Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆఫ్ ద రికార్డ్: అక్కినేని అప్ప‌ట్లోనే ఆ మాట‌న్నారా?

ఆఫ్ ద రికార్డ్: అక్కినేని అప్ప‌ట్లోనే ఆ మాట‌న్నారా?

సినిమా జ‌ర్న‌లిస్టుల్లో ఆఫ్ ద రికార్డుగా వినిపించే మాట ఇది. సామాజికంగా, సామాజిక‌వ‌ర్గంలో అక్కినేని ఫ్యామిలీది ఒక పెద్ద ఫ్యామిలీ. అందులోనూ అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకు సంతాన సంప‌ద గ‌ట్టిగా ఉంది. 

అక్కినేని నాగేశ్వ‌ర‌రావుతో వియ్యం అందుకోవాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు? ఆ మేర‌కు ఉత్సాహంతో సొంత సామాజిక‌వ‌ర్గం వారు, ఆ ఆస‌క్తి ఉన్న వారు... నాగేశ్వ‌ర‌రావును సంప్ర‌దించిన వైనాలు ఉన్నాయ‌ట‌. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు సంతానంతో త‌మ పిల్ల‌ల‌కు పెళ్లిళ్లు చేయాల‌ని కొంద‌రు డైరెక్టుగా ఆయ‌న‌తోనే త‌మ ఉద్దేశాన్ని బ‌య‌ట‌పెట్టేసిన సంద‌ర్భాలున్నాయ‌ట‌. 

వియ్యానికి స‌మ‌తూకం అయిన వారే అలా నాగేశ్వ‌ర‌రావు వ‌ద్ద మ‌న‌సు విప్పార‌ట‌. ఆ స‌మ‌యంలో అక్కినేని సూటిగానే స్పందించేవార‌ట‌. వియ్యాన్ని కోర‌డం అయితే కోరారు కానీ, త‌మ ఫ్యామిలీతో వియ్యం అంటే.. దాన్ని అన్ని వివాహా బంధాల్లా ఉంటుంద‌నుకోవ‌ద్ద‌ని సూటిగా చెప్పేవార‌ట అక్కినేని. 

త‌మ పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం, క‌ల్చ‌ర్ గురించి అక్కినేనికి బాగా ఎరుకేనేమో కానీ.. త‌న‌తో వియ్యాన్ని అయితే కోరుకోవ‌చ్చు కానీ, వివాహ‌బంధం మీద మాత్రం త‌ను భ‌రోసా ఇవ్వ‌లేన‌న్న‌ట్టుగా అక్కినేని స్పందించేవార‌ట‌. వియ్యానికి త‌గిన వారితో కూడా ఆయ‌న ఇదే మాట‌ను చెప్పేవార‌ట‌. 

ఆ మాట‌కు త‌గ్గ‌ట్టుగా అక్కినేని సినీ వార‌సుల్లో ప‌లు వేరు ప‌డ‌టాలు చోటు చేసుకున్నాయి. నాగార్జున‌, సుమంత్, నాగ‌చైత‌న్య‌.. ఈ వ‌ర‌స ఇలా సాగుతూ ఉంది. ఇక అఖిల్ ఎంగేజ్ మెంట్ ను ర‌ద్దు చేసుకోగా, అక్కినేని వార‌సుల్లో ఇంకా ఒక‌రు కూడా వేరుప‌డినట్టుగా స‌మాచారం. 

గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. ఇది సినీ జ‌ర్న‌లిస్టుల చ‌ర్చ‌లో చాలా పాత విష‌య‌మే. నాగ‌చైత‌న్య విడాకుల నేప‌థ్యంలో.. అక్కినేని విష‌యంలోని ఈ ఆఫ్ ద రికార్డు మాట మ‌రోసారి చ‌ర్చ‌లోకి వ‌స్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?