ఏజెంట్ సినిమా.. సరిగ్గా ఏడాది కిందట ఇదే నెలలో విడుదలైంది. డిజాస్టర్ అయింది. అప్పట్నుంచి ఇప్పటివరకు ఖాళీగానే ఉన్నాడు అఖిల్. చేతిలో 2-3 ప్రాజెక్టులున్నప్పటికీ.. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. త్వరలోనే ఆ ముచ్చట తీరబోతోంది.
అఖిల్ సినిమాను అఫీషియల్ గా ప్రకటించే ఆలోచనలో ఉంది యూవీ క్రియేషన్స్ సంస్థ. అక్కినేని అఖిల్ తో యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఓ భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేశారు. గతంలో తాము తీసిన సాహో సినిమాకు పనిచేసిన అనీల్ కుమార్ ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు.
సరిగ్గా ఏడాది పాటు సినిమాలకు దూరమైన అఖిల్ ఇప్పుడు సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అయ్యాడు. అయితే నిర్మాతలు మాత్రం సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. ఎందుకంటే, ప్రస్తుతం వాళ్లు విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో పాటు సెట్స్ పై మరో 2 సినిమాలు కూడా ఉన్నాయి.
ఇలాంటి టైమ్ లో అఖిల్ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకొస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అనేది వీళ్ల అనుమానం. అయితే ఇప్పుడు అన్నింటినీ పక్కనపెట్టారు. మరో 3 నెలల్లో అఖిల్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించి రేపోమాపో ప్రకటన రాబోతోంది. ఈ గ్యాప్ లో విశ్వంభర మినహా, మిగతా 2 సినిమాల్ని పూర్తిచేయాలని ప్లాన్. ఆ తర్వాత విశ్వంభర, అఖిల్ సినిమా మాత్రమే సెట్స్ పై ఉంటాయి. ఈ సినిమాకు ధీర అనే టైటిల్ అనుకుంటున్నారు.