బాబూ.. జ‌నం చూస్తున్నారు జాగ్ర‌త్త‌!

కూట‌మి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌ను జ‌నం గ‌మ‌నిస్తున్నారు. ఈ విష‌యాన్ని తెలుసుకుని ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం కావ‌డం మంచిది.

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌గ‌న్నామ స్మ‌ర‌ణ‌కే స‌రిపోతున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌జ‌ల‌కు ప‌నికొచ్చే విష‌యాలు త‌క్కువ‌, ప‌ర‌నింద ఎక్కువ అన్న‌ట్టుగా త‌యారైంది. ఏ విష‌యం తీసుకున్నా జ‌గ‌న్ కేంద్రంగానే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ స‌మావేశాలు జ‌గ‌న్‌ను తిట్ట‌డానికేనా? అనే అనుమానం కలిగించేలా వ్య‌వ‌హారాలు సాగుతున్నాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

డిప్యూటీ స్పీక‌ర్‌గా ర‌ఘురామ‌కృష్ణ‌రాజును ఎన్నుకున్నారు. రాజుగారు ఎంతటి మ‌హ‌నీయుడో స‌భ్యులు కొనియాడి వుంటే బాగుండేది. మ‌ధ్య‌లో జ‌గ‌న్‌ను తిట్ట‌డానికి అర‌గంట స‌మ‌యం తీసుకుంటే, ర‌ఘురామ గురించి ఐదు నిమిషాలు మాత్ర‌మే మాట్లాడే ప‌రిస్థితి. రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు, బండ్లు ఓడ‌లు అవుతుంటాయి. ఈ రోజు ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితే రేపు వుంటుంద‌నే గ్యారెంటీ లేదు. కానీ ప్ర‌స్తుత ఈ అధికారం శాశ్వ‌తం అన్న‌ట్టుగా చంద్ర‌బాబు స‌హా అంద‌రూ రెచ్చిపోయి మాట్లాడుతున్నార‌నే అభిప్రాయం జ‌నంలో వుంది.

జ‌గ‌న్‌ను జ‌నం ఓడించారు. అతి త‌క్కువ సీట్ల‌కు ప‌రిమితం చేశారు. చివ‌రికి ఆయ‌న అసెంబ్లీ స‌మావేశాల‌కు కూడా రాలేని ప‌రిస్థితి. ఇంత‌కంటే పెద్ద శిక్ష జ‌గ‌న్‌కు ఉండ‌దు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్‌ను తిడుతూనే వుంటామంటే, కూట‌మి నేత‌ల్ని అడ్డుకునే వాళ్లెవ‌రూ వుండ‌రు. జ‌గ‌న్‌ను తిట్టే ప్ర‌తి తిట్టు ఆయ‌న‌కు ఆశీర్వాదం అవుతుంద‌ని గ‌మ‌నంలో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మ‌న‌ది సెంటిమెంట్ సమాజం.

ఒక మ‌నిషిని ఏకాకిని చేసి, ప‌దేప‌దే చావ‌బాదుతామంటే, కూట‌మి నేత‌లు అనుకుంటున్న‌ట్టుగా లోకం మ‌రీ అంత హృద‌యం లేనిదికాద‌ని గుర్తించుకుంటే మంచిది. అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌ట కూట‌మి నేత‌ల వ్య‌వ‌హారాల్ని స‌మాజం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌డానికి బ‌దులు, గ‌త ప్ర‌భుత్వ పాపాల ఫ‌లితంగా ఏమీ చేయ‌లేక‌పోతున్నామ‌నే సంకేతాల్ని తీసుకెళ్లాల‌ని కూట‌మి స‌ర్కార్ కుట్ర‌ల‌కు తెర‌లేపింద‌ని స‌మాజం గుర్తిస్తోంది.

సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏం చెప్పినా, న‌మ్మ‌డానికి జ‌నం వెర్రి వాళ్లు కాదు. అన్నీ వింటూ, ఎప్పుడేం చేయాలో అప్పుడు త‌గిన రీతిలో గుణ‌పాఠం చెబుతారు. జ‌గ‌న్‌ను తిడుతూ ఐదేళ్లు కాలం గ‌డుపుదామ‌ని అనుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. కూట‌మి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌ను జ‌నం గ‌మ‌నిస్తున్నారు. ఈ విష‌యాన్ని తెలుసుకుని ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం కావ‌డం మంచిది.

ఇంత‌కాలం జ‌గ‌న్ ప్రభుత్వం చేసిన భారీ అప్పుల‌తో ఏమీ చేయ‌లేక‌పోతున్నామ‌న్న చంద్ర‌బాబే, బ‌డ్జెట్‌లో రూ.6.50 ల‌క్ష‌ల కోట్ల లోపు అప్పు చూప‌డంతో జ‌నం షాక్‌కు గురి అయ్యారు. మ‌రి సూప‌ర్ సిక్స్ హామీలు అమ‌లు ఎందుకు చేయ‌లేద‌నే ప్ర‌శ్న మొద‌లైంది. కావున చంద్ర‌బాబు స‌ర్కార్ జ‌గ‌న్నామ స్మ‌ర‌ణ ప‌క్క‌న పెట్టి, పాల‌న‌పై దృష్టి పెట్టాలి.

52 Replies to “బాబూ.. జ‌నం చూస్తున్నారు జాగ్ర‌త్త‌!”

  1. Budget lo RBI ki telisina appuley…corporation debts pending bills…ivanni kalipi 9L crores painey untai….Papam enta leputunnavo…aina janalaki state ki enta appu undi ani evvadu choodadu…monthly expenses perigaya leda ani choostaaru….okavela ekkuva karchulu aina…manam pay chesindaniki govt emi chesindi ani choostaaru…peddayana…navaratnalu ani konta mandikey dabbulu dochi pettadam tappa oooda pekindi emi ledu kada…..Last lo okamata cheppav jagannama smarana tagginchaali ani…daniki nenu kooda accept chesta

  2. కొన్ని వేల ఏళ్ళ క్రితం..

    నరకాసురిడిని చంపినందుకు.. ఇప్పటికీ దీపావళి జరుపుకొంటున్నాము..

    మహిషాసురుడిని చంపినందుకు ప్రతి ఏటా 10 రోజుల పాటు దసరా జరుపుకొంటున్నాము..

    అలాంటిది..

    2019 – 24 అయిదేళ్ల పాటు చీకటి బతుకుల్లో మగ్గి.. జీవితాలు కునారిల్లిపోయిన సందర్భం లో.. జగన్ రెడ్డి అనే రాక్షసుడిని చంపి.. ఆంధ్ర ప్రజల జీవితాలకు వెలుగు ఆనందం తిరిగి పొందినప్పుడు.. సెలెబ్రేషన్స్ అనేవి మామూలుగా ఉండవు..

    అందుకే.. జగన్ రెడ్డి అనే రాక్షసుడిని రాజకీయం గా అంతమొందించిన ఆనందం.. తర్వాతి తరాలకు ఒక పండుగ లా మిగిలిపోవాలి..

    అవును.. జనం చూడాలి.. అందరూ ఆనందం తో నాట్యం చేయాలి.. జీవితాలు బాగు పడినందుకు జగణాసుర సంహారం ప్రతి ఇంటా పండుగలా జరుపుకోవాలి..

      1. సుమారు లక్షన్నర మంది పిల్లలు చదువు మానేశారు..

        ఆరోగ్యశ్రీ 6500 కోట్లు అప్పులు బకాయిలు పడ్డాడు..

        ఇదేనా జగన్ రెడ్డి ఉద్ధరించింది..

        నువ్వు జగన్ రెడ్డి భజన లో కొట్టుకుపో.. మాకు అక్కర్లేని విషయం.. కానీ ఇక్కడ కోట్టకు నీ పనికిమాలిన సొల్లు..

        నీ తీగలు తెగుతాయి..

        1. Maaku nee laaga ka mma picha tho babu bhajana re ddy picha to jagan bhajana cheyyalsina kharma pattaledhu . Jagan roads nasanam chesadu mari babu emi peekaadu ippativaraku ? Public schools brahmandam gaa chesadu.. poyi nee oirlo chusko . TDP administration lo babu Ikkade pani chesthe saripodu . Mantrulu gadidhalu kaasthunnaru. Okkadiki sakha meeda pattu ledhu . Aa sangathi yedu

      1. అప్పుడు వచ్చి ఇక్కడ కామెంట్స్ లో రాసుకో..

        అంతవరకు.. కలలు కంటూ ఉండు..

      2. నాకు అర్ధం కాదు ర.. వాళ అమ్మ కంటే ఎక్కువ తెలుసా నీకు… వాళ్ల అమ్మ నే .. వేదొకో పోరంబోకు అంటుంటే.. మధ్యలో నీ రుద్డుడేంది

  3. మేము అదే చెప్పేది.. జనం చూస్తున్నారు.. వాడిని అసెంబ్లీ కి రమ్మను

  4. అయ్య న్యూట్రల్ ఆంధ్ర 19~24 మధ్యన ఇలాంటిదే సలహా ఎప్పుడైనా ఇచ్చవ.. పుట్టుకలు గురించి మాట్లాడినప్పుడు ? ఇప్పుడు ఎంత చింపుకున్న ప్రయోజనం సున్నా… అన్న పాలన నభూతో నభవిష్యత్…

  5. అమ్మా శుద్ధపూస, ఇదే సుద్దులు మన జగను బాబు కి కూడా గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క సారైనా చెప్పుంటే, కనీసం ప్రతిపక్ష హోదా అయినా వచ్చేదేమో!!

  6. జగన్ మీద సానుభూతి నా?? అసలు జగన్ రాజకీయాలు కి పనికిరాడు.వాడికి సమాజం పట్ల అవగాహన,బాధ్యత అస్సలు లేవు.అర్ధం చేసుకునే మనస్తత్వం లేదు.అపరిమిత అధికారం,సంపాదన కావాలి.స్వార్ధం ,మూరకత్వం వాడి సొంతం..ఎవరిమీద వాడికి సానుభూతి వుండదు. ఇక వాడి మీద ఎవరికి సానుభూతి వుంటుంది?వాడు,వాడి పెళ్ళాం,వాడి డబ్బులు,కేస్ లనుండి తప్పించుకోవడం..వాడికి ముఖ్ఖ్యం. అవినాష్ ని కూడా ఎందుకు వెనకేసుకొచ్చిన నాడు అంటే పులివెందుల లలో వాడు లేకపోతే ఇక వీడి కోసం అక్కడ పని చేసే వాళ్ళు లేరు.చీకటి గదుల్లో కూర్చొని సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్టే సరిపోతుంది.. ప్రభుత్వం మీద వ్యతిరేక త వస్తుంది అనుకున్నాడు..ఇప్పుడు ఇక అది కూడా అవకాశం లేదు..రోడ్డు ల మీద కి రాలే డు….కొత్త పార్టీ పెట్టుకొనే వాళ్ళకి ఇదే మంచి అవకాశం..2029 లో కచ్చితంగా ప్రతిపక్ష స్థానం వస్తుంది.

  7. Choostunnaru. Aithe endi ra GA. poyina 5 years kooda choosaru. chivariki em chesaro choosukunnav gaa. inkaa nee sodi edupu endi ra. People want development. Not these lavada welfare programs. moosukuni koosa ra

  8. జగన్ గారికి ఓటు వేస్తె మన ప్రజాస్వామిక హక్కులను మన పాస్ పుస్తకాలూ మన ఆస్తులను ఆయనకు అయన తాబేదారులకు అప్పచెప్పాలని తటస్థ ఓటర్ లకు తెలుసు కూటమి ఇష్టం లేకపోతె దారెమ్మట పోయేవాడికైనా వేస్తారు కానీ ఈయన గారికి మాత్రం వెయ్యరు అయన కూడా తెలివిగా కాంగ్రెస్ తో పై చేయిగా పొత్తుపెట్టుకోవాలని చూస్తున్నాడు కానీ అది కాంగ్రెస్ కి నష్టం నెక్స్ట్ ఎలక్షన్ లలో కూడా జగన్ రాడు రాలేడు అప్పుడు పార్టీ క్లోజ్ నాయకులూ కూడా మరొక్క ఓటమి చూస్తే మొత్తం పోతారు

  9. అయ్యా గా గారూ ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందంట. మీ నాయకుడు చేసిన దొమ్మీలు ఎక్కడ జరిగినయ్యని MLC ఎన్నికలకి దూరం. మేము బాయకాట్ చేస్తున్నాం అన్నారు. అయినా ఇంకా నోటిఫికేషనే ఇవ్వలే. దౌర్జన్యాలు జరిగినయ్ అంటూ మేము దూరం అంటున్నారు. ఇదంతా ఫేక్ ప్రాపగాండ కదా?

  10. 100% agree with this article . Common man is thinking just babu and only couple of ministers are working . Rest all are not doing much . Babu instead of focusing on administration and his ministers and welfare of state engaging in the mud sliding on jagan to a nauseating degree .Ejay type ka mm a commentators are even more nauseating

    1. నీ జగన్ రెడ్డి మెప్పు కోసమో .. నీ మెప్పు కోసమో నేను కామెంట్స్ రాయను..

      నా కామెంట్స్ చదవడం ఇష్టం లేకపోతే బ్లాక్క్ చేసుకుని కూర్చో… అది నీ ఇష్టం..

Comments are closed.