Advertisement

Advertisement


Home > Politics - Andhra

అనకాపల్లి చుట్టూ మోహరిస్తున్న వైసీపీ!

అనకాపల్లి చుట్టూ మోహరిస్తున్న వైసీపీ!

ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి కీలకమైన రాజకీయ స్థావరం. ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. విపక్షాలకు ఆటపట్టు. కొత్త పార్టీలకు స్వాగత ద్వారం. అనకాపల్లి నుంచి ఎంతో మంది ఉద్దండులు పోటీ చేశారు. అనకాపల్లి ప్రతీ ఎన్నికలోనూ రాజకీయంగా ఆసక్తిని పెంచేస్తూ ఉంటుంది.

ఈసారి అనకాపల్లి అసెంబ్లీ సీటు ఎవరికి దక్కుతుంది. పార్లమెంట్ ఎవరి పరం అవుతుంది అన్నది ఒక కీలకమైన చర్చగా ఉంది. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని జనాభాలో కాపులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఆ తరువాత స్థానం కొప్పుల వెలమలది, మూడవ స్థానం గవరలది. ఈ మూడు సామాజిక వర్గాలు అనకాపల్లి రాజకీయాన్ని దశాబ్దాలుగా శాసిస్తూ ఉంటాయి.

అనకాపల్లి ఎంపీగా టీడీపీ కూటమి తరఫున ఈసారి కడప జిల్లా వాసి సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పోటీ చేస్తున్నారు. అనకాపల్లి అసెంబ్లీకి వైసీపీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన మలసాల భరత్ కుమార్ పోటీలో ఉన్నారు. ఈయన రాజకీయాలకు కొత్త.

తలపండిన మాజీ మంత్రి గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామక్రిష్ణ టీడీపీ కూటమి నుంచి పోటీలో ఉన్నారు. వైసీపీ సామాజిక వర్గాల పరంగా చూస్తే సరైన నిర్ణయమే తీసుకుంది. రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారికే ఎంపీ ఎమ్మెల్యేలుగా నిలిపింది.

కూటమి గవర వెలమ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. దాంతో కాపుల చుట్టూ వైసీపీ మోహరిస్తోంది. గత ఎన్నికల్లో కూడా వైసీపీ కాపు ప్లస్ గవర కాస్ట్ ఈక్వేషన్స్ తో వెళ్ళి సక్సెస్ అయింది. టీడీపీ గవర ప్లస్ గవర ఈక్వేషన్స్తో వెళ్ళింది. జగన్ వేవ్ లో ఓటమి పాలు అయింది. అంతకు ముందు 2014లో ఎన్నికలు చూస్తే వైసీపీ గవర ప్లస్ కాపు ఈక్వేషన్ తో వెళ్తే టీడీపీ అదే ఫార్ములా అనుసరించింది. ఆనాడు టీడీపీని విజయం వరించింది.

వైసీపీ చూస్తే గడచిన మూడు ఎన్నికల్లోనూ కాపులను కలుపుకుంటూ వస్తోంది. ఈసారి కూడా అత్యధిక జనాభాగా ఉన్న వారికే చోటు అని తేల్చి చెప్పింది. ఇప్పుడు కాపులు అంతా తమ వైపు ఉంటారని వైసీపీ నమ్మకంగా ఉంది. కాపులు ఎంపీగానో ఎమ్మెల్యేగానో లేకుండా గడచిన రెండు దశాబ్దాల రాజకీయం సాగలేదు.

ఈసారి కూడా అదే ఫార్ములాతో వైసీపీ వెళ్తోంది. అనకాపల్లి పార్లమెంట్ కి ఎన్నికల పరిశీలకుల నియామకంలో కూడా కాపులకు పెద్ద పీట వేస్తోంది. ఈసారి ఎమ్మెల్యే ఎంపీ రెండూ కూడా గెలవాలని వైసీపీ టార్గెట్ పెట్టుకుంది. దాంతో ఎవరిది విజయం అన్నది ఆసక్తిని పెంచుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?