క్రిమినల్ సన్నాఫ్ పోలీస్ ఆఫీసర్

ట్రయిలర్ ఎలా వుందీ అంటే కాస్త వింటేజ్ ఫీల్ వుంది. అంటే గతంలో వచ్చిన మాస్ కమర్షియల్ సినిమాల ఫీల్ అనుకోవాలి.

పెద్దగా కొత్త పాయింట్ కాదు. ఓ సిన్సియర్, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కొడుకు క్రిమినల్ గా కనిపిస్తే.. ఆద్యంతం అలాగే వుంటూ, కానీ అసలు కథ వేరే వుంటే, చివరకు విలన్లు ఆట కట్టించి, తాను విలన్ కాదు హీరో అంటూ చాటితే…ఈవారం విడుదల కాబోయే అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ట్రయిలర్ చెప్పింది ఇదే. తల్లి కొడుకుల సెంటిమెంట్ ను తోడు చేసుకుని కమర్షియలర్ టచ్ ఇస్తూ చేసిన సినిమాగా కనిపిస్తోంది.

సీనియర్ హీరోయిన్ విజయశాంతి తల్లిగా, కళ్యాణ్ రామ్ కొడుకు గా కనిపిస్తున్నారు. తల్లి కొడుకుల మధ్య బేధాలు ఎందుకు? అవి అలా వుండగానే కొడుకు తన బాధ్యత తాను ఎలా నిర్వహిస్తున్నాడు, విలన్ ను ఎలా అడ్డుకున్నాడు అన్నది క్లియర్ గా చెప్పేసారు.

ట్రయిలర్ ఎలా వుందీ అంటే కాస్త వింటేజ్ ఫీల్ వుంది. అంటే గతంలో వచ్చిన మాస్ కమర్షియల్ సినిమాల ఫీల్ అనుకోవాలి. అయితే ట్రయిలర్ కట్ చూస్తే 80 శాతం యాక్షన్, 20 శాతం సెంటిమెంట్ అన్నట్లు వుంది. సినిమా ఇలా వుండదు. ఫిఫ్టీ ఫిఫ్టీగా వుండే అవకాశం వుంది.

ఎందుకంటే తల్లీ కొడుకుల మధ్య వైరుధ్యం, అది ఎలా ముందుకు వెళ్లింది, తల్లి ఎలా వుంటోంది..కొడుకు ఏం చేస్తున్నాడు అన్నదే తొలిసగం వరకు నడపాల్సి వుంటుంది. మలిసగం మొత్తం విలన్ మీదకు వెళ్లాలి. అందువల్ల ట్రయిలర్ కట్ వున్నట్లు సినిమా వుండకపోచవ్చు. యాక్షన్ సీన్లు బాగున్నాయి. సెంటిమెంట్ సీన్లు పెద్దగా ట్రయిలర్ లోకి తీసుకురాలేదు. ఫన్ ను యాడ్ చేయలేదు. అందువల్ల ట్రయిలర్ లో లేనిది సినిమాలో చాలా వుంటుంది. వెయిట్ అండ్ సీ.

2 Replies to “క్రిమినల్ సన్నాఫ్ పోలీస్ ఆఫీసర్”

  1. criminal s/o criminal.. ఎవరో guess చేయండి చూద్దాం!! చిన్న clue — తల్లీ, షెల్లీ మీద కేసు పెట్టిన ఘనుడు!! సొంత బాబాయ్ ని వేసేసిన పెద్ద మనిషి!! శవం చూస్తే సంబరపడే మానవతావాది etc etc..

Comments are closed.