cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ సినిమా దర్శకుడు మారుతారా?

పవన్ సినిమా దర్శకుడు మారుతారా?

పవన్ కళ్యాణ్-మైత్రీ మూవీస్ సినిమా అంటూ చిరకాలంగా వినిపిస్తోంది. కానీ మెటీరియలైజ్ కావడం లేదు. ఇలా మెటీరియలైజ్ కాకపోవడానికి చాలా కారణాలు గ్యాసిప్ లు గా వినిపిస్తూ వస్తున్నాయి. 

దర్శకుడు కథ చెప్పలేదని ఓసారి.. కాదు, మైత్రీకి సినిమా చేయడానికి ఎవరో అడ్డం పడుతున్నారని ఇలా రకరకాలుగా వినిపిస్తూ వచ్చాయి. కానీ ఇది పక్కాగా తెలియకుండానే కాలం గడిచిపోతూ వస్తోంది.

ఈ మధ్యనే దర్శకుడు హరీష్ శంకర్ కథ చెప్పారని, పవన్ కొన్ని కరెక్షన్స్ సూచించారని వార్తలు వినవచ్చాయి. దాంతో మళ్లీ ఈ ప్రాజెక్టు మీద ఆశలు చిగురించాయి. కానీ లేటెస్ట్ గా మళ్లీ కొత్త గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. 

ఈ ప్రాజెక్టుకు వేరే దర్శకుడిని చూడమని పవన్ నిర్మాతలకు సూచించారని వినిపిస్తోంది. వీలైతే తాను కూడా ఏదైనా ప్రాజెక్టు సజెస్ట్ చేస్తానని, మీరు కూడా ట్రయ్ చేయండి అని పవన్ మైత్రీ అధినేతలకు చెప్పారనే గ్యాసిప్ ఇప్పుడు వినిపించడం ప్రారంభించింది.

ఈ గ్యాసిప్ ఎంత వరకు నిజమో తెలియదు కానీ చూస్తుంటే, హరీష్-పవన్ ప్రాజెక్ట్ మళ్లీ కాస్త వెనక్కు వెళ్లిందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పవన్ చేయాల్సిన ప్రాజెక్టులు అలా పడి వున్నాయి. 

పవన్ కోసం ఇటు హీరో సాయి ధరమ్ తేజ్ అటు దర్శకుడు సముద్రఖని పనులు మానుకుని అలా ఖాళీగా వేచి వున్నారు. 

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి