Advertisement

Advertisement


Home > Movies - Movie News

పుష్ప సాక్షిగా మారిన బన్నీ బిరుదు

పుష్ప సాక్షిగా మారిన బన్నీ బిరుదు

మెగాస్టార్ అంటే చిరంజీవి, సూపర్ స్టార్ అంటే మహేష్ బాబు. మరి స్టయిలిష్ స్టార్ అంటే ఎవరు? ఇంకెవరు అది అల్లు అర్జున్ కదా. నిజమే.. బన్నీని అతడి అభిమానులు ముద్దుగా స్టయిలిష్ స్టార్ అని పిలుచుకుంటారు. కానీ పుష్ప సినిమా నుంచి బన్నీ స్టయిలిష్ స్టార్ కాదు.

ఈ మేరకు బన్నీకి కొత్త బిరుదు రెడీ అయింది. ఈ హీరోకు సుకుమార్ అండ్ కో అంతా కలిసి ఐకాన్ స్టార్ అనే బిరుదు పక్కా చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందట విడుదలైన పుష్ప టీజర్ లో బన్నీకి ఈ బిరుదు కట్టబెట్టారు. అదేదో నామ్ కే వాస్తే జరగలేదు. టీజర్ లో ముందుగా స్టయిలిష్ స్టార్ అనే టైటిల్ వేసి, గ్రాఫిక్స్ లో దాన్ని కొట్టేసి, ఫ్రెష్ గా ఐకాన్ స్టార్ అనే టైటిల్ వేశారు.

అంటే ఇకపై అల్లు అర్జున్ ను అంతా ఐకాన్ స్టార్ అని మాత్రమే పిలవాలని ఫిక్స్ అయి మరీ ఈ టైటిల్ పెట్టినట్టు కనిపిస్తోంది. పుష్ప టీజర్ లో బన్నీ లుక్, అతడి మేకోవర్ ఒకెత్తయితే.. ఫినిషింగ్ టచ్ ఇస్తూ విడుదల చేసిన ఈ బిరుదు మరో ఎత్తు.

ఇక టీజర్ విషయానికొస్తే ఫారెస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన పుష్ప విజువల్స్ గ్రాండియర్ గా ఉన్నాయి. దేవిశ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, బన్నీ మేకోవర్, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. టీజర్ లో రష్మికకు కూడా చోటిచ్చారు.

ఇక సినిమా విడుదల వాయిదా పడుతుందనే ఊహాగానాల మధ్య, టీజర్ లో కూడా రిలీజ్ డేట్ ను ప్రకటించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాను 5 భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?