అయ్యో బీఆర్ నాయుడు.. త‌డ‌బాటు ఎందుకు?

అనారోగ్యంతోనూ, వృద్ధాప్యంతోనూ, అలాగే ప్ర‌మాద కార‌ణంగా గోశాల‌లోని గోవులు ప్రాణాలు కోల్పోయాయ‌ని ఈ వాక్యాల అర్థం కాదా?

టీటీడీ చైర్మ‌న్‌గా బీఆర్ నాయుడు బాధ్య‌త తీసుకున్న వేళా విశేషం ఏంటో గానీ, అప‌చారాల‌పై అప‌చారాలు. టీటీడీ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌న టికెట్ల జారీలో తొక్కిస‌లాట‌. ఆరుగురు భ‌క్తుల మృత్యువాత‌. తాజాగా టీటీడీ నేతృత్వంలో న‌డిచే ఎస్వీ గోశాల‌లో గోమాత‌ల మృతిపై టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి సంచ‌ల‌న విష‌యాలు చెప్పారు.

మూడు నెల‌ల్లో వంద‌కు పైగా టీటీడీ గోశాల‌లో గోమాత‌లు ప్రాణాలు కోల్పాయ‌ని చేసి, యావ‌త్ స‌మాజం దిగ్భ్రాంతికి చెందింది. ఎందుకంటే, గోవును కేవ‌లం జంతువు భార‌తీయ స‌మాజం చూడ‌దు. ప‌ర‌మ ప‌విత్ర పూజ‌కు దేవుడిచ్చిన వ‌రంగా భావిస్తారు. అందుకే గోమాత అని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పిలుచుకుంటాం, పూజిస్తాం. అలాంటి త‌ల్లికి స‌రైన తిండితీర్చాలు అందించ‌క‌పోవ‌డంతో ప్రాణాలు పోయాయ‌ని తెలిసి, ప్ర‌తి హృద‌యం త‌ల్ల‌డిల్లింది.

భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి వెలుగులోకి తెచ్చిన విష‌యాల‌పై టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయ‌కుడు ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌డ‌బ‌డ‌డాన్ని ఆయ‌న అక్ష‌రాల్లో క‌నిపించింది. అంతేకాదు, స్వామి వారి సేవ‌లో వుంటూ, గోవుల మృతి చెందాయ‌న్న నిజాన్ని అంగీక‌రించ‌క‌పోతే, స్వామి వారి కోపాగ్నికి గురి కావాల్సి వుంటుంద‌నే భ‌యం క‌నిపించింది. బీఆర్ నాయుడి ట్వీట్‌లో ఈ వాక్యాలు చాలు… గోవులు మృతి చెందాయ‌నే నిజాన్ని అంగీక‌రించార‌ని చెప్ప‌డానికి.

“ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేము, కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగా, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మం”

అనారోగ్యంతోనూ, వృద్ధాప్యంతోనూ, అలాగే ప్ర‌మాద కార‌ణంగా గోశాల‌లోని గోవులు ప్రాణాలు కోల్పోయాయ‌ని ఈ వాక్యాల అర్థం కాదా? అయినా సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలోనే టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామ‌లారావు ప‌ర‌స్ప‌రం నువ్వెంత అంటే నువ్వెంత అని దూషించ‌కున్న‌ట్టు ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌లో క‌థ‌నం వ‌స్తేనే, అబ్బే అదంతా అబ‌ద్ధం అని చెప్పిన వాళ్లు, గోమాత‌ల మ‌ర‌ణాల్ని అంగీక‌రిస్తార‌నే భ్ర‌మ‌లు ఎవ‌రికీ లేవ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. క‌నీసం నిజాన్ని ఒప్పుకోవ‌డం వ‌ల్ల ప్ర‌శాంతంగా నిద్ర‌పోయేందుకు స్వామి వారు అనుగ్ర‌హిస్తారు.

లేదంటే నిత్యం పీడ‌క‌ల‌లు త‌ప్ప‌వ‌ని స్వామి వారి సేవా భాగ్యం క‌లిగిన పెద్ద‌లు గ్ర‌హిస్తే మంచిది. గోమాత‌ల ప్రాణాలు పోవ‌డం వైసీపీ, టీటీడీ మ‌ధ్య వివాదం కాదు. కోట్లాది మంది హిందువులు ఆరాధించే, పూజించే సున్నిత‌మైన విశ్వాసానికి సంబంధించిన వ్య‌వ‌హారం. అందుకే భ‌క్తుల నుంచి ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంద‌ని గ్ర‌హించి, క‌నీసం గోశాల‌లో వున్న వాటినైనా కాపాడాల్సిన బాధ్య‌త త‌మ‌పై వుంద‌ని టీటీడీ పాల‌క మండ‌లి, ఉన్న‌త అధికార యంత్రాంగం గుర్తిస్తే, అదే శ్రీ‌వారికి చేసే మ‌హాసేవ‌.

6 Replies to “అయ్యో బీఆర్ నాయుడు.. త‌డ‌బాటు ఎందుకు?”

  1. Ys వివేకా గుండె పోటుతో బాత్రూం లో కాలుజారి కిందపడి చనిపోయారు, అలాంటివి మనం నమ్మాలి, ఇలాంటి వాటిని ఎట్టా నమ్మేది.

Comments are closed.