పాస్ట‌ర్ ప్ర‌వీణ్ మృతిపై తేల్చేశారు!

పాస్ట‌ర్ ప్ర‌వీణ్ ప‌గ‌డాల అనుమానాస్ప‌ద మృతిపై ఐజీ అశోక్‌కుమార్ తేల్చేశారు.

పాస్ట‌ర్ ప్ర‌వీణ్ ప‌గ‌డాల అనుమానాస్ప‌ద మృతిపై ఐజీ అశోక్‌కుమార్ తేల్చేశారు. గ‌త నెల 24న పాస్ట‌ర్ ప్ర‌వీణ్ మృతిపై అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ విష‌య‌మై కూట‌మి ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా స్పందించింది. ప్ర‌వీణ్ క్రిస్టియ‌న్ మ‌త ప్ర‌బోధ‌కుడు కావ‌డం, ఆయ‌న‌కు పెద్ద సంఖ్య‌లో అభిమానులు ఉండ‌డంతో నిజాల్ని నిగ్గు తేల్చేందుకు సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక చొర‌వ తీసుకున్న‌ట్టు టీడీపీ నేత‌లు చెబుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో శ‌నివారం ఐజీ అశోక్‌కుమార్ మీడియా స‌మావేశంలో ప్ర‌మాదం వ‌ల్లే పాస్ట‌ర్ ప్ర‌వీణ్ ప్రాణాలు కోల్పోయిన‌ట్టు స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. సాంకేతిక ప‌రిజ్ఞానంతో ద‌ర్యాప్తు చేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు. హైద‌రాబాద్ నుంచి రాజ‌మండ్రి వ‌ర‌కూ దారిపొడ‌వునా ప్ర‌వీణ్ ప్ర‌యాణానికి సంబంధించిన సీసీ పుటేజ్‌ను సేక‌రించామ‌న్నారు. దేన్ని వ‌దిలిపెట్ట‌కుండా విచార‌ణ చేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ప్ర‌యాణంలో భాగంగా ప్ర‌వీణ్ చేసిన యూపీఐ పేమెంట్స్‌ను కూడా సేక‌రించిన‌ట్టు ఐజీ తెలిపారు.

ఎవ‌రిపైనా త‌మ‌కు అనుమానం లేద‌ని ప్ర‌వీణ్ కుటుంబ స‌భ్యులు త‌మ‌కు చెప్పార‌న్నారు. మార్గ‌మ‌ధ్యంలో ప్ర‌వీణ్ ఆరుగురితో ఫోన్‌లో మాట్లాడిన‌ట్టు ఐజీ వెల్ల‌డించారు. జ‌గ్గ‌య్య‌పేట వ‌ద్ద రోడ్‌పై లారీని ఓవ‌ర్‌టేక్ చేస్తూ కింద ప‌డిపోయిన‌ట్టు ఆయ‌న తెలిపారు. అలాగే వేగంగా వ‌స్తూ కీస‌ర గ్రామం వ‌ద్ద రోడ్డు ప‌క్క‌న ప్ర‌వీణ్ ప‌డిపోయిన‌ట్టు ఐజీ తెలిపారు. అప్పుడు హెడ్‌లైట్ ప‌గిలిపోయింద‌న్నారు. ఆ త‌ర్వాత రామ‌వ‌ర‌ప్పాడు వ‌ద్ద కిందిప‌డ్డాడ‌ని, ఆ విష‌య‌మై ట్రాఫిక్ పోలీసుల‌కు ఆటో డ్రైవ‌ర్ చెప్పాడ‌న్నారు. ట్రాఫిక్ ఎస్ఐ అతనితో మాట్లాడిన‌ట్టు ఐజీ తెలిపారు.

చివ‌ర‌గా కొవ్వూరు టోల్‌ప్లాజా వ‌ద్ద‌కు రాత్రి 11.31 గంట‌ల‌కు చేరుకున్న‌ట్టు ఐజీ వెల్ల‌డించారు. అనంత‌రం న‌యారా పెట్రోల్ బంకు వ‌ద్ద రాత్రి 11.42 గంట‌ల‌కు రోడ్డు ప‌క్క‌న ప‌డిపోయిన‌ట్టు అశోక్‌కుమార్ చెప్పారు. దారిలో మూడుచోట్ల మ‌ద్యం కొనుగోలు చేసిన‌ట్టు ఐజీ తెలిపారు. లిక్క‌ర్ సేవించ‌డం వ‌ల్లే రోడ్డు ప్ర‌మాదానికి గురైన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింద‌న్నారు. మొత్తం 62 సీసీ కెమెరాల ద్వారా సేక‌రించిన పుటేజీ ద్వారా, సాంకేతికంగా లోతుగా విచార‌ణ జ‌రిపి, ప్ర‌వీణ్ మృతి ప్ర‌మాదం కార‌ణంగానే జ‌రిగిన‌ట్టు నిర్ధారించామ‌న్నారు.

18 Replies to “పాస్ట‌ర్ ప్ర‌వీణ్ మృతిపై తేల్చేశారు!”

  1. పాస్టర్ మృతితో మా అన్నని ఓదార్పు యాత్ర చేయకుండా అడ్డుకుంటారా, మీరు నాశనం అయిపోతారు రా.

  2. ఈ శవాన్ని కూడా వాడుకుని రాష్ట్రం లో మత చిచ్చు రగల్చాలనుకొన్నాడొక బోడి “లింగం”..

    పాపం.. వాడి ఆశలన్నీ అడియాసలైపోయాయి..

      1. ఓహో.. అందుకేనా మన జగన్ రెడ్డి బట్టలిప్పిస్తాను అంటూ సిగ్గు పడుతుంటాడు..

        బట్టలిప్పి చేసే పని ఇదే కాబోలు.. మీ పార్టీ జనాలకే తెలియాలి..

  3. Pawan kalyan గారు అన్ని మతాలను గౌరవించు, అలాగే మన సొంత మతాన్ని చులకన చేసుకోవడం ఆపాలని చెబితే…..దాని మీద కూడా ఇంత శవ రాజకీయం చేశారు అంటే…..🙏🙏🙏….మీరు మనుషులు కాదు GA…..ఐన ఈ విషయంలో సామాన్య జనానికి కూడా బాగా అర్దం అయ్యేలా చేసిన మీ అతి కి thanks GA….

  4. నిజం చెప్పాలంటే , ఇందులో ఎదో ఉంది అనుకుని హర్ష కుమార్ , పని లేని పాస్టర్ లు , బాగా హడావిడి చేశారు , శవం మీద చిల్లర ఏరుకోవడానికి , వాళ్లకి తరువాత నిజం తెలిసి సైలెంట్ అయిపోయారు . వాళ్ళ ఫామిలీ కి నిజం తెలుసు కాబట్టి సైలెంట్ గా ఉన్నారు .

    సోషల్ మీడియా లో పిల్ల బ్యాచ్ ని రెచ్చగొట్టడం తప్ప ఎం ఉపయోగం లేదు .

  5. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ప్రాణాలు పోతాయి అని ప్రజలకి నిరూపణ వేయడం కోసం సొంత ప్రాణాలు అర్పించిన త్యాగమయుడు ప్రవీణ్ పగడాల గారి ఆత్మకి శాంతిగా వారికి వాటికన్ పోప్ గారు , క్రైస్తవం మతం లో పవితమైన సెయింట్ హుడ్ ప్రదానం చేయగలరు.

    ప్రవీణ్ పగడాల గారి 10 వేల అడుగుల ఎత్తు గల విగ్రహాన్ని రోమ్ లో ప్రతిష్టాపన చేయగలరు.

    ప్రవీణ్ పగడాల గారు డ్రైవ్ చేసే మార్గంలో కొనుగోలి చేసిన ఆ మద్యం బ్రాండ్ లని వాటికన్ వారు , పవిత్ర మద్యం బ్రాండ్ లుగా గుర్తించి ప్రపంచం లో ప్రతి క్రైస్తవుడు ఆ మద్యము నీ ప్రతి వారం ప్రార్థన సమయం లో యేసు గారికి నివేదన చేసి స్వీకరించ వలచిందిగా పోప్ గారు ఆదేశం ఇవ్వ గలరు.

    1. ముస్లిం క్రైస్తవ మతాల తల్లి తండ్రుల కలయిగా జనించిన ప్రవీణ్ పగడాల గారిని

      ఆ ఇరు మతాల లో నూతన దైవ దూత గా గుర్తించి ప్రతి ముస్లిం , ప్రతి క్రైస్తవుడు వారి పిల్లలకు ప్రవీణ్ పగడాల అనే నామకరణం చేయగలరు.

      1. ప్రతి మసీదు ప్రతి చర్చ్ ల లో మొహమ్మద్ ప్రవక్త గారి , యేసు గారు యొక్క ప్రతీక లుగా వున్న చిహ్నాల పక్కనే ప్రవీణ్ పగడాల గారి విగ్రహాన్ని పెట్టీ ప్రార్ధన చేయగలరు అని కన్నీళ్ళ విన్నపం.

          1. ప్రవీణ్ పగడాల గారి ప్రమాదం నీ హత్య గా చూపించి రాజకీయ లబ్ధి పొందాలి అనుకుని గొడవ చేసి చిగరికి

            ప్రవీణ్ పగడాల గారి నీ ఒక మద్యం వ్యసన పరిడుగా నిరూపణ చేసి వారికి వున్న పరువు నిలువునా పోగొట్టిన సాటి దశమ భాగాల పాస్టర్ లకి వందనాలు.

Comments are closed.