ఇప్పటికే చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. రకుల్, తాప్సి, మీరా చోప్రా, అక్ష… ఇలా మినిమం గ్యాప్స్ లో అంతా పెళ్లిళ్లు చేసుకున్నారు. త్వరలోనే వరలక్ష్మి శరత్ కుమార్, అదితి రావు హైదరి కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరోయిన్ చేరింది.
మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అపర్ణ దాస్, వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ప్రస్తుతం ఈమె పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. హల్దీ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. రేపు ఆమె పెళ్లి జరగనుంది.
మంజుమ్మల్ బాయ్స్ ఫేమ్ దీపక పరంబోరల్ తో కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది అపర్ణ దాస్. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా పెద్దల్ని ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు. అపర్ణ వయసు 28 ఏళ్లు మాత్రమే. ఈ వయసుకే పెళ్లి చేసుకున్న హీరోయిన్లు చాలా తక్కువ.
‘నాన్ ప్రకాశన్’ సినిమాతో అపర్ణ సినీ రంగ ప్రవేశం జరిగింది. ‘మనోహరం’ చిత్రంలో అపర్ణ, దీపక్‌లు కలిసి నటించారు. ప్రియన్ ఒటమిన్, సీక్రెట్ హోమ్ లాంటి సినిమాలతో అపర్ణ పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత విజయ్ నటించిన సినిమాతో కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. దాదా అనే మరో తమిళ చిత్రంలో కూడా నటించింది. ఇక ఆదికేశవ సినిమాతో టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. ఇలా ఓ వైపు కెరీర్ జోరుగా సాగుతుండగానే, పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది ఈ హీరోయిన్.