Advertisement

Advertisement


Home > Movies - Movie News

సౌతిండియా మోస్ట్ వాంటెడ్ న‌టుడు అవుతున్నాడు!

సౌతిండియా మోస్ట్ వాంటెడ్ న‌టుడు అవుతున్నాడు!

అత‌డిని సొంత చిత్ర ప‌రిశ్ర‌మ చాన్నాళ్ల కింద‌టే గుర్తించింది. మామూలుగా అయితే అత‌డి ప్ర‌భ సొంత భాష‌కే ప‌రిమితం అయ్యేదేమో కానీ, ఓటీటీల పుణ్య‌మా అని ప‌క్క భాష‌ల వాళ్ల దృష్టిలో ప‌డ్డాడు ఫ‌హాద్ ఫాజిల్. 

సాధార‌ణంగా స్టార్ హీరోల‌కూ, బీభ‌త్స‌మైన విల‌నీని ప్ర‌ద‌ర్శించ‌గ‌ల వారికే ప‌క్క భాష‌ల ఆఫ‌ర్లు తేలిక‌గా వ‌స్తూ ఉంటాయి. మ‌ల‌యాళంలో ఈ రెండింటికీ భిన్న‌మైన రీతిలో సాగింది ఫ‌హాద్ కెరీర్. అయితే ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ న‌టుడిగా మారుతున్నాడు. 

ఒక‌వైపు పుష్ప సినిమాలో విల‌న్ గా ఎంపికైన ఫ‌హాద్ కు క‌మ‌ల్ హాస‌న్ సినిమాలోనూ ఛాన్స్ ల‌భించింది. క‌మ‌ల్ హీరోగా న‌టిస్తున్న విక్ర‌మ్ సినిమాలో ఫ‌వాద్ న‌టిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఈ రెండూ భారీ అంచ‌నాల సినిమాలే. ఇన్నాళ్లూ మ‌ల‌యాళంలో ప‌రిమిత మార్కెట్ కు ప‌రిమితం అయిన ఫ‌వాద్ ఇలా సౌత్ లోనే అత్యంత భారీ అంచ‌నాల మ‌ధ్య‌న విడుద‌ల కాబోతున్న సినిమాల్లో కీల‌క పాత్రలు చేస్తున్నాడు.

విశేషం ఏమిటంటే.. ఫ‌హాద్ తండ్రి కూడా మ‌ల‌యాళం ఆవ‌ల మూవీ మేక‌ర్ల‌ను ఆక‌ర్షించిన క‌ళాకారుడే. మ‌ల‌యాళంలో స్టార్ డైరెక్ట్ అయిన ఫాజిల్ ఆ త‌ర్వాత ఒక ద‌శ‌లో తెలుగు మూవీ మేక‌ర్ల‌ను కూడా ఆక‌ర్షించారు. తెలుగులో నాగార్జున హీరోగా న‌టించిన 'కిల్ల‌ర్' సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ల‌యాలంలో ఫాజిల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప‌లు సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?