Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగాస్టార్ కోసం కేజిఎఫ్ ఫైట్ మాస్టర్లు

మెగాస్టార్ కోసం కేజిఎఫ్ ఫైట్ మాస్టర్లు

వేదాలం రీమేక్ కు సైలంట్ గా సన్నాహాలు జరుగుతున్నాయి. డైరక్టర్ మెహర్ రమేష్ సీరియస్ గా ఇదే పని మీద వున్నారు. ఇప్పటికే ఓ పాటకు మహతి స్వరసాగర్ ట్యూన్ అందించడం జరిగిపోయింది. ఇఫ్పుడు మరో టెక్నీషియన్ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కేజిఎప్ సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న ఫైట్ మాస్టర్లు అంబు-అరివు లను వేదాలం సినిమా కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్యనే ఈ జంట ఫైట్ మాస్టర్లు హీరో నాగశౌర్య చేస్తున్న సినిమా కు వర్క్ చేయడానికి ఇక్కడ కు వచ్చారు. ఆసియన్ సునీల్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పడు జరుగుతోంది. దీనికి ఫైట్లు కంపోజ్ చేయడానికి వచ్చిన వీరు డైరక్టర్ మెహర్ రమేష్ తో కలిసి మెగాస్టార్ ను కలిసినట్లు బోగట్టా.

వేదాలం సినిమాను నిర్మాత అనిల్  సుంకర నిర్మిస్తారని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ సినిమాను ఆచార్య తరువాత నిర్మిస్తారా? లేదా లూసిఫర్ రీమేక్ తరువాత నిర్మిస్తారా? అన్న క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. 

నాకు జగన్ ఇచ్చిన గౌరవం అది

నా ఆరోప్రాణం వెళ్ళిపోయింది..కె విశ్వనాధ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?