‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ‘డ్రాగన్’ కారణంగా మరోసారి గ్యాప్ వస్తోంది. ఇది చాలదన్నట్టు త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి.
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కే దాదాపు ఏడాది పడుతుందని, ఆ తర్వాత చిత్రీకరణకు మరో ఏడాది పడుతుందని, గతంలో ఓ సందర్భంలో నాగవంశీ చెప్పుకొచ్చారు. సో.. ‘గాడ్ ఆఫ్ వార్’ మొదలుపెడితే ఎన్టీఆర్ కెరీర్ లో మరో పెద్ద గ్యాప్ తప్పదు.
అందుకే ఆయన అదిరిపోయే ప్లాన్ వేశారు. త్రివిక్రమ్ సినిమా కంటే ముందు చకచకా మరో సినిమా చేయబోతున్నారు. అదే అనీల్ రావిపూడి సినిమా. ఈ సినిమాను స్వయంగా ఎన్టీఆర్ ప్రకటించారు. పైగా ఇది పూర్తిగా వినోదభరిత చిత్రమని కూడా అంటున్నారాయన.
అనీల్ రావిపూడితో వర్కింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చకచకా సినిమా షూటింగ్ పూర్తి చేసి, ఫస్ట్ కాపీ రెడీ చేస్తాడు. అలాంటి స్పీడున్న డైరక్టర్ ఇప్పుడు ఎన్టీఆర్ కు కావాలి. పైగా ‘అదుర్స్’ లాంటి కామెడీ సబ్జెక్ట్ కోసం చాన్నాళ్లుగా తారక్ వెయిటింగ్.
ఇన్నాళ్లకు అన్నీ సెట్ అయ్యాయి. రావిపూడి చెప్పిన కథ ఎన్టీఆర్ కు తెగ నచ్చేసింది. వెంటనే అతడితో దిగిన ఫొటోను పోస్ట్ చేసి మరీ సినిమాను ప్రకటించేశాడు.
సో.. ‘డ్రాగన్’ తర్వాత వీలైనంత త్వరగా అనీల్ రావిపూడి సినిమాను పూర్తిచేసి విడుదల చేస్తాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రానికి ఎంత కావాలంటే అంత టైమ్ ఇస్తాడు.
సో.. అటు త్రివిక్రమ్ హ్యాపీ, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ. అందుకే అంటారు ఎన్టీఆర్ ప్లానింగ్ అదుర్స్ అని.

సినిమా చూసి ఆడియన్స్ బెదుర్స్ కాకపోతే చాలు…..
Anni rotta combo