పెళ్లికి ముందు బన్నీ ప్రేమలు

కెరీర్ ప్రారంభంలో అల్లు అర్జున్ పై కొన్ని పుకార్లు చెలరేగాయి. అతడు ఓ హీరోయిన్ కు బాగా దగ్గరయ్యాయడని, ఆమెతో డేటింగ్ చేశాడంటూ ఊహాగానాలు చెలరేగాయి. హీరోలపై ఇలాంటి గాసిప్స్ రావడం సర్వసాధారణం. Advertisement…

కెరీర్ ప్రారంభంలో అల్లు అర్జున్ పై కొన్ని పుకార్లు చెలరేగాయి. అతడు ఓ హీరోయిన్ కు బాగా దగ్గరయ్యాయడని, ఆమెతో డేటింగ్ చేశాడంటూ ఊహాగానాలు చెలరేగాయి. హీరోలపై ఇలాంటి గాసిప్స్ రావడం సర్వసాధారణం.

అయితే బన్నీపై మాత్రం చాలా ఎక్కువగా వచ్చాయి అప్పట్లో. వాటన్నింటిపై తాజాగా స్పందించాడు అల్లు అర్జున్. పెళ్లికి ముందు తనకున్న ఎఫైర్ల గురించి అతడు నేరుగా స్పందించలేదు కానీ, తన భార్యకు మాత్రం తెలుసంటున్నాడు.

“పెళ్లికి ముందు నాకున్న ఎఫైర్ల గురించి ఏవీ దాయలేదు. అంతా మా ఆవిడకు తెలుసు. ఇక ఎంతమంది, వాళ్ల పేర్లు ఎంటనేది ఇప్పుడొద్దు. పెళ్లనేది రీసెట్ బటన్ లాంటిది. పెళ్లి తర్వాత ఏంటనేది మేటర్, పెళ్లికి ముందు ఏం జరిగిందనే లెక్క ఇక అనవసరం. మా ఆవిడకు మాత్రం అన్నీ చెప్పేశాను. ఏదో చెప్పి మేనేజ్ చేసుకున్నాను.”

ఇలా పెళ్లి తర్వాత ఎఫైర్స్ అన్నీ ఆపేశానని అంటున్నాడు అల్లు అర్జున్. ఈ సందర్భంగా తన కొడుక్కి చెప్పిన కథను మరోసారి వల్లించాడు బన్నీ. తన జీవితంలో స్నేహా రెడ్డినే తొలిసారి చూసి ప్రేమలో పడ్డానని, ఆమెనే పెళ్లి చేసుకున్నానని కొడుకు అయాన్ తో చెప్పాడట. కాబట్టి దానికే అంతా ఫిక్స్ అయితే బెటరని అంటున్నాడు అల్లు అర్జున్.

3 Replies to “పెళ్లికి ముందు బన్నీ ప్రేమలు”

Comments are closed.