అది ప్రేక్షకులకు అనవసరం – హరీశ్ శంకర్

ఓ సినిమాకు మూలం ఏంటి.. ఎక్కడ బీజం పడిందనే విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రతి ప్రేక్షకుడికి ఉంటుంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోతో సినిమా అన్నప్పుడు ప్రాజెక్టు ఎలా సెట్ అయిందనే క్యూరియాసిటీ అందర్లో…

ఓ సినిమాకు మూలం ఏంటి.. ఎక్కడ బీజం పడిందనే విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రతి ప్రేక్షకుడికి ఉంటుంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోతో సినిమా అన్నప్పుడు ప్రాజెక్టు ఎలా సెట్ అయిందనే క్యూరియాసిటీ అందర్లో ఉంటుంది.

పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కలిసి చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో ఈ ఆసక్తి ఇంకాస్త ఎక్కువే ఉంది. ఎందుకంటే, ఇది తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయిన తేరీ సినిమాకు రీమేక్.

దీన్ని రీమేక్ చేయాలనే ఆలోచన హరీశ్ శంకర్ కు వచ్చిందా, లేక పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయమా..? ఈ విషయం ప్రేక్షకులకు అనవసరం అంటున్నాడు హరీశ్ శంకర్.

“తేరీ రీమేక్ చేయాలనే నిర్ణయం ఎవరిది అనే ప్రశ్నకు నేను గానీ, పవన్ కల్యాణ్ గాని, మా నిర్మాతలు గానీ జవాబుదారీ కాదు. తేరీ సినిమా రీమేక్ ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నకు నేను జవాబు చెబుతాను. తేరీ రీమేక్ చేయాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ప్రేక్షకులకు అనవసరం. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు.. తేరీ కథ చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడు ఆ రూమ్ లో ఎవరున్నారు, ఎవరు మాట్లాడారు అనే విషయం అనవసరమైన క్యూరియాసిటీ కిందకు వస్తుంది. ఈ ప్రశ్నకు నేను, నా హీరో, నా నిర్మాతలు జవాబుదారీ కాదు. మాకు నచ్చిన సినిమా మేం చేస్తాం, అది నచ్చిందా నచ్చలేదా అనేది రిలీజయ్యాక ప్రేక్షకులు చెప్పాలి.”

తేరీ రీమేక్ ఆపేయమని తనపై భారీ ట్రోలింగ్ జరిగిందని, కానీ తను ఆపలేదని చెప్పుకొచ్చాడు హరీశ్. 2 లక్షల మంది సోషల్ మీడియాలో దాడిచేస్తేనే నేను నా పని ఆపలేదని, రీమేక్ గురించి ఎవరో ఏదో ప్రశ్నిస్తే నేను ఎందుకు సమాధానం చెప్పాలని తిరిగి ప్రశ్నించాడు.

5 Replies to “అది ప్రేక్షకులకు అనవసరం – హరీశ్ శంకర్”

Comments are closed.