రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లులు ఆమోదించి గవర్నర్‌కు పంపితే, వాటిపై నెలలతరబడి నాన్చివేతపై సుప్రీంకోర్టు వెలువరించిన సంచలన తీర్పుపై చర్చ జరుగుతుండగానే, అలాంటిదే మరొకటి కూడా వెలువడడం గమనార్హం. గవర్నర్ల నుంచి వచ్చే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాల్సిందే అని సుప్రీంకోర్టు సమయాన్ని నిర్దేశించడం సంచలనం రేకెత్తిస్తోంది.
ఇటీవల తమిళనాడు గవర్నర్ రవి బిల్లుల్ని ఆమోదించకపోవడంపై స్టాలిన్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నెలలోపు బిల్లుల్ని ఆమోదించి తీరాల్సిందే అని సుప్రీంకోర్టు చెంప చెల్లుమనేలా సంచలన తీర్పు ఇచ్చింది. తాజాగా ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి విషయంలోనూ ఇదే విధానం వర్తిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడం విశేషం.
ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే బిల్లుల్ని నిలుపుదల చేసే అధికారం గవర్నర్లకు రాజ్యాంగం ఇవ్వలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా వుందని రాష్ట్రపతి భావిస్తే, ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించొచ్చని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించే సంగతి తెలిసిందే. కేంద్రానికి అనుకూలమైన ప్రభుత్వాలు రాష్ట్రాల్లో లేకపోతే, గవర్నర్లు ఉద్దేశపూర్వకంగానే ఏదో ఒక కారణంతో ఆటంకం సృష్టిస్తుండడం తీవ్ర వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు తాజా ఉదాహరణ తమిళనాడు గవర్నర్ రవికుమార్ అనుసరిస్తున్న వైఖరి. అందుకే సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై బిల్లుల ఆమోదంలో గవర్నర్లు తాత్సారం చేయడానికి వీలు వుండదు. అలాగే రాష్ట్రపతి కూడా నిర్ణీత గడువులోపు నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతను సుప్రీంకోర్టు కల్పించినట్టైంది.
జాయిన్ అవ్వాలి అంటే
మరి జడ్జీ లు. తీర్పు లను రిజర్వ్ లో పెట్టొచ్చా ? ఒక్కో కేసును 25 సంవత్సరాలు నానా బెట్టొచ్చ ?? ఎలాంటి కాల పరిమితి లేదా ?? జస్ట్ asking nyaya వ్యవస్థ జవాబుందరీ తనం వద్దా ??
Join avvali ante open profile
ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ అమోదించిన చట్టాలు సుప్రీకోర్టు కొట్టెయ్యవచ్చు కానీ రాష్ట్రపతి గవర్నర్మా మాత్రం పెండింగ్ పెట్టరాదు