ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో ర‌గులుతున్న టీడీపీ రెడ్లు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడైన మంత్రి లోకేశ్‌పై ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని టీడీపీ రెడ్లు ర‌గులుతున్నారు. కూట‌మి అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఒక్క‌టంటే ఒక్క ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా పీలేరు,…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడైన మంత్రి లోకేశ్‌పై ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని టీడీపీ రెడ్లు ర‌గులుతున్నారు. కూట‌మి అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఒక్క‌టంటే ఒక్క ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా పీలేరు, ప‌ల‌మ‌నేరు ఎమ్మెల్యేలు న‌ల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, అమ‌ర్నాథ్‌రెడ్డి టీడీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నార‌ని తెలిసింది.

కూట‌మి స‌ర్కార్‌లో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి మిన‌హాయిస్తే, మిగిలిన ఏ సామాజిక వ‌ర్గానికి న్యాయం జ‌ర‌గడం లేద‌నే ఆవేద‌న క‌నిపిస్తోంది. శాప్ చైర్మ‌న్‌గా ర‌వినాయుడు, అలాగే టీటీడీ చైర్మ‌న్‌గా బీఆర్ నాయుడికి ప‌ద‌వులు ఇచ్చారు. ఇక త‌మ గ‌తేంట‌ని రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయ‌కులు నిలదీస్తున్నారు. క‌నీసం ప్ర‌భుత్వ విప్ ప‌ద‌వికి కూడా నోచుకోని దుస్థితిలో తాము ఉన్నామా? అని చిత్తూరు రెడ్లు నిల‌దీస్తున్నారు.

వైఎస్ జ‌గ‌న్‌ను ఘాటుగా విమర్శించే వారిలో ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ అధికార ప్ర‌తినిధి ఎన్‌బీ సుధాక‌ర్‌రెడ్డి, సూరా సుధాక‌ర్‌రెడ్డి త‌దిత‌రులున్నారు. ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వానికి వ‌స్తే వీళ్ల‌ను కూడా టీడీపీ పెద్ద‌లు ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. ఈ ద‌ఫా రెడ్లు ఎటూ టీడీపీ వైపు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌ర‌ని, అలాంట‌ప్పుడు వాళ్ల‌కు ఎందుకు ప‌ద‌వులు ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో అధిష్టానం పెద్ద‌లు ఉన్న‌ట్టు చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో జీవీరెడ్డికి మిన‌హాయిస్తే, ఎవ‌రికీ ఆ సామాజిక వ‌ర్గంలో ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని అంటున్నారు.

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాకు వ‌స్తే, క‌మ్మ సామాజిక వ‌ర్గానికి త‌ప్ప‌, మిగిలిన ఏ ఒక్క సామాజిక వ‌ర్గానికి న్యాయం జ‌ర‌గ‌లేద‌నే ఆవేద‌న‌లో నాయ‌కులున్నారు. తుడా చైర్మ‌న్ ప‌ద‌విని మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ ఆశిస్తున్నారు. అయితే ఆమెకు ఆ ప‌ద‌వి ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని స‌మాచారం. లోకేశ్ మ‌రెవ‌రికో మాట ఇచ్చార‌ని అంటున్నారు. క‌నీసం ఈ ప‌ద‌వైనా త‌మ‌కు ద‌క్కుతుందా? అని రెడ్డి సామాజిక వ‌ర్గ నేత‌లు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఇది కూడా ఇవ్వ‌క‌పోతే, ఇక టీడీపీకి తూర్పు వైపు తిరిగి దండం పెట్టాల్సిందే అని ఆ పార్టీలోని రెడ్ల నాయ‌కులు అంటున్నారు.

14 Replies to “ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో ర‌గులుతున్న టీడీపీ రెడ్లు”

  1. అదేంటో ఏ పార్టీ వాళ్ళైనా సరే నీ దగ్గరికి వచ్చి రగిలిపోతున్నామని చెప్తారు

  2. ఆనం కి ఇవ్వలేదా? మీ కాడికి వచ్చి మేము రగిలి పోతున్నాము అని చెప్పారా నాయనా?

Comments are closed.