ఢాకూ మహరాజ్.. వచ్చేసాడు

వాల్తేర్ వీరయ్య తరువాత దర్శకుడు బాబీ చేస్తున్న సినిమా ఢాకూ మహరాజ్. నందమూరి బాలకృష్ణ హీరో. ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల. ఇప్పుడు టీజర్ విడుదల చేసి, కంటెంట్ రిలీజ్ లకు శ్రీకారం…

వాల్తేర్ వీరయ్య తరువాత దర్శకుడు బాబీ చేస్తున్న సినిమా ఢాకూ మహరాజ్. నందమూరి బాలకృష్ణ హీరో. ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల. ఇప్పుడు టీజర్ విడుదల చేసి, కంటెంట్ రిలీజ్ లకు శ్రీకారం చుట్టారు. 96 సెకెండ్ల టీజర్ ను విడుదల చేసారు. సినిమాకు ఢాకూ మహరాజ్ అనే టైటిల్ పెట్టారు. అది రీవీల్ చేయడమే టీజర్.

హీరో ఎవరు.. విలన్ నా.. హీరోనా.. ఇంకా ఎవరు ఎవరు అనేది దర్శకుడు బాబి కాస్త టచ్ ఎలివేషన్ డైలాగులతో వాయిస్ ఓవర్ లో చెప్పించి, అప్పుడు ‘రాజ్యం లేకుండానే యుద్దం చేసిన ఓ రాజుది… గండ్రగొడ్డలి పట్టిన యమ ధర్మరాజుది’ ఈ కథ అనే ఎలివేషన్ ఇచ్చి, బాలయ్య నోటనే, ఎవరో తెలుసా… అనేట్లుగా హిందీ డైలాగ్ చెప్పించారు. ఆపైన ఢాకూ మహరాజ్ టైటిల్ రివీల్ చేసారు.

టైటిల్ రివీల్ చేయక ముందు టీజర్ లో ముగ్గురు విలన్లు ను ఇంట్రడ్యూస్ చేసారు. ఢాకూ మహరాజ్ అనే టైటిల్ కు యాప్ట్ గా వుండేలా గుర్రాలు, డ్రయ్ ఏరియాలు, కొండల్లో సీన్లు తీసారు. థమన్ నేపథ్య సంగీతం ఇచ్చాడు. కొన్ని కొత్త సౌండ్స్ టీజర్ లో థమన్ వినిపించారు టైటిల్ రివీల్ అయ్యాక హీరో ఫేస్ ను, గెటప్ ను చూపిస్తూ, ఓ యాక్షన్ కట్ వేసారు.

మొత్తం మీద బాలకృష్ణ- బాబీ సినిమా అంటే ఎలా వుంటుంది అనుకుంటారో అలాంటి మాస్ టీజర్ ను విడుదల చేసారు. ఈ సినిమాకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.

16 Replies to “ఢాకూ మహరాజ్.. వచ్చేసాడు”

  1. రేయ్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావ్ అసలు ..??

    నువ్ రాసిన సోది అంతా టీజర్ లో మెం చూసిందే కదా …కొత్తగా ఏం రాసావ్

    1. మళ్ళీ అంటే ఓకే లే… ఎందుకంటే ఈ మద్య వచ్చిన మూడు చిత్రాల్లో సంక్రాంతికి బాలి లూజరే…ఆ విధంగా బాలయ్యదే అంటే లూజరే అనేగా

Comments are closed.