నాని కథల ఎంపిక విభిన్నంగా ఉంటుంది. మంచి కథలు పట్టుకోవడంలో అతడు దిట్ట. మరి అతడి కథల ఎంపిక ఎలా ఉంటుంది? ఎలాంటి కథకుల్ని అతడు తన వరకు రానిస్తాడు?
“నిజాయితీగా ఉండే కథకులంటే నాకిష్టం. సినిమా హిట్ అవుతుందని కథ చెప్పే వాళ్ల కంటే, నా మనసులో ఓ కథ ఉంది, దాన్ని చెప్పాలని ఉందనేవాళ్లు బాగా నచ్చుతారు. ఓ సూపర్ హిట్ కొడదామని కథ చెప్పే వాళ్ల కంటే, నాకు ఓ కథను అమ్మడానికి ప్రయత్నించేవాళ్ల కంటే, ‘మీరు కొంటే కొనండి లేకపోతే లేదు, నాకు చెప్పాలనిపించిన కథ ఇది’ అంటూ నిజాయితీగా చెప్పేవాళ్లు నాకు బాగా నచ్చుతారు.”
తన వద్దకు కథలు పట్టుకొచ్చే వాళ్లలో ఈ క్వాలిటీ ఉందా లేదా అనే విషయాన్ని ముందుగా చూస్తాడంట నాని. కథ చెప్పే దర్శకుడే మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వలేనప్పుడు, ఆడియన్స్ ను కథలో లీనం చేయలేడనేది నాని లాజిక్.
“ఏదైనా కథలో ఎమోషన్ వర్కవుట్ అవుతుందా లేదా అని ఆలోచించడం కంటే, ఆ కథ చెబుతున్నప్పుడు మనం ఎమోషనల్ అవ్వడం ముఖ్యం. కథ వింటున్నప్పుడే మనకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే, కళ్లు మూసుకొని ఆ కథ చేసేయడమే.”
కథల విషయంలో తన జడ్జిమెంట్ ఇలానే ఉంటుందని, కొన్నేళ్లుగా ఇదే ఫాలో అవుతున్నానని అన్నాడు. ఇప్పటికీ ఓ సామాన్య ప్రేక్షకుడిలానే సినిమాను చూస్తానని, తనలోని నటుడు లేదా నిర్మాత డామినేట్ చేయడని, అది తన అదృష్టమని అంటున్నాడు నాని.
Same sir
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,