Advertisement

Advertisement


Home > Movies - Movie News

రివ్యూస్ ఒకలా ఉన్నాయి.. మౌత్ టాక్ మరోలా ఉంది

రివ్యూస్ ఒకలా ఉన్నాయి.. మౌత్ టాక్ మరోలా ఉంది

సినిమా ఇలా రిలీజైన వెంటనే అలా ప్రెస్ మీట్ పెట్టారు నిర్మాత దిల్ రాజు. తమ సినిమా ఫ్యామిలీస్ కు బ్రహ్మాండంగా నచ్చిందని ప్రకటించేశారు. తను ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడతానని, ఫ్యామిలీ స్టార్ సినిమా విషయంలో రివ్యూస్ కు భిన్నంగా పబ్లిక్ టాక్ ఉందని అన్నారు.

"నేనెప్పుడూ నిజాయితీగానే మాట్లాడతాను. రివ్యూస్ అన్నీ ఒకేలా ఉన్నాయి. మేమిచ్చే స్టేట్ మెంట్స్ ను మీడియా ఎలా తీసుకుంటుందో, మీడియా ఇచ్చే రివ్యూస్ ను కూడా మేం అంగీకరించాలి. ఎందుకంటే, రివ్యూస్ అనేవి మీ అభిప్రాయాలు. కాకపోతే సాధారణ ఆడియన్స్ మరోలా రెస్పాండ్ అయ్యారు. 90 శాతం కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు."

ఈ సినిమాను హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో చూశారు దిల్ రాజు. యూత్ మొదటి 20 నిమిషాలు సైలెంట్ అయిపోయారని, అటు ఓవర్సీస్ నుంచి కూడా మిక్స్ డ్ టాక్ వచ్చిందని అన్నారు.

"వంద శాతం ఎంజాయ్ చేయకపోయినా, 5-6 సీన్లు ఎంజాయ్ చేస్తున్నారు. మేం అనుకున్నది వర్కవుట్ అయింది. కూకట్ పల్లిలో సినిమా చూశాను. 90శాతం యూత్ వచ్చారు. మొదట 20 నిమిషాలు సైలెంట్ గా చూశారు. హీరోయిన్ ఎంట్రీ నుంచి ఇంటర్వెల్ వరకు ఎంజాయ్ చేశారు. ఓవర్సీస్ లో ఫస్టాఫ్ సూపర్, సెకండాఫ్ స్లో, ప్రీ-క్లయిమాక్స్ నుంచి బాగుందని అన్నారు."

తమ సినిమా టార్గెట్ ఆడియన్స్ కుటుంబ ప్రేక్షకులని, వాళ్లకు నచ్చింది కాబట్టి రేపట్నుంచి ఫ్యామిలీ స్టార్ కు ఫ్యామిలీ ఆడియన్స్ పోటెత్తుతారని నమ్మకంగా చెబుతున్నారు దిల్ రాజు. ఇక మిడిల్ క్లాస్ హీరో సూపర్ మేన్ గా మారి వందమందిని కొట్టే ఫైట్ సీన్ పై వచ్చిన విమర్శల్ని కూడా దిల్ రాజు తిప్పికొట్టారు. విలన్ బట్టే హీరో ఉంటాడని, ఆమాత్రం కొట్టాలంటూ సమర్థించుకున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?