వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని టీడీపీలో భ‌యం!

ముస్లింల‌లో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని టీడీపీ భ‌య‌ప‌డుతోంది. కేంద్రంలో ఎన్డీఏ స‌ర్కార్‌ వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టింది. దీన్ని ఇండియా కూట‌మి తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకించింది. ఈ ద‌ఫా వైసీపీ కూడా అంతే తీవ్రంగా…

ముస్లింల‌లో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని టీడీపీ భ‌య‌ప‌డుతోంది. కేంద్రంలో ఎన్డీఏ స‌ర్కార్‌ వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టింది. దీన్ని ఇండియా కూట‌మి తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకించింది. ఈ ద‌ఫా వైసీపీ కూడా అంతే తీవ్రంగా బిల్లును వ్య‌తిరేకించి ముఖ్యంగా మోదీ స‌ర్కార్‌కు షాక్ ఇచ్చింది. మ‌రోవైపు టీడీపీ స‌మ‌ర్థించింది. ఎన్డీఏలో భాగ‌స్వామి అయిన టీడీపీకి మ‌రో గ‌త్యంత‌రం లేదు.

ఈ నేప‌థ్యంలో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును ముస్లిం స‌మాజం తీవ్రంగా త‌ప్పు ప‌డుతోంది. ఈ బిల్లు వ‌ల్ల ముస్లింల‌కు చాలా న‌ష్ట‌మ‌ని వారిలో ఆందోళ‌న క‌నిపిస్తోంది. ముస్లింల ఆందోళన‌ల్ని సీఎం చంద్ర‌బాబునాయుడి దృష్టికి ఆ పార్టీ నాయ‌కులు తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు చేసేదేమీ లేదు. ఎందుకంటే పార్ల‌మెంట్‌లో బిల్లుకు టీడీపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. టీడీపీ అనుకూల మీడియా వ‌క్ఫ్ బిల్లు విష‌య‌మై ముఖ్యంగా వైసీపీ వ్య‌తిరేకించింద‌నే విష‌యాన్ని ఎక్క‌డా రాయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అలా రాస్తే వైసీపీకి రాజ‌కీయంగా మేలు చేసిన‌ట్టు అవుతుంద‌నే భ‌యాన్ని ఆ మీడియాలో క‌నిపిస్తోంది. వ‌క్ఫ్ బిల్లుకు వైసీపీ వ్య‌తిరేకంగా వుండ‌డంపై ఎన్డీఏ స‌ర్కార్ ఎలా తీసుకుంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. వైసీపీపై క‌క్ష‌తో ఏవైనా చ‌ర్య‌ల‌కు దిగుతారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ముందుగా ప్ర‌జ‌ల్లో బాగుంటే త‌ప్ప‌, మోదీ అయినా మ‌రెవ‌రైనా ఆద‌రించ‌ర‌నేది వాస్త‌వం. ప్ర‌స్తుతం వైసీపీ పార్ల‌మెంట్‌లో వ్య‌వ‌హ‌రించిన తీరు ఆ పార్టీకి రాజ‌కీయంగా ల‌బ్ధి క‌లిగిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

17 Replies to “వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని టీడీపీలో భ‌యం!”

  1. ఆ చట్టాలు అడ్డుపెట్టుకొని ఇప్పటి వరకు మీరు దోచుకున్నది మొత్తం కక్కిస్తారులే GA….wait చెయ్….మైనారిటీ వాళ్ళు అందరూ కూడా చదువుకున్నారు , చదువుకుంటున్నారు GA….. మీ దొంగ డ్రామాలు ఇంకా ఎవరూ నమ్మరు GA…😂😂

  2. జిఏ, సాక్షి ఎన్నో చెత్తలు రాసి రాసి రాసి ఏం ఉపయోగ పడింది జగన్ కు? 11 కు అంత చెత్తా?

  3. If at all there is advantage it will be Congress party. Sharmila will publicize that it is Congress that opposed the bill. No more advantages for YSRCP in AP. జనం విసుగెత్తిపోయారు జగన్ పరిపాలనతో.

  4. I appreciate jagan this time , condemning the bill. It’s a tit-for-tat for what modi did to AP people coming into alliance with CBN, in spite of his abusive ill-treatment and lost respect and love on him. Kudos jagan at least this time

  5. బాంగ్లాదేశ్ లొ హిందువుల మీద జరుగుతున్న అరాచకాలు ఒక్కటి కూడా ఈ సైట్ లొ రావు

  6. ఈ విషయాన్నీ మెజారిటీ హిందుస్ గమనించాలి. ఓట్ల కోసం Y CP వాక్ట్ బోర్డు విషయం లో central govt కీ వ్యతిరేకమట. అన్ని ఓట్ల రాజకీయాలె!?

      1. ఎరా ఫహీమ్ .. హిందూ దేశం లో పుట్టి హిందువులని అడుగుతున్నావా ఎక్కడనుంచి వచ్చారు అని .. ఎంత బలిసి కొట్టుకుంటాన్నావు

Comments are closed.