ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు బెయిల్‌!

ఢిల్లీ మాజీ ఉప ముఖ్య‌మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియ‌ర్ నేత మ‌నీష్ సిసోడియాకు సుదీర్ఘ కాలం త‌ర్వాత బెయిల్ ల‌భించింది. లిక్క‌ర్ స్కామ్‌లో సిసోడియాను సీబీఐ, ఈడీ గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో అరెస్ట్…

ఢిల్లీ మాజీ ఉప ముఖ్య‌మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియ‌ర్ నేత మ‌నీష్ సిసోడియాకు సుదీర్ఘ కాలం త‌ర్వాత బెయిల్ ల‌భించింది. లిక్క‌ర్ స్కామ్‌లో సిసోడియాను సీబీఐ, ఈడీ గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో అరెస్ట్ చేశాయి.

అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న భార్య‌ను చూడ‌డానికి మాత్రం ఒక సంద‌ర్భంలో సిసోడియాకు న్యాయ స్థానం అనుమ‌తి ఇచ్చింది. అరెస్ట్ త‌ర్వాత అనేక సంద‌ర్భాల్లో బెయిల్ కోసం సిసోడియా విశ్వ ప్ర‌యత్నం చేశారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది.

సిసోడియా బెయిల్ పోరాటానికి ఎట్ట‌కేల‌కు ఇవాళ్టికి ఫ‌లితం ద‌క్కింది. సుప్రీంకోర్టులో సిసోడియాకు ఊర‌ట ల‌భించింది. ఈ మేర‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు శుక్ర‌వారం తీర్పు వెలువ‌రించింది. బెయిల్‌పై ఉన్నంత కాలం దేశం విడిచి వెళ్ల‌కూడ‌ద‌ని, పాస్‌పోర్ట్‌ను స‌రెండ‌ర్ చేయాల‌ని సుప్రీంకోర్టు ష‌ర‌తులు విధించడం గ‌మ‌నార్హం.

సిసోడియా బెయిల్‌ను వ్య‌తిరేకించిన సీబీఐ, ఈడీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఇదిలా వుండ‌గా ఇదే కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఎన్నిక‌ల ప్ర‌చారం నిమిత్తం కేజ్రీవాల్‌కు న్యాయ స్థానం బెయిల్ ఇచ్చింది.

అనంత‌రం ఆయ‌న తిరిగి లొంగిపోయారు. ప్ర‌స్తుతం తీహార్ జైల్లో కేజ్రీవాల్ ఉన్నారు. సీఎం ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేయ‌ని సంగ‌తి తెలిసిందే. సిసోడియా మాదిరిగానే కేజ్రీవాల్ కూడా బెయిల్ కోసం చేస్తున్న న్యాయ పోరాటం ఎప్పుడు స‌త్ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.

7 Replies to “ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు బెయిల్‌!”

    1. B0 గ @M పువ్వు కి పుట్టిన.. B0 గ @M వెధవ… 23 కేసులలో స్టే లు తెచ్చుకున్న.. మీ అమ్మగారి.. ని అందరి పక్కలోకి పంపే.. ఆ బొల్లి బాబు గాడిని … కోర్టులు ఒక్కసారి.. స్టే లు ఎత్తేసి.. అన్ని కేసులు వినటం మొదలెడితే.. ఇక బైటికే రాకుండా.. లోపలే.. చచ్చిపోతాడు కదర L@ nj @ K0 D@ K@.

      రిప్లై ఇయ్యార … ఈ లోపల.. మీ అమ్మగారి లేత తమలపాకు లాంటి.. పువ్వులో నా మొగ్గ పెట్టి గుడిపి వచ్చేస్తా !

Comments are closed.