పుష్ప 2.. న భూతో న భవిష్యత్

దాదాపు 150 కోట్ల రూపాయలు పుష్ప 2 ప్రచారానికి ఖర్చు కాబోతోంది.

పుష్ప. 2 సంగతి కొత్తగా చెప్పడానికి ఏముంది? దాని కోసం వున్న ఎదురుచూపులు… ఫ్యాన్స్ పూనకాలు తెలిసిందే. వెయ్యి కోట్ల మార్కెట్ చేసారు. సినిమా విడుదల మాత్రమే బకాయి వుంది. మరి పబ్లిసిటీ సంగతి ఏమిటి? ఇప్పటి వరకు ఏ సినిమాకు జరగని రేంజ్ లో జరగనంత జరగబోతోంది అని తెలుస్తోంది.

దాదాపు 150 కోట్ల రూపాయలు పుష్ప 2 ప్రచారానికి ఖర్చు కాబోతోంది. పైగా ఈ 150 కోట్లు ఖర్చు చేస్తున్నది నిర్మాతలు అయిన మైత్రీ మూవీస్ కాదు. దేశంలోని వివిధ కార్పొరేట్ సంస్థలు.

ఇటీవల బన్నీ టీమ్ నుంచి ఓ వీడియో వచ్చిన సంగతి తెలిసిందే. తొలిసారి ఇన్ని బ్రాండ్ లు ఓ హీరో కిట్టీలోకి వచ్చాయి. ఇన్ని బ్రాండింగ్ లు అంటూ ఓ పేద్ద లిస్ట్ వదిలారు. అదీ విషయం. ఇప్పుడు ఈ బ్రాండింగ్ లు అన్నీ పుష్ప 2 ప్రచారం నిర్వహించబోతున్నాయి. ఏ భాషలో ఏ ఛానెల్ పెట్టినా ఇక పుష్ప 2 ప్రచారం కనిపిస్తుంది. ఏ పట్టణంలో ఏ హోర్టింగ్ చూసినా పుష్ప 2 ప్రచారం కనిపిస్తుంది.

టెరిటరీల వారీగా, రాష్ట్రాల వారీగా వివిధ సంస్థలు వాటి వాటి బడ్జెట్ ప్రకారం ప్రచారంలో పాలు పంచుకోబోతున్నాయి. పుష్ప 2 కు వున్న క్రేజ్ ను గుర్తించిన కార్పొరేట్ సంస్థలు ఇలా ముందుకు వచ్చాయి. వాటికి వున్న పబ్లిసిటీ బడ్జెట్ తో పోల్చుకుంటే పది, ఇరవై కోట్లు నథింగ్. అన్ని సంస్థలు కలిస్తే 150 కోట్లు ఇంకా నథింగ్.

పబ్లిసిటీ విషయంలో పుష్ప 2 ఓ చరిత్ర సృష్టించబోతోంది.

11 Replies to “పుష్ప 2.. న భూతో న భవిష్యత్”

Comments are closed.