ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించిన అల్లు అర్జున్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టును టాలీవుడ్ యువ అగ్ర‌హీరో అల్లు అర్జున్ ఆశ్ర‌యించ‌డం చర్చ‌నీయాంశ‌మైంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో అల్లు అర్జున్ నంద్యాల‌కు వెళ్లారు. త‌న మిత్రుడైన శిల్పా ర‌విచంద్రారెడ్డిని ఆయ‌న క‌లుసుకున్నారు. వైసీపీ త‌ర‌పున పోటీ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టును టాలీవుడ్ యువ అగ్ర‌హీరో అల్లు అర్జున్ ఆశ్ర‌యించ‌డం చర్చ‌నీయాంశ‌మైంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో అల్లు అర్జున్ నంద్యాల‌కు వెళ్లారు. త‌న మిత్రుడైన శిల్పా ర‌విచంద్రారెడ్డిని ఆయ‌న క‌లుసుకున్నారు. వైసీపీ త‌ర‌పున పోటీ చేస్తున్న శిల్పా ర‌వికి మ‌ద్ద‌తుగా అల్లు అర్జున్ వెళ్ల‌డంపై అప్ప‌ట్లో ఫిర్యాదులు వెళ్లాయి. అనుమ‌తి లేకుండా అల్లు అర్జున్ వెళ్లార‌ని ఈసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఆ త‌ర్వాత కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. తాజాగా నంద్యాల పోలీసులు న‌మోదు చేసిన కేసును కొట్టి వేయాలంటూ అల్లు అర్జున్ కోర్టును ఆశ్ర‌యించ‌డం విశేషం. అల్లు అర్జున్ పిటిష‌న్‌ను హైకోర్టు స్వీక‌రించింది. విచార‌ణ‌లో ఏం తేలుతుంద‌నేది చూడాల్సి వుంది.

ఇదిలా వుండ‌గా ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా అల్లు అర్జున్ నంద్యాల‌కు వెళ్ల‌డంపై జ‌న‌సేన తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తూ జ‌న‌సేన శ్రేణులు పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నాగేంద్ర‌బాబు కూడా అల్లు అర్జున్‌ను త‌ప్పు ప‌ట్ట‌డం, అనంత‌రం వెన‌క్కి త‌గ్గ‌డం తెలిసిందే.

ఇప్పుడు కూట‌మి అధికారంలో వుంది. అల్లు అర్జున్‌తో జ‌న‌సేన విభేదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో ఎలా వుంటుందో చూడాలి.

3 Replies to “ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించిన అల్లు అర్జున్‌”

  1. శ్యామల కి spokes విమెన్ పదవి ఇచ్చినట్టు, పార్టీ కోసం అహోరాత్రులు కస్టపడి అధ్యక్షుడికి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన అల్లు అర్జున్ ని “పంగనామాల పార్టీ” కి అధ్యక్షుడిని చెయ్యాలి..

Comments are closed.