Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈ సెన్సార్ తికమక ఏంటి ఫ్యామిలీ స్టార్..!

ఈ సెన్సార్ తికమక ఏంటి ఫ్యామిలీ స్టార్..!

సరిగ్గా 4 రోజుల కిందటి సంగతి. ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రచారంలో స్వయంగా హీరో విజయ్ దేవరకొండ తన సినిమా రన్ టైమ్ బయటపెట్టాడు. సెన్సార్ పూర్తయిందని, నిడివి 2 గంటల 43 నిమిషాలుందని, అయినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టదని, కథ పరుగెడుతూనే ఉంటుందని ప్రకటించాడు.

కట్ చేస్తే, సరిగ్గా విడుదలకు ఒక రోజు ముందు ఆఘమేఘాల మీద యూనిట్ నుంచి ప్రెస్ నోట్ రిలీజైంది. తమ సినిమాకు సెన్సార్ పూర్తయిందని, సినిమా రన్ టైమ్ 2 గంటల 30 నిమిషాలు మాత్రమేనని ప్రకటించుకుంది. కేవలం 150 నిమిషాలు మాత్రమేనంటూ ఏకంగా పోస్టర్ కూడా తయారుచేసి వదిలింది.

దీంతో ఫ్యామిలీ స్టార్ సినిమాకు సరిగ్గా విడుదలకు ముందు కత్తెర్లు పడ్డాయని, సినిమాకు రాత్రికిరాత్రి కత్తెర్లు పడ్డాయంటూ కథనాలు వచ్చాయి.

ఓవైపు ఈ కథనాలు ఇలా సాగుతుండగానే సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఆశ్చర్యంగా 163 నిమిషాల 20 సెకెన్ల రన్ టైమ్ తో సినిమా మొదలైంది. అంటే అక్షరాలా 2 గంటల 43 నిమిషాలన్నమాట. దీంతో ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతయింది. 

ఇంతోటి దానికి రెండున్నర గంటల సినిమా అంటూ పోస్టర్ వేయడం ఎందుకు? అసలేంటి ఈ గందరగోళం. సినిమా నిడివి విషయంలో ఎందుకింత కన్ఫ్యూజన్. ఆఖరి నిమిషంలో ఎందుకు మళ్లీ మనసు మార్చుకున్నారు? సినిమా చూసినోళ్లకు ఇప్పటికే దీనిపై ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది. కొన్ని సన్నివేశాల్ని తీయాలనుకొనుకొని తీయకుండా అలానే వదిలేశారు. సెకండాఫ్ చూస్తే యూనిట్ ఎంత కన్ఫ్యూజన్ లో ఉందో ఇట్టే అర్థమౌతుంది.

ఇక క్లయిమాక్స్ లో సూపర్ హిట్ పెళ్లి సాంగ్ ను ఇరికించడం కూడా రన్ టైమ్ తలనొప్పుల కిందకే వస్తుందనే విషయం యూనిట్ చెప్పకపోయినా ఎవరికైనా అర్థమౌతుంది.

జడ్జిమెంట్ విషయంలో దిల్ రాజును తోపు అంటారంతా. మరీ ముఖ్యంగా సీన్లు తీసేయాల్సి వస్తే ఏమాత్రం మొహమాటపడడనే ఇమేజ్ ఉంది. హీరోకు కూడా చెప్పకుండా సన్నివేశాలు కట్ చేసిన ట్రాక్ రికార్డ్ ఇతడిది. ఇలాంటి నిర్మాత నుంచి వచ్చిన సినిమాలో ఇంత గందరగోళం. అసలు ఏం జరిగి ఉంటుంది? బహుశా పరశురామ్ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలడేమో..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?