Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆర్ఆర్ఆర్ టీజర్ కంటెంట్ ఇదేనా?

ఆర్ఆర్ఆర్ టీజర్ కంటెంట్ ఇదేనా?

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఇప్పటికి హీరో రామ్ చరణ్ పాత్రకు సంబంధించి విడియో బయటకు వచ్చింది. మంచి రెస్పాన్స్ నే వచ్చింది.

అప్పటి నుంచి ఎన్టీఆర్ భీమ్ పాత్ర విడియో కోసం అభిమానులు ఆసక్తిగా వేచి వున్నారు. ఇటీవలే ఈ విడియో వస్తుందని యూనిట్ ప్రకటించింది. 

మరో వారంలో ఆ విడియో వస్తుంది. ఈ విడియో కోసమే కొద్ది రోజుల క్రితం ప్రత్యేకంగా షూటింగ్ పెట్టారు. ఇంతకీ ఈ విడియో ఎలా వుండబోతోంది. దీని మీద ఆసక్తి కరమైన విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విడియోలో ఎన్టీఆర్ ను పలు గెటప్ ల్లో చూపిస్తారని తెలుస్తోంది.

ఓ మామూలు మనిషి నుంచి ఉద్యమకారుడైన కొమరం భీమ్ గా మారిన వైనం చకచకా రకరకాల వేషాల్లో చూపిస్తారని తెలుస్తోంది. ఆఖరికి తలకు పాగా  చుట్టుకున్న గెటప్ తో ముగుస్తుంది.

ఆరంభంలో షరాయి-లాల్చీ తో ఎన్టీఆర్ వుంటారు. ఈ గెటప్ లు అన్నీ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకునేలా కట్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. వినిపిస్తున్న వార్తలు నిజమైతే ఈసారి ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చే లేటెస్ట్ కంటెంట్ యూ ట్యూబ్ ను కాస్త షేక్ చేసే అవకాశం వుంది.

కొత్త చరిత్ర రాస్తున్నాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?