Advertisement

Advertisement


Home > Movies - Movie News

రష్మిక నుంచి ఒకే రోజు 3 లుక్స్

రష్మిక నుంచి ఒకే రోజు 3 లుక్స్

నేషనల్ క్రష్ రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చాలా హడావుడి నడిచింది. ఆమె నటిస్తున్న సినిమాల నుంచి ఏకంగా 3 లుక్స్ రిలీజయ్యాయి.

పుష్ప-2 నుంచి రష్మిక లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె శ్రీవల్లి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలో బీద అమ్మాయిగా కనిపించిన రష్మిక, పుష్పరాజ్ ను పెళ్లాడిన తర్వాత కోటీశ్వరురాలు అవుతుంది. అదంతా తాజా లుక్ లో స్పష్టంగా కనిపించింది. పచ్చ రంగు చీరలో ఒంటి నిండా నగలతో ధగధగలాడుతోంది శ్రీవల్లి.

ఇక రష్మిక లీడ్ రోల్ లో నటిస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నుంచి కూడా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ లుక్ లో సాధారణ కాలేజీ అమ్మాయిలా కనిపిస్తోంది రష్మిక. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్నారు.

నిజానికి ఈరోజు 'ది గర్ల్ ఫ్రెండ్' టీజర్ రిలీజ్ చేయాలనుకున్నారు. దీని కోసం 4 భాషల్లో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పింది రష్మిక. టీజర్ కూడా రెడీగా ఉంది. కాకపోతే ఈరోజు కాకుండా, ప్రత్యేకంగా మరో రోజు టీజర్ రిలీజ్ చేసి, గ్రాండ్ గా ప్రచారం చేయాలని నిర్ణయించారు. అందుకే ఆఖరి నిమిషంలో టీజర్ ఆపేసి, ఫస్ట్ లుక్ తో సర్దిపెట్టారు.

ఇక ముచ్చటగా మూడో లుక్ కూడా వచ్చేసింది. అదే కుబేర సినిమా లుక్. మేకప్ లేకుండా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్న రష్మిక లుక్ తో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ స్టిల్ రిలీజ్ చేశారు. అయితే ఇది కుబేర నుంచి రష్మిక ఫస్ట్ లుక్ కాదంటోంది యూనిట్. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారట. మొత్తానికి ఈరోజంతా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది ఈ బ్యూటీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?