రండి.. నా రికార్డులు బద్దలుకొట్టండి

ఒకరి రికార్డును మరొకరు బద్దలుకొట్టినప్పుడే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశం కూడా పురోగతి సాధిస్తుందని అంటున్నాడు

ఏ హీరో అయినా తన సాధించిన రికార్డులు కలకాలం పది కాలాల పాటు పదిలంగా ఉండాలని కోరుకుంటాడు. రికార్డ్ బద్దలైతే మనసులోనే ఫీల్ అవుతాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం మరోలా స్పందించాడు.

పుష్ప-2 సినిమాతో రికార్డులు సృష్టిస్తున్నాడు అల్లు అర్జున్. తాజాగా ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి కూడా ఎంటరైంది. అయితే ఈ రికార్డులు కలకాలం ఉండాలని తను కోరుకోవడం లేదంటున్నాడు బన్నీ. వచ్చే వేసవికి తన రికార్డులు బద్దలుకొట్టాలంటూ మిగతా హీరోలకు పిలుపునిచ్చాడు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

“వెయ్యి కోట్లు అనేది నా దృష్టిలో కలెక్షన్ కాదు. వెయ్యి కోట్లు అనే సంఖ్య ప్రేక్షకుల ప్రేమకు నిదర్శనం. అంకెలు తాత్కాలికం. ప్రేక్షకుల ప్రేమ నా గుండెల్లో శాశ్వతం. రికార్డులున్నవే బద్దలవ్వడానికి. నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. కాకపోతే 2-3 నెలలే. వచ్చే వేసవి నాటికి నా రికార్డులన్నీ బద్దలవ్వాలి. ఏ హీరో, ఏ సినిమాతో, ఏ భాషలో బద్దలుకొడతాడనేది అనవసరం. నా రికార్డు మాత్రం బద్దలవ్వాలని కోరుకుంటున్నాను.”

ఒకరి రికార్డును మరొకరు బద్దలుకొట్టినప్పుడే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశం కూడా పురోగతి సాధిస్తుందని అంటున్నాడు. నిత్యం అభివృద్ధి కోరుకుంటాను కాబట్టి, తన రికార్డుల్ని మరో హీరో బద్దలు కొట్టాలని అంటున్నాడు.

10 Replies to “రండి.. నా రికార్డులు బద్దలుకొట్టండి”

  1. ఈడైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నాడు దమ్ముంటే బద్దలు కొట్టండని.

  2. ఒకవైపు పచ్చి దోపిడీకి పాల్పడుతూ మళ్ళీ నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు.

Comments are closed.