Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాహో టీమ్ కు లాస్ట్ మినిట్ టెన్షన్..?

సాహో టీమ్ కు లాస్ట్ మినిట్ టెన్షన్..?

బాహుబలి ప్రభాస్ లేటేస్ట్ భారీ సినిమా సాహో. అత్యంత భారీ బడ్జెట్ తో, సాంకేతిక సహకారంతో తెరకెక్కుతోందీ సినిమా. ఆగస్టు 15 విడుదల డేట్ గా ప్రకటించారు. టీజర్ వదిలారు. సాంగ్ ప్రోమో వదిలారు. అయితే సినిమా లాస్ట్ మినిట్ టెన్షన్ మాత్రం భయంకరంగా వెన్నాడుతోందని తెలుస్తోంది.

సినిమాకు చాలావరకు విఎఫ్ఎక్స్ వర్క్ వుంది. అదే సమస్య. అన్ని పనులు పూర్తయిపోయాయి. ఫైనల్ ఎడిట్ కూడా జరుగుతోంది. కానీ విఎఫ్ఎక్స్ పనులు మాత్రం పూర్తికావాల్సి వుంది. ఈ పనులు తీసుకున్న కంపెనీల నుంచి అవుట్ పుట్ వస్తే, మిక్స్ చేసుకుని, ఫైనల్ కాపీ రెడీ చేసి, సెన్సారుకు అందించాలి.

సినిమాను వరల్డ్ వైడ్ గా విడుదల చేయాల్సి వుండడం, ముఖ్యంగా బాలీవుడ్ లో భారీ విడుదల ప్లాన్ చేయడంతో, ఈ నెలాఖరులోనే సెన్సారు చేయించాల్సిన అవసరం వుందని తెలుస్తోంది. అందుకోసం సాహో టీమ్ కిందామీదా అవుతోంది. యువి క్రియేషన్స్ కీలక బాధ్యులంతా తలో పని తమ మీద వేసుకుని పరుగులు పెడుతున్నారు. దీంతో తెలుగు పబ్లిసిటీని కూడా పట్టించుకోవడం కష్టం అవుతోంది.

ఇలాంటి నేపథ్యంలో ఆగస్టు 15 విడుదల అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదని యువి క్రియేషన్స్ చాలా టెన్షన్ పడుతున్నట్లు బోగట్టా. ఈ డేట్ మిస్ అయితే ఆర్థికంగా కష్టమే కాకుండా, మాంచి డేట్ మిస్ అయినట్లు అవుతుంది. దీనివల్ల బాలీవుడ్ లో కూడా సమస్యలు వస్తాయి. ఇప్పుడు సాహో ముందువున్న అతిపెద్ద సమస్య ఇదే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15కు రావాలన్నదే. 

సందీప్ చెప్పినట్లే సినిమా ఉందా? అపజయాల నుంచి బయటపడేనా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?