బన్నీకి నో చెప్పిన హీరోయిన్?

ప్రియాంక చోప్రాను ప్రయత్నించారట. అయితే ఆమె నో చెప్పినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

బన్నీ-అట్లీ సినిమాను అధికారికంగా ప్రకటించారు. సైన్స్-ఫిక్షన్ మూవీ అని, బడ్జెట్ 600 కోట్లు అంటూ ఇప్పటికే ప్రచారాలు మొదలైపోయాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోయిన్ కూడా చేరింది.

బన్నీ సినిమాకు కచ్చితంగా పాన్ ఇండియా హీరోయిన్ కావాల్సిందే. అందుకే ప్రియాంక చోప్రాను ప్రయత్నించారట. అయితే ఆమె నో చెప్పినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

రాజమౌళి-మహేష్ సినిమాలో నటిస్తోంది ప్రియాంక. వాళ్లు ఎప్పుడు షూటింగ్ కు పిలిస్తే అప్పుడు రావాలనేది ఒప్పందం. మరోవైపు తన బెస్ట్ ఫ్రెండ్ హృతిక్ కోరడంతో క్రిష్-4కు కూడా ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. నిన్ననే హృతిక్-ప్రియాంక మధ్య మీటింగ్ కూడా జరిగింది.

ఇవి కాకుండా, చేతిలో 2 హాలీవుడ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, అట్లీ సినిమాకు టైమ్ కేటాయించలేకపోయింది ప్రియాంక చోప్రా.

ఇలాంటి పాన్ ఇండియా సినిమాలకు ప్రస్తుతం హీరోయిన్ల కొరత ఉంది. రష్మికను తీసుకుందామంటే, పుష్ప-1, పుష్ప-2 సినిమాల్లో ఆమెనే హీరోయిన్. కియరా అద్వానీ గర్భం దాల్చింది. కత్రినా కైఫ్ సినిమాలు తగ్గించింది. దీపిక ఇంకా సినిమాలు స్టార్ట్ చేయలేదు. అలియా, జాన్వి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

12 Replies to “బన్నీకి నో చెప్పిన హీరోయిన్?”

Comments are closed.