Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'పండగ' టికెట్ లు తెగాలంటే..?

'పండగ' టికెట్ లు తెగాలంటే..?

సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు మారుతి డైరక్షన్ లో తయారవుతున్న సినిమా ప్రతి రోజూ పండగే. సాయి ధరమ్ తేజ్ కు వున్న మార్కెట్ రీత్యా ఈ సినిమాకు మీడియం ఓపెనింగ్స్ అయితే వస్తాయి. మారుతి డైరక్షన్ కాబట్టి, ఇప్పటి నుంచీ ప్రచారం హడావుడి స్టార్ట్ చేసారు కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో మరీ ఎక్కువ బెంగ పెట్టుకోనక్కర లేదు. 

అయితే ఓపెనింగ్స్ బాగా రాబట్టడం కోసం బన్నీ ఫ్యాన్స్ ను వాడేసుకోవాలని గీతా సంస్థ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బన్నీ క్రేజ్ ఎంతో కొంత వుంది కదా? అందుకే ఆ క్రేజ్ ను వాడుకుని 'పండుగ' సినిమాకు మాంచి ఓపెనింగ్స్ రాబట్టే మాస్టర్ ప్లాన్ ఒకటి నిర్మాత బన్నీవాస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అదేంటీ అంటే ప్రతి రోజూ పండగే సినిమా మార్నింగ్ షో టైమ్ కు బన్నీ-త్రివిక్రమ్ కాంబో అలవైకుంఠపురములో ట్రయిలర్ విడుదల చేయడం. ప్రతి రోజూ పండగే సినిమా థియేటర్లలో ఆ ట్రయిలర్ ప్రదర్శించడం. అదీ చిట్కా. అదే టైమ్ కు ఆన్ లైన్ లో ఎలాగూ విడుదల చేస్తారు. కానీ థియేటర్ ఎక్స్ పీరియన్స్ వేరు కదా.

బన్నీ వాస్ ఐడియా బానే వుంటుంది ఆయన నిర్మాతగా వున్న ప్రతి రోజూ పండగే సినిమా వరకు. కానీ ఎక్కడైనా పెద్ద సినిమాతో చిన్న సినిమా ట్రయిలర్ వేసుకుంటారు. అంతే కానీ చిన్న సినిమాతో పెద్ద సినిమా ట్రయిలర్ వేయడం అంటే కాస్త ఆలోచించాల్సిందే. సాయితేజ్ సినిమాతో బన్నీ ట్రయిలర్ విడుదల చేసారని ఇక ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది.

పైగా ఇలా చేయడం వల్ల ఆన్ లైన్ హిట్ తగ్గితే మళ్లీ అదో రగడ. అసలే ఆన్ లైన్ హిట్ ల కోసం సోషల్ మీడియాలో ఒకరిమీద ఒకరు పడిపోయి,నానా రచ్చ అవుతోంది. అందువల్ల బన్నీ వాసు ప్లాన్ ను బన్నీ ఓకె అంటారో? అనరో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?