Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'మా' కమిటీకి మెగాస్టార్ రాజీనామా?

'మా' కమిటీకి మెగాస్టార్ రాజీనామా?

తెలుగు సినిమా నటీనటుల సంఘ 'మా'. ఇటీవల కొంత కాలంగా మా సంఘ వ్యవహారాలు సైలంట్ గా వున్నాయి. మా లోని రెండు వర్గాలు గతంలో నానా యాగీ చేసుకున్నాయి. 

ఎన్నికల ముందు ఎన్నికల తరువాత కూడా ఓ వర్గం మరో వర్గం మీద కిందా మీదా అయిపోయారు. ఆఖరికి ఓపెన్ డయాస్ మీద చిరంజీవి గట్టిగా వార్నింగ్ ఇచ్చాక వ్యవహారాలు సద్దుమణిగాయి.

ఇన్నాళ్ల తరువాత మళ్లీ ఏమయిందో తెలియదు కానీ, మా సంఘంలోని డిసిప్లినరీ కమిటీ పదవికి మెగాస్టార్ చిరంజీవి రాజీనామా చేసారన్న వార్త ఇండస్ట్రీలో గుప్పుమంది. 

ఉరుము లేని పిడుగులా ఇప్పుడు ఎందుకు ఆయన రాజీనామా చేసి వుంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈరోజే ఆయన తన రాజీనామా లేఖను మా కీలక బాధ్యులకు పంపించారని తెలుస్తోంది. 

ఈ విషయం వెనుక విషయం ఏమై వుంటుందో తెలియాల్సి వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?