త్వరలో శుభవార్త చెప్పేస్తారా?

ఇప్పటి వరకు ఈ హీరో ఇలా ప్రేమలో పడిన దాఖలా లేదు. అలా అని అమ్మాయిల వెంట పడిన దాఖలా కూడా పెద్దగా లేదు.

టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకడు అతగాడు. ఒడ్డు పొడవు.. అందం.. చందం.. మంచి ఫిజిక్‌తో ఆమె. ఈ ఇద్దరు మంచి ప్రేమలో వున్నారు అని గత కొంత కాలంగా గ్యాసిప్ లు వినిపిస్తూనే వున్నాయి. వెబ్ సైట్లలో కనిపిస్తూనే వున్నాయి. అయితే చాలా సినిమా ప్రేమలు పెళ్లి వరకు వెళ్లవు. ఏదో ఒక స్టేజ్ లో ఆగిపోతాయి.

ఇంతకన్నా గాఢమైన ప్రేమలు గతంలో పెళ్లి వరకు వెళ్లినవీ వున్నాయి. ఆగినవీ వున్నాయి. అందువల్ల ఈ యువ హీరో.. హీరోయిన్ల ప్రేమ కూడా పెళ్లి వరకు వెళ్తుందా అన్న అనుమానాలు వున్నాయి.

యువ హీరో చిన్నవాడేమీ కాదు. పెద్దింటి వాడు.. సరైన పెళ్లి ఈడు దాటేసిన వాడే. అలా అని పక్కన పెట్టేందుకు వీలు కూడా లేదు. అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. మంచి క్రేజ్ వుంది. కానీ ఇద్దరూ ప్రేమలో పడడం మాత్రమే కాస్త ఆశ్చర్యం. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ హీరో ఇలా ప్రేమలో పడిన దాఖలా లేదు. అలా అని అమ్మాయిల వెంట పడిన దాఖలా కూడా పెద్దగా లేదు.

త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారని, వారి ప్రేమ సీరియస్ ప్రేమే అని ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఇద్దరూ తమ తమ కెరీర్ లో బిజీగా వున్నారు కనుక, కొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. కొద్ది రోజులు ఆగితే అనౌన్స్ మెంట్ రావచ్చు అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.

29 Replies to “త్వరలో శుభవార్త చెప్పేస్తారా?”

  1. పేర్లు రాయలేని జర్నలిస్ట్ ఒకడు ఎయిడ్స్ వచ్చి పోతాడు అని ఉగాది పంచాంగ శ్రవణం లో చెప్పారు

Comments are closed.