Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హాట్ గా క‌నిపిస్తే హీరోయిన్ల‌కు కొత్త తిప్ప‌లు!

హాట్ గా క‌నిపిస్తే హీరోయిన్ల‌కు కొత్త తిప్ప‌లు!

అరకొర దుస్తుల్లో, అర్ధ‌న‌గ్నంగా, ఆకుల‌ను అడ్డం పెట్టుకుని.. త‌మ అందాన్ని ఇలా డిఫ‌రెంట్ గా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్న హీరోయిన్ల‌కు ట్రోల్స్ త‌ప్ప‌డం లేదు. చిరిగిపోయిన‌ట్టుగా, పీస్ ల దుస్తుల‌తో క‌నిపిస్తూ వారు వారి అందాల‌ను కొత్త‌గా ఆవిష్క‌రిస్తూ ఉన్నారు. వీలైనంత‌గా అందాల ఆర‌బోస్తూ ఉన్నారు. వారు అలాంటి దుస్తులు ఎందుకు ధ‌రిస్తారు, ఎందుకు అర్ధ‌న‌గ్నంగా క‌నిపిస్తారంటే.. దానికి అనేక స‌మాధానాలుంటాయి. ఎవ‌రికి వారు ఆ విష‌యాల్లో త‌మ అభిప్రాయాల‌తో ఉంటారు.

అలాంటి అభిప్రాయాల సంగ‌తెలా ఉన్నా.. అలా హాట్ గా క‌నిపిస్తున్న హీరోయిన్ల‌ను సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు నెటిజ‌న్లు. మొన్న ప్రియాంకా చోప్రా, ఇప్పుడు కియ‌రా అద్వానీ.. ఈ మ‌ధ్య కాలంలో వీళ్లు అర‌కొర దుస్తుల‌తో ఇచ్చిన పోజులు టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాయి. నెట్లో వీరి ఫొటోలు షికారు చేశాయి. గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్స‌వానికి హాజ‌రైన ప్రియాంకా చోప్రా నిలువెత్తు రూపంలో త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శించింది. స‌గం శ‌రీరానికి స‌రిపోయే దుస్తుల‌తో క‌నిపించింది.

ఆ దుస్తుల్లో ప్రియాంక ఆరేసిన అందాల‌కు క‌ళ్ల‌ను అప్ప‌గించిన వారు కొంద‌రైతే, ఆమెను విమ‌ర్శించిన వాళ్లు మ‌రి కొంద‌రు. విమ‌ర్శ‌లు అంటే.. ఆమె అస‌భ్యంగా క‌నిపించింద‌ని కొంద‌రు, ఆమె అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో బొత్తిగా కొత్త‌ద‌నం లేక‌పోయింద‌ని మ‌రి కొంద‌రు! ఇక కియ‌రా అద్వానీపై కూడా ట్రోల్స్ చెల‌రేగిపోయాయి. ఆకు చాటు న అందాల‌ను ఆవిష్క‌రిస్తూ ఆమె ఫొటోలు దిగి, వాటిని ఇన్ స్టాలో పోస్టు చేసింది. ప్ర‌స్తుతం లీడింగ్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కియారా అలా క‌నిపించ‌డం సెన్షేష‌న్ అయ్యింది. అదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లూ త‌ప్ప‌లేదు. కియ‌రా పిక్ తో మీమ్స్ క్రియేట్ చేశారు. ఆ పిక్చ‌ర్ కూ క‌బీర్ సింగ్ లో ఆమె చెంప‌దెబ్బ తినే సీన్ కు సంబంధించి ముడిపెట్టి మ‌రి కొంద‌రు ఫ‌న్ చేశారు. హాట్ గా క‌నిపిస్తే హీరోయిన్ల‌కు ఇలాంటి తిప్ప‌లు త‌ప్పేట్టుగా లేవు ఇప్ప‌ట్లో!

అంతా మోడీ చెప్తేనే చేసాను.. నా తప్పు లేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?