Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ కు బన్నీ ఫోన్ !

ఎన్టీఆర్ కు బన్నీ ఫోన్ !

కరోనా టైమ్...ఎవరి ఇళ్లలో వాళ్లే వున్నారు. ఎవరు ఎలా వున్నారు తెలుసుకోవాలంటే ఫోన్ లో హాయ్ అనాల్సిందే. ఎవరికైనా ఇదే మార్గం. అందుకే టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన బన్నీ, మరో టాప్ హీరో ఎన్టీఆర్ కు ఫోన్ చేసి పలకరించారట.  'ఎలా వున్నావ్ బ్రదర్..ఏంటీ సంగతి అంటూ..' దానికి ఎన్టీఆర్ కూడా 'ఫైన్ రా..నువ్వెలా వున్నావ్ ' అంటూ పలకరించినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఆ ఇద్దరి ఫోన్ సంగతి వాళ్లకే తెలుస్తుంది. కానీ వారి సన్నిహిత వర్గాల నుంచి మాత్రం ఈ విశేషాలు వినిపిస్తున్నాయి.

ఇండస్ట్రీ కబుర్లు, కరోనా ముచ్చట్లు ఇద్దరి మధ్య దొర్లినట్లు తెలుస్తోంది. టాప్ లైన్ డైరక్టర్ సుకుమార్ తో పుష్ప పాన్ ఇండియా సినిమాను  బన్నీ త్వరలో స్టార్ట్ చేయబోతున్నాడు. రాజమౌళితో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. తరువాత లైన్ లో త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ లాంటి టాప్ డైరక్టర్లు రెడీగా వున్నారు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తరువాత పవన్ కళ్యాణ్ తో వీలయితే ఓ సినిమా చేసి మళ్లీ బన్నీ దగ్గరకే వచ్చే ఆలోచనలో వున్నారు. బన్నీతో చేస్తున్న సుకుమార్ కూడా ఎన్టీఆర్ తో మళ్లీ మరో సినిమా చేసే ఐడియాలో వున్నారు. నాన్నకు ప్రేమతో సినిమా తరువాత మళ్లీ ఆ ఇద్దరి కాంబినేషన్ అవుతుంది.

ఇలా డైరక్టర్లను అటు ఇటు మార్చుకుంటే బన్నీ-ఎన్టీఆర్ మాంచి ఫ్రెండ్స్ అనిపించుకుంటున్నారు. మరో మెగా హీరో రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ కు ప్రాణమిత్రుడు అన్న సంగతి తెలిసిందే. గతంలో సీనియర్లు చిరంజీవి, నాగార్జున ఎన్టీఆర్ ను బాగా అభిమానించేవారు. ఇప్పుడు తరువాత జనరేషన్ లో అది స్నేహంగా మారింది.

ప్ప‌టికీ శ్రీదేవితో చేసిన డాన్స్ లే గుర్తొస్తున్నాయి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?