దిశ చ‌ట్టం, యాప్ అమ‌ల్లో వుంటే.. ప‌ది నిమిషాల్లో!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆడ‌పిల్ల‌ల‌పై వ‌రుస అఘాయిత్యాలు ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌ల‌పై ప్ర‌భుత్వం వెంట‌నే స్పందిస్తుంద‌నే ప్ర‌క‌ట‌న‌లు మిన‌హాయిస్తే, క‌ట్ట‌డికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆడ‌పిల్ల‌ల‌పై వ‌రుస అఘాయిత్యాలు ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌ల‌పై ప్ర‌భుత్వం వెంట‌నే స్పందిస్తుంద‌నే ప్ర‌క‌ట‌న‌లు మిన‌హాయిస్తే, క‌ట్ట‌డికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్ జిల్లా బ‌ద్వేలులో ప్రేమోన్మాది చేతిలో దారుణంగా హ‌త్య‌కు గురైన ఇంట‌ర్ విద్యార్థిని కుటంబాన్ని క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప‌రామ‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ చ‌నిపోయిన విద్యార్థిని ప‌దో త‌ర‌గ‌తిలో టాఫ్ అని అన్నారు. అలాంటి పాప చ‌నిపోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఇప్ప‌టికైనా రాష్ట్ర ప్ర‌భుత్వం మేల్కొని అమ్మాయిలపై హ‌త్యాచారాల‌ను అరిక‌ట్టాల‌ని కోరారు. దిశ చ‌ట్టం, యాప్ అమ‌లు చేసి వుంటే కేవ‌లం ప‌ది నిమిషాల్లో సంఘట‌నా స్థ‌లానికి పోలీసులు వెళ్లి కాపాడేవార‌ని ఆయ‌న అన్నారు.

దిశ చ‌ట్టాన్ని, అలాగే యాప్‌ను నిర్వీర్యం చేయ‌డం వ‌ల్లే మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దుర్మార్గులు భ‌య‌ప‌డేలా ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాధిత త‌ల్లి డిమాండ్ చేయ‌డాన్ని ఎంపీ గుర్తు చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఆడ‌పిల్ల‌ల త‌ల్లిదండ్రులు భ‌య‌ప‌డే ప‌రిస్థితి వుంద‌న్నారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన నాలుగు నెల‌ల్లోనే 74 దుర్ఘ‌ట‌న‌లు జ‌రిగితే ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని అవినాష్‌రెడ్డి ప్ర‌శ్నించారు.

2021లో త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో గుంటూరులో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగితే కేవ‌లం నెల‌ల వ్య‌వ‌ధిలో నిందితుడికి శిక్ష వేయించామ‌ని ఆయ‌న గుర్తు చేశారు.

14 Replies to “దిశ చ‌ట్టం, యాప్ అమ‌ల్లో వుంటే.. ప‌ది నిమిషాల్లో!”

  1. ఎవడ్రా ఈడీని MP చేసింది? ఎవడన్నా చెప్పండ్రా…గొడ్డలి పోట్లు కాకుండా కొద్దిగా బుర్రకి పని పెట్టమని. అసలు దిశా అనేది చట్టమే కాలేదు / చేయలేకపోయారు. లేని చట్టం ఎలా అమలు చేస్తారో?

  2. ప్యాలస్ చుట్టుపక్కల అప్పట్లో గంజాయి ముఠా లు నేరుగా రోజు గంజాయి నీ ప్యాలస్ నుండి గోతాలు గోతాల్ కొనుక్కుని వెళ్లే వాళ్ళు అనేవాళ్ళు.

    ఆన్న నే సొంతగా ఆ గంజాయి బస్తాల అమ్మి డబ్బు వసూలు చేసేవాడు అనేవాళ్ళు.

    అంతగా గంజాయి వాడకం ప్యాలస్ పులకేశి టైమ్ లో విస్తరించి నది.

  3. అసలు దిశా చట్టం తో ఎంత మందిని పట్టుకున్నారో.. శిక్షించారో వివరాలు చెపితే బాగుండేది..

    క్రిమినల్ కేసు అభియోగాలు వున్న వ్యక్తి నీతులు చెప్పడం ఇంకో వింత

  4. డెయ్ స న్నా సి పీ నుగా …మీ పరిపాలనలో తప్పు చేసిన నిందితులకి పదవులు ఇచ్చి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాఋ పైగా చాలా మందిని రెచ్చగొట్టి తప్పులు చేయించారు కదా…ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నిందితులకి చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారులె కాని నువ్వు కు త్త మూసుకుని ఆ డోర్ వేసుకొని పడుకో .. వాడు వస్తే ఫీల్ అవుతాడు .

  5. అన్నేసి కే సు లు ఉన్న వాళ్ళు బెయిలు మీద తిరుగుతూ మినిస్టర్లు, సీఎం లు అవుతున్నారు ఆ బొక్కలే ఈ చట్టాలు, కే సు లు మమ్మల్ని ఏం చెయ్యలేవు అనే ధీమా కలిపించారు..చట్టం అంటే భయం లేకపోవటానికి కారణం మీ అన్నాయ్ జగన్ . కో ర్టు లకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతూ రౌ డీలకు ఆదర్శంగా ఉన్నాడు. గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన తప్పిదాలు దీనికి కారణం.

Comments are closed.