చైతూ-శోభిత పెళ్లి పనులు మొదలు

నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం పూర్తయింది. వాళ్ల పెళ్లికి ఇంకా తేదీ ఖరారు కాలేదని చాలామంది అనుకుంటున్నారు. కానీ పెళ్లి డేట్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఎందుకంటే, పెళ్లి తేదీ లాక్ చేయకుండా, పెళ్లి పనులు…

నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం పూర్తయింది. వాళ్ల పెళ్లికి ఇంకా తేదీ ఖరారు కాలేదని చాలామంది అనుకుంటున్నారు. కానీ పెళ్లి డేట్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఎందుకంటే, పెళ్లి తేదీ లాక్ చేయకుండా, పెళ్లి పనులు మొదలుపెట్టరు కదా.

శోభిత ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. దీన్ని గోధుమ రాయి లేదా పసుపు దంచే కార్యక్రమం అంటారు. ఈ కార్యక్రమంతోనే పెళ్లి పనులు మొదలవుతాయి. శోభిత ఇంట ఇదే వేడుక జరిగింది. సాధారణంగా ఈ కార్యక్రమం జరిగిన తర్వాత శుభలేఖలు అచ్చు వేయించడం, పెళ్లి షాపింగ్ చేయడం, బంగారం కొనడం లాంటివి చేస్తారు.

విశాఖపట్నంలోని శోభిత నివాసంలో ఈ వేడుక జరిగింది. సంప్రదాయం ప్రకారం, ఇదే కార్యక్రమం నాగార్జున ఇంట్లో కూడా జరిగి ఉంటుంది.

రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు నాగచైతన్య, శోభిత. ఆగస్ట్ లో వీళ్లు నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ లో వీళ్ల పెళ్లి జరిగే అవకాశం ఉంది. తాజాగా చైతూ-శోభిత కలిసి దిగిన ఫొటో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Click Here More Photos

3 Replies to “చైతూ-శోభిత పెళ్లి పనులు మొదలు”

Comments are closed.