గోరంట్ల మాధవ్ డ్రామా వెనుక‌.. చాలా క‌థే!

కేవ‌లం జ‌గ‌న్ దృష్టిలో ప‌డి, ఎమ్మెల్యే టికెట్ ద‌క్కించుకుని, మంత్రి కావాల‌నే ఆశ‌తోనే మాధ‌వ్ అతి చేశాడ‌ని సొంత పార్టీ నేత‌లు అంటున్నారు

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌తీమ‌ణి భార‌తిని తీవ్ర అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించిన కేసులో ఐటీడీపీ కార్య‌క‌ర్త చేబ్రోలు కిర‌ణ్ అరెస్ట్‌, అత‌నిపై మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ దాడి చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం వెనుక చాలా క‌థ ఉంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. గోరంట్ల మాధ‌వ్ వ్య‌వ‌హ‌రించిన తీరును వైసీపీ నేత‌లే త‌ప్పు ప‌డుతున్నారు. పోలీస్ ఆఫీస‌ర్‌గా ప‌ని చేసిన మాధ‌వ్‌కు చ‌ట్టాల గురించి తెలిసి కూడా, ఎందుకు ఆ విధంగా ఓవ‌రాక్ష‌న్ చేశార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఇటీవ‌ల రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌టించారు. ఆ సంద‌ర్భంగా హెలిప్యాడ్ వ‌ద్ద మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ నమ‌స్కారం చేసినా జ‌గ‌న్ చూసీచూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించార‌ని తెలిసింది. మ‌రోవైపు రాప్తాడు టికెట్‌ను అత‌ను ఆశిస్తున్నార‌ని స‌మాచారం. అనంత‌పురానికి తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డిని పంపి, మాజీ ఎంపీ వెంక‌ట్రామిరెడ్డిని ఎంపీగా పోటీ చేయించాల‌నేది మాధ‌వ్ ఆలోచ‌న‌గా వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

వైసీపీ అధికార ప్ర‌తినిధిగా గోరంట్ల మాధ‌వ్ నియమితులైన త‌ర్వాత రాప్తాడుకు త‌ర‌చూ వెళ్లడం మొద‌లు పెట్టారు. మీడియాతో మాట్లాడుతూ, రాప్తాడుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌డం వెనుక మాధ‌వ్ ఉద్దేశాన్ని ప్ర‌కాశ్‌రెడ్డి గ్ర‌హించారు. అందుకే ప్ర‌కాశ్‌రెడ్డి ఆ మ‌ధ్య మీడియా స‌మావేశం నిర్వ‌హించి త‌న ఓట‌మికి సొంత పార్టీ వాళ్లు కూడా కార‌ణ‌మ‌ని ప‌రోక్షంగా గోరంట్ల మాధ‌వ్‌, అనంత వెంక‌ట్రామిరెడ్డి గురించి చెప్పారు.

దీంతో రాప్తాడుకు మాధ‌వ్ వెళ్ల‌డం కాస్త త‌గ్గింది. అయితే లింగ‌మ‌య్య హ‌త్యను మాధ‌వ్ సీరియ‌స్‌గా ప‌ట్టించుకోలేద‌ని జ‌గ‌న్‌కు తెలిసింది. దీంతో గోరంట్ల మాధ‌వ్‌పై జ‌గ‌న్ గుర్రుగా ఉన్నారు. ఇదే స‌మ‌యంలో ఐటీడీపీ కార్య‌క‌ర్త త‌మ నాయ‌కుడి భార్య‌పై అవాకులు చెవాకులు పేల‌డాన్ని రాజ‌కీయ అవ‌కాశంగా మ‌లుచుకోవాల‌ని మాధ‌వ్ వ్యూహాత్మ‌కంగా కిర‌ణ్‌పై దాడికి చొర‌బ‌డిన‌ట్టు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కేవ‌లం జ‌గ‌న్ దృష్టిలో ప‌డి, ఎమ్మెల్యే టికెట్ ద‌క్కించుకుని, మంత్రి కావాల‌నే ఆశ‌తోనే మాధ‌వ్ అతి చేశాడ‌ని సొంత పార్టీ నేత‌లు అంటున్నారు. మాధ‌వ్ అతి వెనుక అస‌లు కార‌ణాన్ని జ‌గ‌న్ తెలుసుకుని, జాగ్ర‌త్త‌గా వుంటారో లేదో చూడాలి.

10 Replies to “గోరంట్ల మాధవ్ డ్రామా వెనుక‌.. చాలా క‌థే!”

  1. టికెట్టు, మంత్రి..wow అబ్దుల్ కలాం కలలు కనమన్నాడురా అయ్యా కథలు మింగమనలేదు…

  2. మొత్తానికి భారతి రెడ్డి మ్యాటర్ లో “సింపతీ” రగల్చాలనుకుంటే..

    జగన్ రెడ్డి పట్ల ఇంకా “అసహ్యం” పెరిగేలా చేసాడు.. ఈ న్యూడ్ స్టార్..

    అది కవర్ చేయడానికి మన వెంకట్ రెడ్డి ఇంకో “తెగింపు” ఆర్టికల్ వదలాల్సి వచ్చింది..

    ..

    మన జగన్ రెడ్డి కి కూడా మ్యాటర్ లేదులే.. ఈ న్యూడ్ స్టార్ లతోనే పార్టీ నడపాలి..

    ఇంకా సిగ్గెందుకు.. ఇప్పుడు బొక్కలోనే ఉన్నాడుగా.. వెళ్లి ఈ అందగాడిని కూడా పరామర్శించమని చెప్పండి..

    మన జగన్ రెడ్డి కి నచ్చేటట్టు.. బట్టలిప్పేసుకుని “సిద్ధం” గా ఉంటాడు..

  3. గ్యాసూ.. నీకు తెలియని ఇంకో నిజం తెలిస్తే గుండాగి ‘చస్తావ్..

    ఇదంతా చెయ్యడానికి

    గోరంట్ల మాదవే.. కిరణ్ కి సూపరి ఇచ్చి అలా వాగించాడట..

    ఎలా ఉందీ ‘కుట్ర డ్రామా..

  4. ఐటీడీపి నే ఇటువంటి చేబ్రోలు కిరణ్ లాంటి దుర్మార్గులను పెంచి పోషిస్తుంది. గత్యత్రం లేక suspend చేసారు. NTR పెట్టిన party కి చెద పురుగుల్లగా చేరి NTR కి వెన్నుపోటు పొడిచి ప్రాణం తీసి ఇప్పుడు ఆయనకే దండ వేయటం ఒక్క మా బాబోరి కె సాధ్యం

    1. avunu correct ye mana nava randralu suddapusalu , entha aina mana laga axe potu , sister mother ni cheyaledu baboru. aina enka 30 years nati di enduku mana 2025 gurunchi cheppu

    2. అంతేగా జైల్ లో ఉన్నప్పుడు చచ్చిపోయే పార్టీని నిలబెట్టిన త*ల్లి చె*ల్లిని బయటికి పంపటం అంటే సన్మానం చేయటం కదా అప్పూ

    3. అంతేగా జై*ల్ లో ఉన్నప్పుడు చ*చ్చిపోయే పార్టీని నిలబెట్టిన త*ల్లి చె*ల్లిని బయటికి పంపటం అంటే సన్మానం చేయటం కదా అప్పూ

Comments are closed.