ఈనెల కూడా బాక్సాఫీస్ బోసిపోవాల్సిందేనా.. మొన్నటివరకు అందరిలో ఇదే సందేహం. ఎందుకంటే, ప్రభాస్ రాజా సాబ్ వాయిదా పడింది. అనుష్క ఘాటీ పోస్ట్ పోన్ అయింది. వస్తుందనుకున్న విశ్వంభర రాలేదు.
దీంతో ఈ నెలలో జాక్ సినిమా తప్ప భారీ హైప్ తో వస్తున్న మూవీ ఇంకోటి కనిపించలేదు. ఇప్పుడు మరో సినిమా రాకతో ఈ నెల బాక్సాఫీస్ కాస్త వేడెక్కింది. కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాను ఈనెల 18న విడుదల చేయాలని నిర్ణయించారు.
కల్యాణ్ రామ్ రాకతో ఏప్రిల్ బాక్సాఫీస్ కు కాస్త వెయిట్ పెరిగింది. మరీ ముఖ్యంగా సాలిడ్ గా సమ్మర్ హాలిడేస్ మొదలయ్యే టైమ్ కు ఈ సినిమా వస్తోంది. కాబట్టి సమ్మర్ హాలిడేస్ సీజన్ లో తొలి పెద్ద సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు.
మూవీ ఫస్ట్ లుక్, టీజర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో విజయశాంతి, కల్యాణ్ రామ్ తల్లీకొడుకుగా నటించారు.
సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సోహైల్ ఖాన్ విలన్ పాత్ర పోషించాడు. అజనీష్ లోకనాధ్ సంగీతం అందించాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై కల్యాణ్ రామ్ చాలా నమ్మకంగా ఉన్నాడు.
హాయ్