తల్లి ఆరోగ్యంపై చిరంజీవి ప్రకటన

తన తల్లి మంచం పట్టిందనే కథనాల్ని చిరంజీవి ఖండించారు. తల్లి ఆరోగ్యంపై ప్రకటన చేశారు. ఆమె ఆరోగ్యంగా ఉందన్నారు చిరు.

మొన్ననే తల్లి అంజనాదేవి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు చిరంజీవి. కేక్ కట్ చేసి ఆమెకు తినిపించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ కథనాలు వచ్చాయి.

తన తల్లి మంచం పట్టిందనే కథనాల్ని చిరంజీవి ఖండించారు. తల్లి ఆరోగ్యంపై ప్రకటన చేశారు. ఆమె ఆరోగ్యంగా ఉందన్నారు చిరు.

“మా అమ్మ అనారోగ్యంతో ఉన్నారని, ఆసుపత్రిలో చేరారని మీడియాలో కొన్ని వార్తలు వచ్చినట్టు నా దృష్టికి వచ్చింది. ఆమె ఓ 2 రోజులు అనారోగ్యంతో ఉన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడామె ఆరోగ్యంగా, పూర్తి క్షేమంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం గురించి ఎటువంటి ఊహాజనిత కథనాల్ని ప్రచురించవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను.”

ఇలా తన తల్లి ఆరోగ్యంగానే ఉన్నారనే విషయాన్ని చిరంజీవి స్పష్టం చేశారు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఆమెను చూసేందుకు పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ వచ్చారని వచ్చిన కథనాల్ని చిరంజీవి ఖండించారు.

2 Replies to “తల్లి ఆరోగ్యంపై చిరంజీవి ప్రకటన”

  1. Open call available >>>తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది

Comments are closed.