జానీ మాస్టర్ జైలు జీవితం ఇంకాస్త పెరిగింది. పోలీస్ కస్టడీ తర్వాత కోర్టు ముందు అతడ్ని హాజరుపరచగా కోర్టు అతడికి 3వ తేదీ వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ గడువు మరో 4 రోజులు పెరిగింది.
ఇది పోక్సో కేసు కాబట్టి, రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో స్పెషల్ పోక్సో కోర్టులో పిటిషన్ వేయాల్సి వచ్చింది. లాయర్ అదే పని చేశారు. జానీ మాస్టర్ కు బెయిల్ ఇప్పించాల్సిందిగా అభ్యర్థించారు. అయితే ఈ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
కేసు పురోగతి కీలక దశలో ఉన్న కారణంగా, ఉన్నఫలంగా జానీ మాస్టర్ కు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. 7వ తేదీకి ఈ బెయిల్ పిటిషన్ పై వాదనలను వాయిదా వేసింది. దీంతో వచ్చే సోమవారం వరకు జానీ మాస్టర్ జైళ్లోనే ఉండబోతున్నాడు.
కోర్టు అనుమతితో జానీ మాస్టర్ ను తమ కస్టడీకి తీసుకున్న పోలీసులు, 4 రోజుల పాటు సుదీర్ఘంగా అతడ్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. విచారణలో జానీ మాస్టర్ చెప్పిన విషయాలతో పాటు, బాధితురాలు ఇచ్చిన సమాచారంతో ప్రస్తుతం ఛార్జ్ షీట్ తయారుచేసే పనిలో ఉన్నారు.
ఛార్జ్ షీట్ కోర్టుకు సమర్పించిన తర్వాత అందులో ఉన్న విషయ తీవ్రత ఆధారంగా జానీ మాస్టర్ కు బెయిల్ ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని కోర్టు నిర్ణయిస్తుంది. ఈ కేసుకు సంబంధించి మరోసారి జానీ మాస్టర్ ను తమ కస్టడీకి కోరుతూ పోలీసులు ఇప్పటివరకు పిటిషన్ వేయలేదు.
Call boy jobs available 9989793850
దయ చేసి వాడిని మాస్టర్ అని పేర్కొనవద్దు.