సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్

పెళ్లికి సంబంధించి ఓ వెడ్డింగ్ కేక్, స్విట్జర్లాండ్ టూర్ ఫొటోస్ మాత్రం అప్ లోడ్ చేసింది.

బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లుగా టోనీ బేగ్ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ లో ఉంది నర్గీస్. ఇప్పుడు వీళ్లిద్దరూ పెళ్లితో ఒకటయ్యారు.

లాస్ ఏంజెలెస్ లోని బేవర్లీ హిల్స్ లో ఉన్న ఓ స్టార్ హోటల్ లో వీళ్ల వెడ్డింగ్ సెలబ్రేషన్ జరిగింది. అయితే తను పెళ్లి చేసుకున్న విషయాన్ని నర్గీస్ అధికారికంగా వెల్లడించలేదు.

అమెరికాలో పెళ్లి చేసుకొని, అట్నుంచి అటు భర్తతో ఆమె స్విట్జర్లాండ్ వెళ్లిపోయింది. పెళ్లికి సంబంధించి ఓ వెడ్డింగ్ కేక్, స్విట్జర్లాండ్ టూర్ ఫొటోస్ మాత్రం అప్ లోడ్ చేసింది.

టోనీ బేగ్ భారతీయుడే. కశ్మీర్ కు చెందిన కుటుంబం ఇతడిది. కాకపోతే అమెరికాలో స్థిరపడ్డారు. అతడితో 2022 నుంచి డేటింగ్ లో ఉంది నర్గీస్. ఈ విషయాన్ని గతంలో ఆమె పరోక్షంగా వెల్లడించింది కూడా. ఇప్పుడు అతడ్నే వివాహమాడింది.

రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది నర్గీస్. ప్రారంభంలో స్పెషల్ సాంగ్స్ చేసిన ఈమె, ఆ తర్వాత మెల్లగా అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం ఈమె తెలుగులో పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

3 Replies to “సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్”

Comments are closed.