ఇక ‘నాన్-బాహుబలి’ అనే పదం ఉండదా?

ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు రాజమౌళి తనకు తానే పోటీ, తనతో తనకే పోటీ. తన సినిమా రికార్డుల్ని తానే బ్రేక్ చేసుకుంటూ వస్తున్న రాజమౌళికి కొత్తగా పోటీ ఎదురవుతోంది. నాన్ బాహుబలి రికార్డులు…

ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు రాజమౌళి తనకు తానే పోటీ, తనతో తనకే పోటీ. తన సినిమా రికార్డుల్ని తానే బ్రేక్ చేసుకుంటూ వస్తున్న రాజమౌళికి కొత్తగా పోటీ ఎదురవుతోంది. నాన్ బాహుబలి రికార్డులు అంటూ బాహుబలిని మినహాయించి కలెక్షన్లు, సెంటర్లు లెక్క వేస్తున్న వారికి ఇక బాహుబలిని కూడా కలిపి చూడాల్సిన పరిస్థితి. ఒకటికాదు, ఏకంగా 2 సినిమాలు రెడీ అయ్యాయి. వీటిలో ఏ ఒక్కటి క్లిక్ అయినా “నాన్-బాహుబలి” అనే పదం కనిపించదిక.

సాహో, సైరా.. బాహుబలి రికార్డుల్ని టార్గెట్ చేశాయి. సైరా, సాహో ట్రైలర్లు, ప్రీరిలీజ్ స్టఫ్, ప్రీ రిలీజ్ బజ్.. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశాయి. అప్పటికీ, ఇప్పటికీ ఉన్న మార్కెట్ ని చూస్తే కచ్చితంగా రికార్డుల వేట కొనసాగుతుందనే చెప్పాలి. వన్ డే కలెక్షన్లు, ఫస్ట్ వీక్ కలెక్షన్లు, ఓవరాల్ కలెక్షన్లు, ఓవర్సీస్ కలెక్షన్లు.. అన్నిటిలో బాహుబలిని టార్గెట్ చేశాయి సైరా, సాహో.

అయితే బాహుబలి-2 రికార్డులు కొట్టడానికి వీటికి ఎన్ని అవకాశాలున్నాయో, అన్నే ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. బాహుబలి-2 సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూసింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ఆసక్తి దేశంయావత్తూ పాకిపోయింది. ఆ ఆసక్తి సునామీలా మారి థియేటర్లను ముంచెత్తింది. ఫలితంగా బాలీవుడ్ సినిమాను కూడా క్రాస్ చేస్తూ భారీ వసూళ్లు సాధించింది బాహుబలి-2.

ఇప్పుడొస్తున్న సైరా, సాహో సినిమాలపై అంత బజ్ లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాగా, చిరంజీవి-అమితాబ్ కలిసి నటిస్తున్న సినిమాగా సాహో, సైరాలకు బాలీవుడ్ లో కాస్త క్రేజ్ ఉంది తప్ప.. బాహుబలి-2 టైమ్ లో ప్రేక్షకుల్లో ఉన్నంత పూనకం ఇప్పుడు కనిపించడం లేదు. అదే బాహుబలి-2 సినిమాకు.. సైరా-సాహోకు మధ్య తేడా. ఈ ఒక్క తేడా చాలు.. రికార్డుల్లో తేడా కనిపించడానికి.

ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇప్పటికీ బాహుబలి-2 పేరిట రికార్డు పదిలంగా ఉంది. అమీర్, సల్మాన్ సినిమాలు కూడా ఇప్పటివరకు ఈ రికార్డును క్రాస్ చేయలేకపోయాయి. దీనికితోడు వరల్డ్ వైడ్ వసూళ్ల పరంగా బాహుబలి-2 సాధించిన రికార్డు ఉండనే ఉంది. ఈ రికార్డుల్ని సైరా, సాహో సినిమాలు సమం చేస్తాయని చెప్పలేం.

ఎందుకంటే ఈ రెండు సినిమాలకు బాలీవుడ్ లోనే గట్టి పోటీనిచ్చే సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. బాహుబలి-2 టైపులో వీటికి సోలో రిలీజ్ లు దొరకలేదు. పైగా బాహుబలి-2కు దొరికినన్ని థియేటర్లు కూడా నార్త్ లో వీటికి దొరకడం లేదు. సో.. వాస్తవంగా చూసుకుంటే బాహుబలి-2 రికార్డుల్ని కొట్టడం సాహో, సైరా సినిమాలకు కాస్త కష్టమైన పనే.

అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఏపీ, నైజాంలో మాత్రం బాహుబలి-2 రికార్డులు బద్దలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నాన్-బాహుబలి అనే పదం తెరమరుగయ్యే ఛాన్స్ కూడా ఉంది.

'బాహుబలి' ఇంకా కలగానే ఉంది