తెలుగు చిత్రసీమ మరో మంచి నటుడ్ని కోల్పోయింది. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఈరోజు ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలకు పైనే.
టాలీవుడ్ దిగ్గజ నటులందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు గిరిబాబు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు నుంచి.. ఈతరం నటుల వరకు ఎంతోమందితో ఆయన కలిసి నటించారు. కెరీర్‌లో 600కు పైగా సినిమాలు చేసిన ఆయన అసలు పేరు శేషగిరిరావు.
ప్రకాశం జిల్లాలో జన్మించిన గిరిబాబుకు నాటకాలంటే పిచ్చి. చిన్నప్పుడు నాటకాలు చూసి పెరిగిన ఈయనకు అందులో నటించాలనే కోరిక కలిగింది. అయితే పెద్దయిన తర్వాత నాటకాల కంటే సినిమా రంగం ఆయన్ను మరింత ఆకర్షించింది. అలా సినిమాల్లో రాణించాలనే కోరికతో చెన్నై వెళ్లారు.
చాలామంది నటుల్లా గిరిబాబు కూడా హీరో అవ్వాలనుకున్నారు. కానీ పరిశ్రమలో అడుగుపెట్టిన కొన్నేళ్లకే ఆయన విలన్ అయ్యారు. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్‌కు షిఫ్ట్ అయ్యారు. ఒక దశలో కమెడియన్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.
అలా తన కెరీర్‌లో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు గిరిబాబు. కేవలం నటనకే పరిమితం కాకుండా, దర్శకుడిగా కూడా మారారు. 3 సినిమాలు తెరకెక్కించారు. అదే టైమ్‌లో 4 సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. గిరిబాబు కుమారుడు రఘుబాబు, ప్రస్తుతం ఇండస్ట్రీలో లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు.
వందలాది సినిమాలతో పాటు క్రమశిక్షణ కలిగిన నటుడిగా, ఓ మంచి మనిషిగా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు గిరిబాబు. వివాదాలకు దూరంగా ఉంటూ అందరివాడు అనిపించుకున్నారు. గిరిబాబు కన్నుమూతతో తెలుగు చిత్ర పరిశ్రమ మరో మంచి నటుడ్ని కోల్పోయింది.

ఓం శాంతి. ఈయన కానీ, కొడుకులు కానీ చాలా మంచి వాళ్ళు. మా చిన్నప్పుడు వీళ్ళ ఊరు రావినూతల లో సంక్రాంతి చాలా బాగా చేసీవాళ్ళు. అప్పుడు చూసాం. గుర్తు పెట్టుకొని పేరు పేరున పలకరించే వారు. రఘు బాబు గారు, తర్వాత అలాగే చేసేవాళ్ళు. ఈ మధ్య చేస్తున్నారో లేదో నాకు తెలీదు కానీ మనుషులు మాత్రం అలా గుర్తుండి పోయారు.
Sweet memories
REST IN PEACE __/\__
Giribabu unte cinemalorepu guarantee ..
Legendary actor🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
He is legendary and such a nice person
Dhevathalara Dheevinchandi.
లెజండ్
Athyidhkarepula villan
what a legend. his acting in chitram bhalare vichitram is beyond words.