తిరుమ‌ల‌లో మ‌రో అప‌చారం

ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆలయంలో మ‌రో అప‌చారం చోటు చేసుకుంది.

ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆలయంలో మ‌రో అప‌చారం చోటు చేసుకుంది. వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో టీటీడీ నిత్యం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. దీంతో భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తింటున్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో భ‌ద్ర‌త ఎంత లోఫభూయిష్టంగా వుందో తాజా అప‌చార‌మే నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి పాద‌ర‌క్ష‌ల‌తో అనుమ‌తించ‌రు. అయితే ముగ్గురు భ‌క్తులు పాద‌ర‌క్ష‌ల‌తో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆల‌యంలోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించారు. ఆల‌య ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద‌కు వ‌చ్చే స‌రికి మూడు చోట్ల విజిలెన్స్ సిబ్బంది భ‌క్తుల్ని క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తుంటారు. అదేంటో గానీ, ఏకంగా చెప్పుల‌తో ఆల‌య మ‌హాద్వారం వ‌చ్చే వ‌ర‌కూ కూడా ఎవ‌రూ అడ్డుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం, ఆందోళ‌న క‌లిగిస్తోంది.

మ‌హాద్వారం వ‌ద్ద సెక్యూరిటీ సిబ్బంది పాద‌ర‌క్ష‌ల‌తో వ‌చ్చిన ముగ్గురు భ‌క్తుల్ని గుర్తించారు. పాద‌ర‌క్ష‌ల్ని బ‌య‌ట వ‌దిలేలా చేశారు. ఆ త‌ర్వాతే వాళ్ల‌ను ఆల‌యంలోప‌ల‌కి అనుమ‌తించారు.

భ‌క్తులు మ‌హాద్వారం వ‌ద్ద పాద‌రక్ష‌ల్ని బ‌య‌ట వ‌దులుతూ వీడియోకు చిక్కారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. భ‌క్తుల నుంచి టీటీడీ అధికార యంత్రాంగంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆల‌యంలో భ‌ద్ర‌త డొల్ల అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

6 Replies to “తిరుమ‌ల‌లో మ‌రో అప‌చారం”

  1. నార్త్ ఇండియా వాళ్ళకి దక్షిణ భారత దేశంలో ఆలయ పద్ధతులు సరిగా తెలియక పోవడం వలన వచ్చిన ఇబ్బందులు.

    వారు వేసుకున్నవి అసలైన చెప్పులు కాదు. ఎండ వేడి తట్టుకోవడానికి క్లాత్ తో చేసిన లాంటివి. అయినా కూడా ఆలయ పద్ధతులు ప్రకారం అలాంటి

    వి నిషిద్ధం కాబట్టి వారికి తెలియజెప్పల్సియన్ బాధ్యత అక్కడి సిబ్బంది కి వుంది.

    కానీ ఆలయ సిబ్బంది లో చాలా మంది వాటికన్ యేసు బిడ్డ లు , హిందూ వాలుగా చెలామణి అవుతున్నారు. ముందు వాళ్ళని ఏరి పారేస్తే, ఇలాంటివి తగ్గుతాయి.

Comments are closed.