ఈ రోజుల్లో సనాతన ధర్మం గురించి చాలా చర్చ జరుగుతోంది. కొంతమంది దాన్ని హిందూ మతంతో కలగలిపి, రెండూ ఒకటే అనే టోన్‌లో మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి కొన్ని నాకు తెలిసిన, నాకు అర్థమైన విషయాలు రాద్దామనుకుంటున్నాను. ముందుగా మనం ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. హిందూమతంపై జరిగే దాడి, సనాతన ధర్మంపై దాడి కాదు. హిందూ మతంపై ఒక పద్ధతి ప్రకారం జరిగే దాడుల గురించి 2015 మేలో తిరుపతి సభలో నేనిచ్చిన ప్రసంగం నుంచి కొంత భాగాన్ని ఉటంకించి, ఆ తర్వాత సనాతన ధర్మం గురించి రాస్తాను.
‘ఈనాడు హిందూమతంపై దాడులు జరుగుతున్నాయన్నదీ, గతంలో కంటె వాటి ఉధృతం పెరిగిందన్నది వాస్తవం. దానికి కారణాలేమిటి, దాన్ని ఎదుర్కోవడం ఎలా, మత పరిరక్షణకు ప్రస్తుతం జరుగుతున్న పద్ధతులను మెరుగుపరుచుకోవడం ఎలా అనే విషయాలపై నాకు తోచిన విషయాలు చెప్తాను. హిందూమతంపై గతంలో కంటె గత 50 ఏళ్లగా క్రైస్తవుల దాడి ఉధృతం కావడానికి కారణం ఏమిటంటే 2 వేల ఏళ్లగా ప్రయత్నిస్తున్నా, సామదాన భేదోపాయాలు వుపయోగించినా భారతదేశంలో తమ జనాభా 3% కూడా చేరలేదనే బాధ వారిని తినేస్తోంది. రిజర్వేషన్లు పోతాయన్న భయంతో కొందరు మతం మారిన విషయాన్ని రికార్డుల్లో చూపరు కాబట్టి అసలు శాతం యింతకంటె ఎక్కువ వుంటుందన్న వాదన ఉంది. అదే సమయంలో అలాటి వారిలో చాలామంది రెండు మతాలనూ ఆచరిస్తున్నారనీ, శనివారం గుడికి, ఆదివారం చర్చికి వెళ్తున్నారనేది కూడా గమనించాలి. భారతీయుల్లోంచి హిందూ భావనను పెకలించి వేయడం కష్టమని క్రైస్తవ ప్రచారకులు ఎప్పుడో గ్రహించారు.
తక్కిన ఆసియా దేశాలు వేటిల్లోనూ యింత ఘోరమైన పెర్‌ఫామెన్సు లేదు. (ఇండోనేసియా జనాభాలో క్రైస్తవుల శాతం 9.8%, దక్షిణ కొరియాలో 29.3%, ఫిలిప్పీన్స్‌లో 85.5%, శ్రీలంకలో 7.5%, మైయన్మార్‌లో 7.9%). కమ్యూనిస్టు చైనాలో కూడా భారతదేశం తర్వాత చాలా శతాబ్దాల తర్వాత అడుగుపెట్టినా అక్కడ 4.5% మందిని గెలవగలిగింది. దీనికి మరో కష్టం తోడైంది వారికి. క్రైస్తవ ప్రధానమైన దేశాల్లో క్రైస్తవం మీద విశ్వాసం సన్నగిల్లి చాలామంది నాస్తికులమని చెప్పుకుంటున్నారు. యుకెలో తమను తాము క్రైస్తవులుగా పేర్కొంటున్నవారు 59.3% మంది మాత్రమే. యూరోప్‌లో చాలా చర్చిలు షాపింగు మాల్స్‌గా, ఆఫీసులుగా రూపాంతరం చెందుతున్నాయట. అమెరికాలో క్రైస్తవుల జనాభా 77% మాత్రమే!
అక్కడ కోల్పోయినది యిక్కడ సాధించడానికి వారు యుద్ధప్రాతిపదికన ‘ఒకలా చెప్పాలంటే బ్రిటిషువారు యిక్కడ పాలించినప్పటి కంటె ఎన్నో రెట్లు తీవ్రంగా’ ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి గాను వారు చేస్తున్నదేమిటి? అనేక దేశాల్లో విజయం సాధించిన తాము యిక్కడ ఎందుకు విఫలం చెందామో సమీక్షించుకున్నారు. ఎదిరించిన చోటైతే యుద్ధాలు చేయవచ్చు, తమ మతంపై అసంతృప్తి వున్నవారిని లోభపెట్టవచ్చు. కానీ భారతీయుల్లో ఒక విలక్షణత వుంది. ఇక్కడ ప్లూరాలిటీని జీవనవిధానంగా ఆమోదిస్తారు. భిన్న సంస్కృతులను, భిన్న ఆలోచనా విధానాలను తనలో యిముడ్చుకుంటూ హిందూమతం వర్ధిల్లింది. మనపై దండెత్తి వచ్చిన హూణులు, శకులు అందరూ మనలో అంతర్భాగమై పోయారు.
క్రైస్తవం వచ్చినపుడు కూడా ఓస్, నువ్వు కొత్తగా చెప్పే శాంతిప్రవచనాలేమున్నాయ్, మా వేదాల్లోనూ వున్నాయి, మా బుద్ధుడూ యివే చెప్పాడు అన్నారు. పోట్లాడలేదు, అలా అని నెత్తి కెక్కించుకోలేదు. వాళ్లిచ్చే సౌకర్యాలు తీసుకున్నారు కానీ మతం మారవలసిన అవసరం ఫీల్ కాలేదు. అప్పటికి, యిప్పటికీ పరమతసహనం, సర్వమతాల పట్ల సమభావనయే హిందూమతానికి, భారతదేశానికి దీపధారిగా వున్నాయి. మరి వీరిని జయించాలంటే ఎలా? అని ఆలోచన చేసి క్రైస్తవ శక్తులు, విదేశీ సామ్రాజ్యవాదంతో కలిసి ఒక కట్టుకథను సృష్టిస్తున్నాయి. ‘హిందూ మతం ఒక అనాగరిక మతం, వారు హింసాప్రియులు, వారి దేవుళ్ల చేతుల్లో ఆయుధాలు వుంటాయి, నిత్యశృంగారం తప్ప వారికి మరో వ్యాపకం లేదు, వీరి ఛాయలో మైనారిటీలు మాత్రమే కాదు, వారి మతంలోనే అణగారిన కులాలు, అనగా దళితులు క్షేమంగా వుండలేరు. భారతదేశంలో నిత్యం వారి మధ్య ఘర్షణ జరుగుతోంది.’ అని.
ఈ వాదాన్ని బలపరచడానికి వారికి సాక్ష్యాలు కావాలి. ఆ సాక్ష్యాలు సమకూర్చే పని కొందరు మేధావులు సమకూరుస్తారు. ఇక్కడ దళితులకు రక్షణ లేదని, కాలేజీల్లో బీఫ్ పెట్టడం లేదని, మహిషుడు దళితుడని, అసురుడు అంటే శూద్రుడని, అందుకే అగ్రవర్ణాల వారు అణిచివేశారని.. యిలా తప్పుడు సిద్ధాంతాలతో ఇంగ్లీషులో పుస్తకాలు వేసి వాటిని అక్కడ ప్రచారంలో పెడతారు. విదేశీ యూనివర్శిటీలు డాక్టరేట్లు యిస్తాయి. మతసహనం చూపుతున్న హిందువులను రెచ్చగొట్టడానికే పనిమాలా వాళ్లు తిరుపతిలో వెంకటేశుడి కంటె ఏసుని నమ్ముకోండని స్లోగన్లు రాయడం, గుడిలోకి బైబిలు తీసుకురావడం! ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా దశాబ్దాలుగా జరుగుతున్న అకృత్యమిది. ప్రచారం చేసుకోవడానికి విశాల భారతావనిలో వేరే చోటు దొరకలేదా? దీన్ని భరించలేక మనం ఏదైనా నిరసన కార్యక్రమం చేశామనుకోండి, వెంటనే అదిగో ఇండియాలో జాతుల మధ్య ఘర్షణ, హిందువులు మైనారిటీలను బతకనివ్వటం లేదు అని విదేశీ మీడియా అల్లరి చేస్తుంది. ఇది ఒక కుట్ర, మనం యీ ట్రాప్‌లో పడకూడదు.
ఇలా ఘర్షణ వాతావరణం వుందని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత రెండో దశలో విదేశీ శక్తులు చేయబోయే దేమిటంటే ‘మైనారిటీలపై హిందువులు జరిపే జాతిహననం నివారించి మైనారిటీలను కాపాడడం ప్రపంచ పౌరుల ధర్మం కాబట్టి ఐక్యరాజ్య సమితి పక్షాన కొన్ని సేనలను ఇండియాలో మోహరించి జాతుల మధ్య ఘర్షణను నివారించాలి. అది మన బాధ్యత అని ప్రచారం చేయడం. ఇక మూడో దశలో వారి సైన్యదళాలను యిక్కడ దింపి దేశాన్ని వశపర్చుకుంటారు. ఇది వూహ మాత్రమే అనుకుంటే పొరపాటు చేస్తున్నట్లే.
ఈ ప్రమాదాన్ని నివారించడానికి మనమేం చేయాలి అన్నది ఆలోచించాలి. మొదట అంతశ్శత్రువులను అడ్డుకోవాలి. సెక్యులరిజం అంటే ‘సర్వమతాల పట్ల సమభావన’ అనే మౌలిక అర్థాన్ని వక్రీకరించి, ‘ఓట్ల కోసం మైనారిటీల బుజ్జగింపు’గా మార్చేసిన రాజకీయ నాయకులను మనం అదుపు చేయాలి. దేవాలయభూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. వాటిని కబ్జా చేస్తున్న వారెవరు? సెక్యులరిస్టులా? అన్యమతస్థులా? భక్తులమంటూ నామాలు ధరించి తిరిగే హిందువులే కదా! దేవాదాయ శాఖామాత్యులుగా భక్తులే వుంటూ వచ్చారుగా, వారంతా గుడి భూములు కాపాడారా? అర్చకులకు జీతాలిచ్చారా?
హిందూ దేవాలయాలపై వచ్చే ఆదాయాన్ని పౌరసౌకర్యాలు కల్పించడానికి వెచ్చించే పద్ధతి మొదలు పెట్టినది ఎవరు? నవాబులా? బ్రిటిషువారా? సెక్యులరిస్టులా? ఎవరూ కాదు, యీనాటి రాజకీయ నాయకులు! మసీదులపై ఆదాయం మసీదులపైన, దానికి వచ్చే భక్తుల సౌకర్యాల పైన, వారి అవసరాల పైన వెచ్చించవచ్చు, దేవాలయాల విషయంలోనూ అంతే. ఆసుపత్రులు కడతాం, స్కూళ్లు కడతాం, నీటి సౌకర్యం కల్పిస్తాం అంటే వాటికోసం పన్నులు వేస్తున్నావు కదా, వాటిలోంచి ఖర్చు పెట్టు. తిరుపతి వెంకన్న డబ్బెందుకు తీసుకోవడం? నేను తిరుపతి హుండీలో వేసే డబ్బు ఒక భక్తుడిగా వేస్తున్నాను. పన్ను కట్టేటప్పుడు పౌరుణ్ని మాత్రమే. హుండీలో వేసే డబ్బు వెంకన్న భక్తుల కోసమే ఖర్చు పెట్టాలని డిమాండ్ చేసే హక్కు నాకుంది.
అన్నిటి కన్న అన్యాయం ‘ఆంధ్ర రాజధాని ఎక్కడ కట్టాలన్న ఆలోచన వచ్చినపుడు అమరావతి గుడి భూముల్లో, నూజివీడు దేవాలయం భూముల్లో కట్టవచ్చని సలహాలు వచ్చాయి. ఆ భూములిచ్చిన దాతలు ఎందుకు యిచ్చారు? గుడిలో దేవుడి వైభోగం కోసం యిచ్చారా? రాజధానిలో ఫౌంటెన్ల కోసం, మంత్రులుండే ఆకాశహర్మ్యాల కోసం యిచ్చారా? హిందూ దేవాలయాల డబ్బంటే అందరికీ లోకువ అయిపోయింది. ఈ దురుపయోగాన్ని మనం అడ్డుకోవాలి.
రాజకీయ నాయకులు భ్రష్టు పట్టించిన అనేక వ్యవస్థల్లో సెక్యులరిజం కూడా ఒకటి. ఆ కారణంగా సెక్యులరిజంను మనం నిరసించకూడదు. ఎందుకంటే భారతజాతి తరతరాలుగా అవలంబిస్తున్న మతసహనాన్నే సెక్యులరిజంగా అందరూ భావిస్తున్నారు. సెక్యులరిస్టులను తిడితే ప్రజల్లో చాలా మంది మనల్ని దూరంగా పెడతారు. హిందూమతంపై దాడి గురించి మనం ఎన్ని వాస్తవాలు చెప్పినా వినరు. హజ్ యాత్రికులకు డబ్బులిస్తున్నారు కాబట్టి, కాశీయాత్రకు డబ్బులివ్వాలనడం కంటె మతసంబంధిత విషయాలపై ప్రభుత్వధనం వెచ్చించ కూడదనే పోరాడాలి. మతపరమైన ఆస్తులపై ప్రభుత్వాధికారులు, రాజకీయనాయకులు అజమాయిషీ వుండకూడదని ఉద్యమించాలి. దానికి పౌరుల మద్దతు లభిస్తుంది.
ఇక అన్నిటికంటె ముఖ్యమైనది – మేధోపరంగా హిందూమతంపై దాడి జరుగుతోంది. దాన్ని ఎదుర్కోవాలి. వెండీ డొనిగర్ ఉదంతం వాటిల్లో ఒకటి మాత్రమే. మన మూలాలను, సంస్కృతభాషను, అన్నిటినీ అపహాస్యం చేసేట్లా, చేయలేనప్పుడు ఎక్కణ్నుంచో దిగుమతి అయినట్లుగా చిత్రీకరిస్తున్నారు. ఇది రోడ్డు పక్కన మతబోధకుడు ఎవరో చెపితే నవ్వి వూరుకునేవాళ్లం. కానీ మహా మేధావులు మన కంటె ఎక్కువగా మన పుస్తకాలు, వేదాలు, శాస్త్రాలు, తర్కాలు అధ్యయనం చేసి వాటిని ఔటాఫ్ ద కాన్‌టెక్స్‌ట్ కోట్ చేసి, వాటికి కువ్యాఖ్యానాలు చేస్తున్నారు.
దీన్ని ఎదుర్కోవడం మేధోపరంగానే జరగాలి. మనం కూడా వాళ్లంత బాగా.. కాదు, కాదు, వాళ్ల కంటె లోతుగా అధ్యయనం చేసి వారి జార్గన్ లోనే వారిని ఎదుర్కోవాల్సి వుంది. ప్రస్తుతం కొందరు యిస్తున్న రిజాయిండర్స్‌లో నాణ్యత లేదు, స్థాయి సరిపోవటం లేదు. వారి వాదనల్లో తప్పులు కనబడుతున్నాయి. నిష్పక్షపాతంగా బేరీజు వేసే వారి ముందు కూడా నిలబడదగిన స్థాయిలో మన విమర్శకులు ఎదగాలి. లేకపోతే మేలు కంటె ఎక్కువగా హాని జరుగుతుంది. మన స్వామీజీలకు టీవీల్లో కనబడాలన్న మోజు తప్ప యిలాటి వాటిపై దృష్టి లేదు.
ఈ ప్రక్రియ జరగాలంటే వివేకానందుడి అంశ వున్న మెరికల్లాటి వాళ్లతో సైన్యం తయారు చేయాలి, తర్ఫీదు యిప్పించాలి. మన జనాభాలో పెద్ద సెగ్మెంటైన దళితులను మనం వదులుకుంటున్నాం. వాళ్లను కొందరు తమవైపుకి తిప్పుకుంటున్నారు. హిందూమతంలో రక్షణ లేదని, బుద్ధుడు, క్రీస్తు మాత్రమే శాంతి దూతలనీ చెప్తారు వాళ్లు. కొన్నాళ్లకి బుద్ధుడు వెనక్కి వెళతాడు, క్రీస్తు ముందుకు వస్తాడు. దళితులను అక్కున చేర్చుకునే పీఠాలను మనం ప్రోత్సహించాలి. లేకపోతే యిక్కడ మతఘర్షణలు జరుగుతున్నాయన్న సాకు చెప్పి విదేశీసైన్యాలు యిక్కడ పీఠం వేస్తాయి. అప్పుడు మనం మతానికే కాదు, దేశానికే స్వేచ్ఛ లేకుండా పోతుంది.’
ఇదీ ఆనాటి ఉపన్యాసం. దీనికి తాజా కలం చేర్చాలి. ఇటువంటి పరిస్థితుల్లో డా॥ చిర్రావూరి శివరామకృష్ణ గారనే మహానుభావుడు హైందవం మీద జరుగుతున్న అన్యమతస్థుల దాడిని అనేక వ్యాసాల ద్వారా, పుస్తకాల ద్వారా సోదాహరణంగా, సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. పాఠ్య వాచకాల్లో చరిత్రను తారుమారు చేయడాన్ని, అవమానకరమైన ఆరోపణలతో మన హైందవ ధర్మాన్ని, సంస్కృతిని కించపరుస్తూ, మన నమ్మకాలను విశ్వాసాలను అవహేళన చేయడాన్ని ప్రతిఘటించడం జీవనలక్ష్యంగా పెట్టుకున్నారు. హిందూ వ్యతిరేక ధోరణిలో రాసిన అనేక వ్యాసాలకు, అనేక పుస్తకాలకు జవాబుగా తనదైన పద్ధతిలో సహేతుకంగా, సాధికారికంగా వాదించి, ఒప్పించిన గొప్ప వ్యక్తి ఆయన.
అందుకే కేవలం వేదపండితులు గానే కాకుండా ధర్మపోరాట వీరుడిగా ఆయనను సత్కరించాలనే సత్‌సంకల్పంతో గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చేతుల మీదుగా 17.11.2023న వారికి మా ట్రస్టు తరఫున ‘‘భారతీయ సంస్కృతీ రక్షక యోధ మహర్షి’’ అనే సార్థకమైన బిరుదు ప్రదానం చేసాం. శ్రీ శివరామకృష్ణ గారు తెలుగులో చేస్తున్న ఆ కృషిని ఆధారం చేసుకుని, ఆ కుహనా మేధావుల ఆంగ్ల భాషలోనే, వారి ‘జార్గన్’లోనే, వారి ‘అఫెన్సివ్’ ధోరణిలోనే, వారితో తలపడే యోధులు తయారై మన హైందవాన్ని మరింత శోభాయమానంగా నిలబెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఎందుకంటే మనం ఒకపక్క రాజకీయ నాయకులు ప్రవచించే సనాతన ధర్మం అంటే ఏమిటి, రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తేవాలా? అనే చర్చల్లో పడి కొట్టుకూంటూంటే మరో పక్క వెండీ డోనిగర్ గారు మహా భారతంలోని శాంతి, అనుశాసనిక పర్వాలపై మరొక పుస్తకాన్ని 2024 ఆగస్టులో మార్కెట్‌లోకి విడుదల చేశారు. మనం ఎంతో పవిత్రంగా భావించే ఆ పర్వాలలో ఆమెకు ఆకర్షణీయంగా అనిపించిన అంశమేమిటో పుస్తకం టైటిల్ (ద ధర్మా ఆఫ్ అన్‌ఫెయిత్‌ఫుల్ వైవ్స్ అండ్ ఫెయిత్‌ఫుల్ జాకాల్స్)చూసినా, కవరు పేజీపై సహస్రాక్షుడైన ఇంద్రుడి కామకేళి చూసినా అర్థమౌతుంది. కవరుపై ‘సమ్ మోరల్ టేల్స్ ఫ్రమ్ మహాభారత‘ అనే ఉపశీర్షిక కూడా చేర్చారామె! గోపికా వస్త్రాపహరణం బొమ్మతో ‘ద హిందూయిజం’ 2015లో విడుదల అయినప్పుడు చెలరేగిన వివాదం యిప్పుడు మచ్చుకైనా కానరావడం లేదు.
ఆవిడ భారతదేశం గురించి, హిందూ పురాణాల గురించి చాలాకాలంగా రాస్తూ వచ్చింది. 2015 వివాదం తర్వాత కూడా ఏ జంకూ లేకుండా రాస్తూ పోతోంది. కామసూత్ర గురించే నాలుగైదు రాసింది. కొన్ని పుస్తకాల టైటిల్స్ చూస్తే ఆవిడ దృక్కోణం అర్థమవుతుంది. ‘శివ, ద ఎరోటిక్ అసెటిక్’, ‘ఎరోటిక్ స్పిరిచ్యువాలిటీ’, ‘విమెన్, ఆండ్రోజెన్స్ (మగా, ఆడా కానివారు)….’ (అట్టపై అర్ధనారీశ్వరుడి బొమ్మ). వీటికి తోడు, మన దేశంలో వినడమే తప్ప, ఎవరూ చదవని, అమలులో లేని మనుస్మృతిపై కూడా ఓ పుస్తకాన్ని దయచేసింది. మనం మాత్రం జరిగిందో లేదో తెలియని లడ్డూ నేతిలో కల్తీపై, ఓ వ్యక్తి సంతకంపై హిందూమతం ఉనికి ఆధార పడిందంటూ ఆయాసపడిపోతున్నాం కానీ మన వంతుగా యిలాటి మేధోపరమైన దాడిని మేధోపరమైన రీతిలోనే ఎదుర్కునే తర్కయోధుల అవసరం గురించి ఆలోచించడం లేదు, కృషి చేయడం లేదు. కావాలంటే ఓ పూట నిరసన ప్రదర్శన నిర్వహించి ఏదో సాధించేశాం అనుకుంటాం. అదీ దురదృష్టం.
ఇక్కడ యింకో తమాషా ఏమిటంటే, హిందూమతాన్ని సనాతన ధర్మంగా పేర్కొంటూ కన్‌ఫ్యూజ్ చేయడం. భారతీయ జీవన విధానం (భారతీయ సంస్కృతి) యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే, ఇది సమగ్రమైనది. వ్యక్తితో పాటు అతని చుట్టూ ఉన్న సమాజం యొక్క సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించింది. ఇదీ ‘సనాతన ధర్మం’ సారాంశం! స్వామి వివేకానంద చెప్పినట్లుగా, సనాతన ధర్మం మనిషి భౌతికావసరాలపై మాత్రమే కాదు, అతని ఆధ్యాత్మిక, సాంస్కృతిక అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. మహా ఉపనిషత్తు ‘వసుధైవ కుటుంబకం’ అంది. విశ్వమానవులందరమూ ఒకే చెట్టు కొమ్మలమనీ, మనం నివసించే సమాజం విస్తృత కుటుంబమని ఉద్బోధించింది.
భూగోళంపై ఉన్న సమస్తజాతులు వారివారి నమ్మకాలను, మతాలను ఆచరిస్తూనే యితరులతో సుహృద్భావం కలిగి ఉండాలని, సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవాలని చెప్తోంది. ఈ విషయాన్నే సనాతన ధర్మం నొక్కి చెప్తోంది. విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన, అన్ని జాతులకు వర్తించే శాశ్వతమైన విలువల గురించి మాట్లాడుతుందది. వివేకం, జ్ఞానం, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం, నైతికత అనే సద్గుణాలన్నిటినీ ‘ధర్మం’ అనే ఒక శీర్షిక కింద ఐక్యం చేసి, ధర్మం గురించే బోధిస్తుంది. వేదాల ద్వారా విశదీకరించబడిన సనాతన ధర్మం ఏ ప్రత్యేక మతాన్ని బోధించనప్పటికీ, ఇంద్రుడు, వరుణుడు, అగ్ని మొదలైన వైదిక దేవుళ్లు హిందూ దేవుళ్లుగా మారడం వల్ల అది హిందూ మతంతో ముడిపడినట్లుగా తోస్తుంది.
శ్రీమతి దంటు కనకదుర్గ గారనే ప్రొఫెసర్ 15 ఏళ్ల పాటు నాలుగు వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ‘‘సనాతన ధర్మ, యూనివర్శల్ కోడ్ ఫర్ ఎథికల్ జస్టిస్’ అనే 550 పేజీల పుస్తకాన్ని ఇంగ్లీషులో వెలువరిస్తున్నారు. ముందుమాట రాయమంటూ నన్ను కోరడం చేత ఆ పుస్తకాన్ని చూడడం సంభవించింది. ప్రస్తుతం ఆచరిస్తున్న హిందూ మతానికి, వేద తత్వానికి మధ్య చాలా అంతరం ఉందని ధైర్యంగా ప్రకటించారావిడ. ‘వేదాలు ధర్మాన్ని ప్రవచించాయి. అయితే హిందూ మతం లోకంలో ఉన్న తక్కిన మతాల్లాగానే ఒక మతం. పుట్టిన ప్రతి మనిషికి 8 సంవత్సరాల నిర్బంధ విద్యను సూచించాయి వేదాలు. ఆడపిల్లలను, ఆడపడుచులను నాలుగు ఇంటి గోడల మధ్య బంధించి బాల్యవివాహాలు చేసే హిందూ ఆచారం వైదిక సిద్ధాంతం కాదు. భాగస్వామిని స్వయంగా ఎంచుకోవడం దగ్గర్నుంచి, స్త్రీపురుషుల మధ్య సమతౌల్యత వేదకాలంలో అవలంబించబడింది.’ అని స్పష్టీకరించారావిడ.
‘సనాతన ధర్మం’ గురించిన మరొక అపోహ ఏమిటంటే – అది పురాతనం, ప్రాచీనం, తాతముత్తాతల నాటి చాదస్తపు మూఢనమ్మకాలతో కూడినది, ఆధునిక కాలానికి పనికి రానిది అని. అందుకే ‘సనాతన ధర్మ పరిరక్షణ’ అనగానే ‘బాల్యవివాహాలు, సతీ సహగమనాలు, అస్పృశ్యత, మనుస్మృతి వగైరాలు మళ్లీ రావాలా?’ అని అడుగుతున్నారు. సనాతన ధర్మం గురించి వాక్రుచ్చేవారు కానీ, వ్యతిరేకించేవారు కానీ అదేమిటో విశదీకరించరు. వారికి తెలుసో తెలియదో అనే సందేహం మనకు కలిగేట్లా ప్రవర్తిస్తారు. ‘హిందూమతంలో కొన్ని తరాలుగా పోగుపడిన మూఢనమ్మకాలకు వేదాంగీకారం ఉందని చేసే ప్రచారం స్వార్థ ప్రయోజనాలతో కూడుకున్నదే! వేదాలు చెప్పిన సనాతన ధర్మానికి, హిందూ మతానికీ అపారమైన వ్యత్యాసం ఉందని రెండిటినీ పక్కపక్కన పెట్టి చూస్తే అర్థమౌతుంది. సనాతన ధర్మం గురించిన అపోహలను యీ పుస్తకం దూరం చేస్తుంది.’ అని శ్రీమతి కనకదుర్గ గారు ముందుమాటలోనే చెప్పారు.
ఆవిడ నిర్వచనం ప్రకారం ‘ఆబ్జెక్టివ్’ ఐన సనాతన ధర్మం ఎల్లకాలాలకూ వర్తిస్తుంది. ‘సబ్జెక్టివ్’ ఐన మతం పరిమిత కాలానికి, సమాజానికి కట్టుబడి ఉంటుంది. ఒకదాని జోలికి మరొకటి రాకుండా ఏకకాలంలో రెండూ వర్ధిల్లగలవు. సనాతన ధర్మం ఏ మతాన్నీ తిరస్కరించకపోగా సకల భేదాలను తనలో యిముడ్చుకుంటుంది. మానవులు అంతర్గతంగా ప్రశాంతత, సామాజికంగా శాంతి, పొందగలిగే జీవనశైలిని అలవర్చుకునేట్లా సనాతన ధర్మం దోహదపడుతుంది. ‘సనాతన’ అంటే అది భూత, వర్తమాన, భవిష్యత్ తరాలకు నిత్యమూ, ప్రాణాధారమూ. ఈ ధర్మం తమ సొంత మతాలను ఆచరిస్తున్న మానవులందరి మధ్య సార్వజనీన సౌభ్రాతృత్వం, సామరస్యం, ఒకరి పట్ల మరొకరికి ప్రేమ, సంరక్షణాభావం కలిగిస్తుంది.
‘సనాతన ధర్మం’ గురించి చాలా గందరగోళం ఉన్న యీ రోజుల్లో యిలాటి పుస్తకాలు మరిన్ని వస్తే సనాతన ధర్మం విశ్వమానవులందరికీ కావలసినదనీ, ఏదో ఒక మతానికి లేదా ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదనే అవగాహన బలపడుతుంది. దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఏమీ లేదన్న సంగతి బోధపడుతుంది. ఇక మతమంటారా? కాలక్రమేణా ఆచరణలో చాలా వికారాలు వచ్చి చేరతాయి. అదే మతంలో సంస్కర్తలు పుట్టుకుని వచ్చి, ఆ లోపాలను సరిదిద్దుతూ ఉంటారు. మళ్లీ కొత్త రకంగా వికృతమైన పోకడలు వస్తాయి, వక్రభాష్యాలు వస్తాయి. వాటిని సవరించే అవసరమూ ఉంది. మనిషికి సార్వజనీమూ, శాశ్వతమూ ఐన ధర్మమూ ముఖ్యమే, దేవుని పట్ల విశ్వాసంతో, పాపపుణ్యవిచక్షణతో ముందుకు సాగడానికి మతమూ ముఖ్యమే. రెండిటినీ కట్టగట్టి ఒకటిగా మాట్లాడడం అనుచితం. మన మతాన్ని సంస్కరించుకుంటూనే, ఆ మతాన్ని యితరుల దాడి నుంచి రక్షించుకోవడమూ అవసరమే.
– కె.ఐ. వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్)
కొత్త జర్నలిస్ట్ ని దించావు… మీ అంగట్లో సరుకు ను జనాలు మింగుతున్నారు అనేగా…
నోట మాటరావడం లేదు … ఇంత అజ్ఞానం .. అదీ ఇంత బహిరంగంగా ఏమాత్రం సిగ్గు ఎగ్గూ లేకుండా …ఈ వెబ్ సైట్ వాడితో నీకు రాజకీయబేధాలు ఉంటే అవి దానికి వెరెమార్గాలు వేరే వార్తలు వున్నాయి.. ఇక్కడ విష్యం ఏమిటి .. రాసింది ఎవరు అన్న ఆలోచన స్పృహ కంచమిగా ఉన్నాయా .. ఈ వ్యాసం రాసినది వరప్రసాదరెడ్డి గారు .. పూర్వ వ్యాపారవేత్త .. ఆయన ఎవరో తెలియకపోతే కనీసం కామెంట్ చేసేముందు గూగుల్ లో ఒక్క నిమిషం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి లేదా వూరికీ వుండు .. ఆయన్ను పట్టుకొని కొత్త జర్నలిస్ట్ అన్నావంటే దేవుడు కొంత మందికి నిజంగానే బుర్రలో బుద్ధి పెట్టడం మర్చిపోయాడేమో అనిపిస్తుంది
నోట మాటరావడం లేదు … ఇంత అజ్ఞానం .. అదీ ఇంత బహిరంగంగా ఏమాత్రం సిగ్గు ఎగ్గూ లేకుండా …ఈ వెబ్ సైట్ వాడితో నీకు రాజకీయబేధాలు ఉంటే అవి దానికి వెరెమార్గాలు వేరే వార్తలు వున్నాయి.. ఇక్కడ విష్యం ఏమిటి .. రాసింది ఎవరు అన్న ఆలోచన స్పృహ కంచమిగా ఉన్నాయా .
. ఈ వ్యాసం రాసినది వరప్రసాదరెడ్డి గారు .. పూర్వ వ్యాపారవేత్త .. ఆయన ఎవరో తెలియకపోతే కనీసం కామెంట్ చేసేముందు గూగుల్ లో ఒక్క నిమిషం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి లేదా వూరికీ వుండు .. ఆయన్ను పట్టుకొని కొత్త జర్నలిస్ట్ అన్నావంటే దేవుడు కొంత మందికి నిజంగానే బుర్రలో బుద్ధి పెట్టడం మర్చిపోయాడేమో అనిపిస్తుంది
నోట మాటరావడం లేదు … ఇంత అజ్ఞానం .. అదీ ఇంత బహిరంగంగా ఏమాత్రం సి …గ్గు ఎగ్గూ లేకుండా …ఈ వెబ్ సైట్ వాడితో నీకు రాజకీయబేధాలు ఉంటే అవి దానికి వెరెమార్గాలు వేరే వార్తలు వున్నాయి.. ఇక్కడ విష్యం ఏమిటి .. రాసింది ఎవరు అన్న ఆలోచన స్పృహ కంచమిగా ఉన్నాయా ..
ఈ వ్యాసం రాసినది వరప్రసాదరెడ్డి గారు .. పూర్వ వ్యాపారవేత్త .. ఆయన ఎవరో తెలియకపోతే కనీసం కామెంట్ చేసేముందు గూగుల్ లో ఒక్క నిమిషం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి లేదా వూరికీ వుండు .. ఆయన్ను పట్టుకొని కొత్త జర్నలిస్ట్ అన్నావంటే దేవుడు కొంత మందికి నిజంగానే బుర్రలో బుద్ధి పెట్టడం మర్చిపోయాడేమో అనిపిస్తుంది
నోట మాటరావడం లేదు … ఇంత అజ్ఞానం .. అదీ ఇంత బహిరంగంగా ఏమాత్రం సి…గ్గు ఎ…గ్గూ లేకుండా …ఈ వెబ్ సైట్ వాడితో నీకు రాజకీయబేధాలు ఉంటే అవి దానికి వెరెమార్గాలు వేరే వార్తలు వున్నాయి.. ఇక్కడ విషయం ఏమిటి .. రాసింది ఎవరు అన్న ఆలోచన స్పృహ కంచమిగా ఉన్నాయా .. ఈ వ్యాసం రాసినది వరప్రసాదరెడ్డి గారు .. పూర్వ వ్యాపారవేత్త .. ఆయన ఎవరో తెలియకపోతే కనీసం కామెంట్ చేసేముందు గూగుల్ లో ఒక్క నిమిషం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి లేదా వూరికీ వుండు .. ఆయన్ను పట్టుకొని కొత్త జర్నలిస్ట్ అన్నావంటే దేవుడు కొంత మందికి నిజంగానే బుర్రలో బుద్ధి పెట్టడం మర్చిపోయాడేమో అనిపిస్తుంది
నోట మాటరావడం లేదు … ఇంత అజ్ఞానం .. అదీ ఇంత బహిరంగంగా ఏమాత్రం..సి ఎగ్గూ లేకుండా …ఈ వెబ్ సైట్ వాడితో నీకు రాజకీయబేధాలు ఉంటే అవి దానికి వెరెమార్గాలు వేరే వార్తలు వున్నాయి.. ఇక్కడ విష్యం ఏమిటి .. రాసింది ఎవరు అన్న ఆలోచన స్పృహ కంచమిగా ఉన్నాయా .. ఈ వ్యాసం రాసినది వరప్రసాదరెడ్డి గారు .. పూర్వ వ్యాపారవేత్త .. ఆయన ఎవరో తెలియకపోతే కనీసం కామెంట్ చేసేముందు గూగుల్ లో ఒక్క నిమిషం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి లేదా వూరికీ వుండు .. ఆయన్ను పట్టుకొని కొత్త జర్నలిస్ట్ అన్నావంటే దేవుడు కొంత మందికి నిజంగానే బుర్రలో బుద్ధి పెట్టడం మర్చిపోయాడేమో అనిపిస్తుంది
నోట మాటరావడం లేదు … ఇంత అజ్ఞాన అదీ ఇంత బహిరంగంగా ఏమాత్రం ఎగ్గూ లేకుండా …ఈ వెబ్ సైట్ వాడితో నీకు రాజకీయబేధాలు ఉంటే అవి దానికి వెరెమార్గాలు వేరే వార్తలు వున్నాయి.. ఇక్కడ విష్యం ఏమిటి .. రాసింది ఎవరు అన్న ఆలోచన స్పృహ కొంచమైనా ఉన్నాయా ..
ఈ వ్యాసం రాసినది వరప్రసాదరెడ్డి గారు .. పూర్వ వ్యాపారవేత్త .. ఆయన ఎవరో తెలియకపోతే కనీసం కామెంట్ చేసేముందు గూగుల్ లో ఒక్క నిమిషం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి లేదా వూరికీ వుండు .. ఆయన్ను పట్టుకొని కొత్త జర్నలిస్ట్ అన్నావంటే దేవుడు కొంత మందికి నిజంగానే బుర్రలో బుద్ధి పెట్టడం మర్చిపోయాడేమో అనిపిస్తుంది
నోట మాటరావడం లేదు … ఇంత అజ్ఞానం . అదీ ఇంత బహిరంగంగా ఏమాత్రం సి… ఎగ్గూ లేకుండా …ఈ వెబ్ సైట్ వాడితో నీకు రాజకీయ బేధాలు ఉంటే అవి దానికి వెరెమార్గాలు వేరే వార్తలు వున్నాయి.. ఇక్కడ విషయం ఏమిటి .. రాసింది ఎవరు అన్న ఆలోచన స్పృహ కొంచమైనా ఉన్నాయా ..
ఈ వ్యాసం రాసినది వరప్రసాదరెడ్డి గారు .. వ్యాక్సీన్లు చేసి కోట్ల ప్రాణాలు నిలిపిన వ్యక్తి ఆయన ఎవరో తెలియకపోతే కనీసం కామెంట్ చేసేముందు గూగుల్ లో ఒక్క నిమిషం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి లేదా వూరికీ వుండు .. ఆయన్ను పట్టుకొని కొత్త జర్నలిస్ట్ అన్నావంటే దేవుడు కొంత మందికి నిజంగానే బుర్రలో బుద్ధి పెట్టడం మర్చిపోయాడేమో అనిపిస్తుంది
ఈ వ్యాసం రాసినది వరప్రసాదరెడ్డి గారు .. వ్యాక్సీన్లు చేసి కోట్ల ప్రాణాలు నిలిపిన వ్యక్తి ఆయన ఎవరో తెలియకపోతే కనీసం కామెంట్ చేసేముందు గూగుల్ లో ఒక్క నిమిషం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి లేదా వూరికీ వుండు .. ఆయన్ను పట్టుకొని కొత్త జర్నలిస్ట్అన్నావంటే దేవుడు కొంత మందికి నిజంగానే బుర్రలో బుద్ధి పెట్టడం మర్చిపోయాడేమో అనిపిస్తుంది
నోట మాటరావడం లేదు … ఇంత అజ్ఞానం . అదీ ఇంత బహిరంగంగా ఏమాత్రం సి… ఎగ్గూ లేకుండా …ఈ వెబ్ సైట్ వాడితో నీకు రాజకీయ బేధాలు ఉంటే అవి దానికి వెరెమార్గాలు వేరే వార్తలు వున్నాయి.. ఇక్కడ విషయం ఏమిటి .. రాసింది ఎవరు అన్న ఆలోచన స్పృహ కొంచమైనా ఉన్నాయా ..
ఈ వ్యాసం రాసినది వరప్రసాదరెడ్డి గారు .. వ్యాక్సీన్లు చేసి కోట్ల ప్రాణాలు నిలిపిన వ్యక్తి ఆయన ఎవరో తెలియకపోతే కనీసం కామెంట్ చేసేముందు నిమిషం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి లేదా వూరికీ వుండు .. ఆయన్ను పట్టుకొని కొత్త జర్నలిస్ట్ అన్నావంటే దేవుడు కొంత మందికి నిజంగానే బు…ర్రలో బు ..ద్ధి పెట్టడం మర్చిపోయాడేమో అనిపిస్తుంది
ఈ వ్యాసం రాసినది వరప్రసాదరెడ్డి గారు .. వ్యాక్సీన్లు చేసి కోట్ల ప్రాణాలు నిలిపిన వ్యక్తి ఆయన ఎవరో తెలియకపోతే కనీసం కామెంట్ చేసేముందు గూగుల్ లో ఒక్క నిమిషం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి లేదా వూరికీ వుండు .. ఆయన్ను పట్టుకొని కొత్త జర్నలిస్ట్ అన్నావంటే దే వు డు కొంత మందికి నిజంగానే బు ర్రలో బు ద్ధి పెట్టడం మర్చిపోయాడేమో అనిపిస్తుంది
Both Christianity and Islam denounce idol worshipers but the difference is unlike Islam there’s no *Indoctrination* in Christianity. Hence a honest dialogue for coexistence is always possible with Christians and or even with it’s missionaries. But with Islamists you either get terr0r or decepti0n(Slow invasion via high birth rates, undocumented immigration & strategic interfaith relationships)
కెవి గారు … వ్యాసంతోపాటు మీరు ఉదహరించిన వారి రచనలు ఎక్కడ చూడొచ్చు చెబితే ఇంకా బావుంటుంది
ఇప్పుడున్న Zombie తరహా ఓటరు మనుషులకి మీరు చెప్పేది అర్ధం కాదు. సనాతన ధర్మం అని హిందూ “మతం” అంటే వారికి అర్ధం కాదు, నచ్చదు. పైగా మీకే ఏం తెలీదు, వెర్రి బాగులేమో అనుకుంటారు. విదేశీ రచయితల సంగతి కాసేపు పక్కన పెట్టి, అంబేద్కర్ Era కూడా మన దేశంలో ఉంది కదా, అయన రచనలు, దాడి కోసం ఏ ప్రస్తావన ఈ వ్యాసంలో లేదు, ఎందుకనో మరి!
అలాగే ఏదో కుల భావన పూర్తిగా పోయింది అనుకుంటే అదే పెద్ద ఆత్మ వంచన. గత కొన్ని దశబ్దలుగా కుల భావన బాగా పెరిగింది. ఎన్నికలను ప్రభావితం చేసే అతి పెద్ద అంశం అదే 👍
Ambethkar was against both islam and Christian missionaries
ambedkar opposed castes in hindus and converted to buddhism, which had no castes (according to him), but before leaving, he divided hindus permanently based on castes by giving reservations.
Good analysis. Read how missionaries treated native indians in USA and in South America and blacks did not get voting rights till 1970 but for us everyone got in 1950.
Christianity is evil religion. Read the history of crusaders
Great article and its 100% true. Exactly same i am thinking. Thanks once again. If we correct our internal mistakes / issues no one can split or criticize. Thanks
Perhaps Hinduism is the only religion which did atrocities on their own people by brainwashing Sudras to become permanent slaves.
All are Hindu by born.
All are born to castes in Hinduism.
ద ఒరిజినల్ వేద అనే ఆంగ్ల గ్రంధం లేదా వేద విజ్ఞాన పరిచయం అనే తెలుగు పుస్తకాన్ని చదివితే అసలైన మరియు వక్రీకరణలు లేని వేదాన్ని తెలుసుకోవచ్చు. జీవితంలో విజయం సాధించాలంటే, ఈ పుస్తకాలను చదవాల్సిందే. హిందూ లేదా సనాతన ధర్మానికీ మరియు వైదిక ధర్మానికీ మధ్యనున్న తేడాలను కూడా పై పుస్తకాలు పామర భాషలో వివరిస్తాయి. ఈ పుస్తకాలన్నీ కూడా పూర్తిగా ఉచితంగానే http://www.VEDAunivarsity.com లో లభిస్తాయి.
ద ఒరిజినల్ వేద అనే ఆంగ్ల గ్రంధం లేదా వేద విజ్ఞాన పరిచయం అనే తెలుగు పుస్తకాన్ని చదివితే అసలైన మరియు వక్రీకరణలు లేని వేదాన్ని తెలుసుకోవచ్చు. జీవితంలో విజయం సాధించాలంటే, ఈ పుస్తకాలను చదవాల్సిందే. హిందూ లేదా సనాతన ధర్మానికీ మరియు వైదిక ధర్మానికీ మధ్యనున్న తేడాలను కూడా పై పుస్తకాలు పామర భాషలో వివరిస్తాయి. ఈ పుస్తకాలన్నీ కూడా పూర్తిగా ఉచితంగానే http://www.VEDAunivarsity.com లో లభిస్తాయి.
అంటరానితనం కుల గోల గతం గతః …effect almost reduced…but దశమ భాగాలు forced cheating conversions terrorism ఇవీ ఇప్పుడున్న సమస్యలు….pigs sheep i mean muslims chrustees bible కురాన్ నన్ను న మ్మకపోతే చం….పు antaayi ….కేవలం గీత మాత్రమే నీ కర్మకు నువ్వే భాద్యుడవు అంటుంది…
Hindu matham
మొన్నటిదాకా హిందూ మతం అన్నారు అందులోని కుల వివక్ష చాదస్తాలను వెనకేసుకు రాలేక ఇప్పుడు సనాతనము అంటున్నారు, old liquor in a very old bottle.
లోపాలు లేని మతం ఒక్కటి చూపండి … అన్నిటికన్నా తక్కువ లోపాలు ఉన్నది … వున్నలోపాలు సరిచేసుకోగల అవకాశం ఎక్కువ ఉన్నది హిందూమతం మాత్రమే … మీరు చెప్పిన కులవివక్ష లోపం మనదగ్గర ఉన్న సమయంలో మిగతా మతాలవారు వారి వారి సమాజాలలో బలహీనవర్గాలను నిజమైన బానిసలుగా బజారులో ధరపెట్టి మరీ slave markets లో అమ్ముకున్నారు .. వేటాడి జంతువులమాదిరి బోనుల్లో పెట్టి ఓడల్లో తరలించారు
లోపాలు లేని మతం ఒక్కటి చూపండి … అన్నిటికన్నా తక్కువ లోపాలు ఉన్నది … వున్నలోపాలు సరిచేసుకోగల అవకాశం ఎక్కువ ఉన్నది హిందూమతం మాత్రమే …
మీరు చెప్పిన కులవివక్ష లోపం మనదగ్గర ఉన్న సమయంలో మిగతా మతాలవారు వారి వారి సమాజాలలో బలహీనవర్గాలను నిజమైన బానిసలుగా బజారులో ధరపెట్టి మరీ slave markets లో అమ్ముకున్నారు .. వేటాడి జంతువుల మాదిరి బోనుల్లో పెట్టి ఓడల్లో తరలించారు
లోపాలు లేని మతం ఒక్కటి చూపండి … అన్నిటికన్నా తక్కువ లోపాలు ఉన్నది … వున్నలోపాలు సరిచేసుకోగల అవకాశం ఎక్కువ ఉన్నది హిందూ మతం మాత్రమే …
మీరు చెప్పిన కుల వివక్ష లోపం మనదగ్గర ఉన్న సమయంలో మిగతా మతాలవారు వారి వారి సమాజాలలో బలహీనవర్గాలను నిజమైన బానిసలుగా బజారులో ధరపెట్టి మరీ slave markets లో అమ్ముకున్నారు .. వేటాడి జం తు వు ల మాదిరి బోనుల్లో పెట్టి ఓడల్లో తరలించారు
లోపాలు లేని మతం ఒక్కటి చూపండి … అన్నిటికన్నా తక్కువ లోపాలు ఉన్నది … వున్నలోపాలు సరిచేసుకోగల అవకాశం ఎక్కువ ఉన్నది హిందూమతం మాత్రమే …
మీరు చెప్పిన కులవివక్ష లోపం మనదగ్గర ఉన్న సమయంలో మిగతా మతాలవారు వారి వారి సమాజాలలో బలహీనవర్గాలను నిజమైన బా ని స లు గా బజారులో ధరపెట్టి మరీ slave markets లో అమ్ముకున్నారు .. వేటాడి జంతువులమాదిరి బోనుల్లో పెట్టి ఓడల్లో తరలించారు
సనాతనం అంటే నిత్య నూతనం ఓల్డ్ కాదు
while its true xtians are trying to use tv channels to promote their agenda, hinduism will stay and grow even if it is unorganized
ముందు కిరస్తని మతం లోకి మారిన కూడా ఇంకా హిందూ దొంగ పేర్లు తో చెలామణి అయ్యే వాళ్ళ నీ హిందువులు తమ సామాజిక వ్యవహారాల్లో బహిష్కరణ చేయాలి.
అప్పుడే హిందూ పేర్లు తో చెలామణి అవుతూ , అదే హిందూ ధర్మాన్ని కించపరిచే వాళ్ళకి బహిర్గతం అవుతారు.
ప్యాలెస్ పులకేశి ఇంట్లో హిందూ దేముళ్ళ పేరు కానీ, ఓం ఆన్న శబ్దం కానీ వినిపిస్తే వదినమ్మ కి శివాలు ఎత్తుతుంది అంట కదా. అంత హిందూ వ్యతిరేకులు వాళ్ళు.
అంత కట్ట*ర్ క్రిస్టియన్ ఆలోచనలు వుండి , ఇంకా హిందూ పేరు తో యెందుకు, అబ్రహం అనో, మరియమ్మ అనో పేరు మార్చుకోవచ్చు కదా.
వెండీ ఒక పిచ్చి పట్టిన కు/ క్క లాంటిది, తన గురించి ఇండియన్స్ కి పెద్ద గ తెలీదు, తను డైరెక్ట్ గ ప్రభావితం చెయ్యలేదు, కానీ వీళ్ళు విదేశీ కళాశాలల్లో చదివే కొందరు విద్యార్థులను, అలానే JNTUD , జాదవ్ పూర్ లాంటి యూనివెర్సిటీలకు విసిటింగ్ ప్రొఫెస్సొర్స్ గ వచ్చి వాళ్ళల్లో హిందూ వ్యతిరేక భావాలున్న వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి, ఇండియా కి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. ఇది ఇప్పుడే పుట్టింది కాదు, అంబెడ్కర్ ని కొలంబియా యూనివర్సిటీ లో స్కాలర్షిప్ మీద సీట్ ఇవ్వక ముందు నించే వుంది. కాబట్టి వెండీ కన్నా ఇలా సెక్యూలర్ ముసుగు లో మత వ్యతేరేకితని వ్యాప్తి చేసే వల్లే డేంజర్, పవన్ కళ్యాణ్ వాళ్లనే టార్గెట్ చేసి మాట్లాడాడు.
వెండీ ని సోషల్ నెట్ వర్క్ లో బట్టలు ఊ/డ/దీ/సా/డు కేరళ నుంచి అజిత్ వాడకాయిల్ అనే మెరైన్ ఇంజనీర్ తన బ్లాగ్ ద్వారా, ఆ దెబ్బకు బిలియన్ ప్లస్ ప్రొఫైల్ వ్యూ వున్న అతని బ్లాగ్ ని గూ/గు/ల్ డిలీట్ చేసింది. అలానే మన తెలంగాణ లో కరుణాకర్ అనే అతను శివ శక్తి అనే సంస్థ ను స్థాపించి పాస్టర్ లను, వాళ్ళ మత మార్పిడి విధానాలను చాల సమర్ధంగా వ్యతిరేకిస్తున్నారు.
మనం మన ఆచారాలను, సంప్రదాయాలని మతాల్ని రక్షించుకోడానికి , అది ధర్మమా , మతమా అని మీన మేషాలు లెక్క పెట్టక్కర్లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా అటువంటి ప్రయత్నాలను ప్రతిఘటించాలి.
ఇప్పటి దాకా మనం డిఫెన్సె లో ఉన్నాము. ఇతర మతాల వాళ్లు మనల్ని ఎదో అంటే తిప్పికొట్టడం లాగా. కానీ వాళ్ళ మతాల్లో చాలా బొక్కలు ఉన్నాయి . వాటిని బయటిపెట్టి , ఈ మత మార్పిడులని ఆపాలి. అంటే వాళ్ళ మతాలలో, వాళ్ళ మత గ్రంధాలలో చెడుని బయటపెట్టాలి
Very nice article, Useful and Thought awakening, Truths presenting from GA.
(also this clearly says about the Jagan govt’s bad propaganda, Destruction done towards Hindu temples, sanatan dhrama including tirupati, Future generations should not tolerate and stop these kind of Psycho terrorists like Jagan)
Madyalo …jagan ni baagane ….venakesuku vaccharu …..!
బయో టెక్నిక్ కాదు స్వామి బయోటెక్
ఇప్పటికీ గ్రామీణ భారతంలో జరుగుతున్న నిమ్న కులాల వారి పట్ల ఉన్న వివక్ష గురించి పట్టించుకొండి.
Excellent
chala baga rasaru..
Avaanee maaku thelidhu maaa sanathana dharmam antee 3 marriages, family politics, varasathvam dopidi🙏🙏🙏🙏🙏🙏🙏