పుష్ప 2.. క్లారిటీ ఇచ్చిన తమన్

పుష్ప-2 సినిమా కోసం ఆఖరి నిమిషంలో టీమ్ లోకి వచ్చి చేరాడు తమన్. దేవిశ్రీ ప్రసాద్ ను పక్కనపెట్టి తమన్ ను తీసుకున్నారు మేకర్స్. దీనిపై గడిచిన కొన్ని రోజులుగా చాలా చర్చ నడిచింది.…

పుష్ప-2 సినిమా కోసం ఆఖరి నిమిషంలో టీమ్ లోకి వచ్చి చేరాడు తమన్. దేవిశ్రీ ప్రసాద్ ను పక్కనపెట్టి తమన్ ను తీసుకున్నారు మేకర్స్. దీనిపై గడిచిన కొన్ని రోజులుగా చాలా చర్చ నడిచింది.

ఎట్టకేలకు ఈ అంశంపై తమన్ స్పందించాడు. పుష్ప-2లో తను కూడా భాగమయ్యానని ప్రకటించిన ఈ సంగీత దర్శకుడు.. సినిమా మొత్తం తన చేతుల్లోకి తీసుకోలేదని, ఒక పార్ట్ మాత్రమే తీసుకున్నానని క్లారిటీ ఇచ్చాడు.

“పుష్ప-2లో నేను ఒక పార్ట్ మాత్రమే. మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను. ఎందుకంటే చాలా పెద్ద సినిమా అది. చాలా బిజినెస్ చేసిన సినిమా. కొన్నింటిని మనం ఛాలెంజింగ్ గా తీసుకోవచ్చు కానీ అదే సమయంలో కొన్ని విషయాల్లో మనం భయపడాలి కూడా. 15 రోజుల్లో మొత్తం సినిమాను కంప్లీట్ చేయలేం.”

ఇలా తక్కువ టైమ్ లో పుష్ప-2 సినిమా రీ-రికార్డింగ్ ను పూర్తిచేయలేననే భయంతోనే వెనక్కు తగ్గానని తమన్ క్లారిటీ ఇచ్చాడు. తొలిసారి సుకుమార్ తో వర్క్ చేసిన తమన్.. తన వర్క్ కు దర్శకుడు హ్యాపీ ఫీలయ్యాడని చెప్పుకొచ్చాడు.

“సినిమా నేను చూశాను.. చాలా గొప్ప సినిమా. కాకపోతే నేను ఒక పార్ట్ మాత్రమే చేయగలిగాను. నా వల్ల చేయగలిగినంత నేను చేశాను. అది చూసి దర్శకుడు, హీరో చాలా హ్యాపీ.”

ప్రస్తుతం పుష్ప-2 సినిమా రీ-రికార్డింగ్ నడుస్తోంది. తమన్ తో పాటు శామ్ సీఎస్, అజనీష్ లోకనాధ్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్, కొన్ని థీమ్స్ కంపోజ్ చేశాడు.

3 Replies to “పుష్ప 2.. క్లారిటీ ఇచ్చిన తమన్”

Comments are closed.