సునీల్ ముందు జాగ్రత్త

నిర్మాత ఆసియన్ సునీల్ చాలా ప్రాక్టికల్ టైపు. కరోనా నేపథ్యంలో ఆయన నిర్మాణంలో వున్న చైతన్య-సాయిపల్లవి ల 'లవ్ స్టోరీ'.  కరోనా కల్లోలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఈ రోజు మళ్లీ…

నిర్మాత ఆసియన్ సునీల్ చాలా ప్రాక్టికల్ టైపు. కరోనా నేపథ్యంలో ఆయన నిర్మాణంలో వున్న చైతన్య-సాయిపల్లవి ల 'లవ్ స్టోరీ'.  కరోనా కల్లోలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఈ రోజు మళ్లీ ప్రారంభమైంది. సినిమా షూటింగ్ లకు ఇప్పుడు ఓ కొత్త క్రాఫ్ట్ వచ్చి చేరింది. కరోనా ప్రికాషన్స్ అనే కొత్త క్రాఫ్ట్  ను టేకప్ చేయడానికి జనాలు వున్నారు. అయితే ఏ మేరకు వాళ్లు పెర్ ఫెక్ట్ గా పని చేస్తారు అన్నది అనుమానం. ఇక్కడ డబ్బులు వృధా అనే దాని కన్నా సరిగ్గా చేయకపోతే మొత్తం షూటింగ్ మొదటికి వస్తుంది.

అందుకే నిర్మాత ఆసియన్ సునీల్ ఓ ప్లాన్ చేసారు. మిగిలిన క్రాఫ్ట్ ల సంగతి ఎలా వున్నా, ఈ ఒక్క కరోనా ప్రికాషన్ పని మాత్రం ఆయన తన పైన వేసుకున్నారు. దీని కోసం స్వంత టీమ్ ను పెట్టుకున్నారు. స్టాఫ్ ఫుడ్ ను ఆయనే తయారుచేయించుకుంటున్నారు. శానిటైజేషన్, మాస్క్ లు, ఇలాంటివి అన్నీ పర్యవేక్షించడానికి ఆయన స్వంత ఆఫీస్ టీమ్ ను పెట్టుకున్నారు. 

వచ్చిన స్టాఫ్ విషయంలో మాగ్జిమమ్ కేర్ తీసుకుంటున్నారు. దాదాపు మూడు వంతులు పూర్తయిన ఈ సినిమా ను డిసెంబర్ మూడో వారంలో విడుదల చేయాలన్నది నిర్మాతల సంకల్పం. అందుకే ఎటువంటి బ్రేక్  రాకుండా, నాన్ స్టాప్ గా షూటింగ్ జరగడానికి వీలుగా సునీల్ ఇన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రభాస్ 2 కోట్ల విరాళం