్ద డైరక్టర్లు మీడియాకు ఎప్పుడు పడితే అప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వరు. వాళ్ల సినిమా విడుదలకు ముందు మాత్రం తప్పదు కాబట్టి, సినిమా ప్రచారానికి కూడా పనికి వస్తుంది కాబట్టి ఇంటర్వూలు ఇవ్వడం రివాజు. అక్కడ కూడా సెలెక్టెడ్ ఫ్యూ అన్నట్లు వుంటుంది వ్యవహారం. అలా ఇంటర్వూ ఇచ్చినపుడు, తీసుకున్న మీడియా సంస్థలు చాలా కేర్ ఫుల్ గా వుంటాయి.

వాటిని బాగా ప్రొజెక్ట్ చేస్తాయి.కానీ ఇటీవల ఓ పెద్ద దర్శకుడికి మాత్రం చేదు అనుభవం ఎదురైందని తెలుస్తోంది. మాంచి పేరున్న టాప్, ఇంటలెక్చ్యువల్ దర్శకుడి ఇంటర్వూ కావాలని, ఓ లీడింగ్ డైలీ ప్రయత్నించింది. అందుకోసం ఆ డైరక్టర్ తో సినిమా చేస్తున్న నిర్మాతలను రకరకాల మార్గాల్లో ప్ర యత్నించి ఒప్పించింది. ఫుల్ పేజీ ఇంటర్వ్యూ ప్రచురిస్తామని మాట కూడా ఇచ్చినట్లు బోగట్టా. మొత్తానికి ఇంటర్వూ జరిగింది.

కానీ మర్నాడు చూస్తే షాక్. సదరు దర్శకుడి ఇంటర్వూ పావుభాగంలో వేసి, మూడు వంతుల్లో మరో సీనియర్ నటి ఇంటర్వూ ప్రచురించారు. దాంతో షాక్ తినడం దర్శకుడి ఇంటర్వూ ఇప్పించిన యూనిట్ వంతయింది. తాము ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ ఇప్పిస్తే ఇలా చేస్తారా? అని ఆ మీడియా జనాలపై మండిపడినట్లు తెలుస్తోంది.

ఎక్కడో పొరపాటు జరిగిందని, తరువాత మరోసారి ఫుల్ పేజీ ఇంటర్వ్యూ వేసి కాపన్ సేట్ చేస్తామని అటు నుంచి హామీ వచ్చినట్లు తెలుస్తోంది. ఏమైనా మామూలుగానే ఇంటర్వ్యూలు ఇవ్వడం, మీడియా ముందుకు రావడం చాలా తక్కువగా చేసే ఆ దర్శకుడు ఇలా జరిగిన తరువాత మళ్లీ అంత సులువుగా మీడియా ముందుకు వస్తారా? ఇంటర్వ్యూలు ఇస్తారా?